సునీతా సింగ్ అమృతసర్ పంజాబ్లో 1974 ఫిబ్రవరి 22న జన్మించింది. ఆమెని సునీతా కనోజియా అని కూడా పిలుస్తారు. ఈమె ఒక భారత మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె ప్రధానంగా కుడిచేతి వాటం మీడియం బౌలర్. ఆమె 2000, 2002 మధ్య భారతదేశం తరపున రెండు టెస్ట్ మ్యాచ్ లు, 18 ఒక రోజు అంతర్జాతీయ పోటీలలో ఆడింది. ఆమె ఎయిర్ ఇండియా, రైల్వేస్ కోసం దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

సునీతా సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సునీతా సింగ్
పుట్టిన తేదీ (1974-02-22) 1974 ఫిబ్రవరి 22 (వయసు 50)
అమృతసర్, భారతదేశము
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడిచేయి మీడియం బౌలింగ్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 59)2002 19 మార్చ్ - దక్షిణ ఆఫ్రికా తో
చివరి టెస్టు2002 ఆగస్టు 14 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 58)2000 2 డిసెంబర్ - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2002 11 ఆగస్ట్ - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1994/95ఎయిర్ ఇండియా
1995/96–2001/02రైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 2 18 10 55
చేసిన పరుగులు 6 24 41 70
బ్యాటింగు సగటు 6.00 4.00 20.50 6.36
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 6 నాట్ అవుట్ 12 24 14 నాట్ అవుట్
వేసిన బంతులు 318 790 820 1,913
వికెట్లు 3 12 21 48
బౌలింగు సగటు 35.33 28.83 17.60 22.04
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 1/13 2/8 5/30 3/20
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 4/– 4/–
మూలం: CricketArchive, 2022 19 ఆగస్ట్

ఆమె తన మొదటి టెస్ట్ మ్యాచ్ దక్షిణ ఆఫ్రికాతో 2002 మార్చి లోను, రెండవది 2002 ఆగస్టులో ఇంగ్లాండ్ తో ఆడింది. ఒక రోజు అంతర్జాతీయ పోటీలు 2000 డిసెంబరులో నెదర్లాండ్స్ తో ఆరంభం చేసింది. 2002 ఆగస్టులో ఇంగ్లాండ్ తో తన చివరి మ్యాచ్ ఆడింది.

సూచనలు

మార్చు
  1. "Player Profile: Sunita Singh". ESPNcricinfo. Retrieved 19 August 2022.
  2. "Player Profile: Sunita Singh". CricketArchive. Retrieved 19 August 2022.