సుబ్బరామన్ విజయలక్ష్మి

చెస్ క్రీడాకారిణి

ఎస్. విజయలక్ష్మి(జననం 1979 మార్చి 25) భారతీయ చెస్ క్రీడాకారిణి. ఆమె FIDE టైటిళ్ళు ఇంటర్నేషనల్ మాస్టర్ (IM), ఉమెన్ గ్రాండ్ మాస్టర్ (WGM) కలిగి ఉంది.[1] భారతదేశంలో ఈ టైటిల్స్ సాధించిన మొదటి మహిళా క్రీడాకారిణి. అంతేకాకుండా భారతదేశం తరఫున చెస్ ఒలింపియాడ్స్‌లో ఆమె అందరికంటే ఎక్కువ పతకాలు సాధించింది. ఆమె సీనియర్ టైటిల్‌తో సహా జాతీయ స్థాయిలో దాదాపు అన్ని ఏజ్ గ్రూపు టైటిల్‌లను గెలుచుకుంది.

సుబ్బరామన్ విజయలక్ష్మి
2018లో ఎస్. విజయలక్ష్మి
దేశం భారతదేశం
పుట్టిన తేది (1979-03-25) 1979 మార్చి 25 (వయసు 45)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
టైటిల్ఇంటర్నేషనల్ మాస్టర్ (2001)
ఉమెన్ గ్రాండ్ మాస్టర్ (2001)
ఫిడే రేటింగ్2332 (మార్చి 2020)
అత్యున్నత రేటింగ్2485 (అక్టోబరు 2005)

కెరీర్ మార్చు

1986లో తాల్ చెస్ ఓపెన్ ఆమె ఆడిన మొదటి టోర్నమెంట్. 1988లో, 1989లో U10 బాలికల విభాగంలో ఆమె భారత ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. U12 విభాగంలో కూడా ఆమె రెండుసార్లు గెలిచింది.

వ్యక్తిగత జీవితం మార్చు

చెన్నైలో పుట్టిన ఆమె తండ్రి దగ్గరే చదరంగం ఆట నేర్చుకుంది.[2] ఆమె భారత గ్రాండ్ మాస్టర్ శ్రీరామ్ ఝాను వివాహం చేసుకుంది. ఆమె సోదరీమణులు సుబ్బరామన్ మీనాక్షి ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కాగా సుబ్బరామన్ భానుప్రియ కూడా చెస్ క్రీడాకారిణే కావడం విశేషం.

అవార్డులు మార్చు

2000లో భారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది.

మూలాలు మార్చు

  1. Sagar Shah (25 March 2015). "Vijayalakshmi, India's first WGM". ChessBase. Retrieved 6 November 2015.
  2. D.K. Bharadwaj (13 May 2003). "A big boom in the brain game". Press Information Bureau, Government of India.