సుభాష్ సర్కార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 జూలై 8 నుండి కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

డా. సుభాష్ సర్కార్
సుభాష్ సర్కార్


కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జులై 2021
అన్నపూర్ణ దేవి & రాజ్ కుమార్ రంజన్ సింగ్ లతో సంయుక్తంగా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు సంజయ్ ధోత్రే

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
ముందు మూన్ మూన్ సేన్
నియోజకవర్గం బంకురా

వ్యక్తిగత వివరాలు

జననం (1953-11-25) 1953 నవంబరు 25 (వయసు 71)
బంకురా, పశ్చిమ బెంగాల్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి చందాన సర్కార్
పూర్వ విద్యార్థి కలకత్తా యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి వైద్యుడు
సంతకం సుభాష్ సర్కార్'s signature
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

సుభాష్ సర్కార్ బంకూర క్రిస్టియన్ కాలేజీ నుంచి మెడసిన్ పూర్తి చేసి గైనకాలజీ విభాగంలో మెడకల్ ప్రాక్టిషనర్ పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2013 నుండి 2015 వరకు బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా, 2015 నుండి 2017 వరకు బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన 2019లో బంకురా పార్లమెం ట్ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 జూలై 8 నుండి కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

మూలాలు

మార్చు
  1. Lok Sabha (2019). "Dr. Subhas Sarkar". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
  2. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. Namasthe Telangana (7 July 2021). "మోదీ మంత్రివర్గంలో కొత్తగా నలుగురు డాక్టర్లు". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.