సునీల్ ఛత్రపాల్ కేదార్

సునీల్ ఛత్రపాల్ కేదార్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సావనీర్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పశుసంవర్ధక, క్రీడా, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

సునీల్ ఛత్రపాల్ కేదార్
సునీల్ ఛత్రపాల్ కేదార్


పశుసంవర్ధక, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు * చంద్రకాంత్ బచ్చు పాటిల్
  • ఆశిష్ షెలార్

వార్ధా జిల్లా ఇంచార్జి మంత్రి
పదవీ కాలం
09 జనవరి 2020 – 29 జూన్ 2022
ముందు -
నియోజకవర్గం సావనీర్

సావనీర్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-04-07) 1961 ఏప్రిల్ 7 (వయసు 63)
నాగపూర్, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్

సునీల్ కేదార్‌‌ నాగపూర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో 2023 డిసెంబర్ 24న మహారాష్ట్ర అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా అనర్హతకు గురయ్యాడు.[2]

రాజకీయ జీవితం

మార్చు

సునీల్ ఛత్రపాల్ కేదార్ 1992లో నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన 1995లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సావనెర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై విద్యుత్, రవాణా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, 1996లో ఓడరేవుల శాఖ మంత్రిగా పని చేశాడు. సునీల్ 2004లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014, 2019లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై[3] 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పశుసంవర్ధక, క్రీడా, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.

మూలాలు

మార్చు
  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Andhrajyothy (24 December 2023). "ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ మాజీ మంత్రి". Archived from the original on 25 December 2023. Retrieved 25 December 2023.
  3. "Maharashtra Results: Full list of winning candidates" (in ఇంగ్లీష్). 24 October 2019. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.