మూన్ మూన్ సేన్

నటి

మూన్ మూన్ సేన్ (జననం:28 మార్చి 1954)[1] ఒక భారతీయ సినిమా నటి. ఈమె బెంగాలీ, హిందీ,తమిళ, తెలుగు, మలయాళ, మరాఠీ, కన్నడ భాషా చిత్రాలలో నటించింది. ఈమె సుమారు 60 చలనచిత్రాలు, 40 టెలివిజన్ సీరియళ్లలో నటించింది. ఈమె 1987లో సిరివెన్నెల చిత్రంలోని నటనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం పొందింది.

మూన్ మూన్ సేన్
మూన్ మూన్ సేన్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు బాసుదేవ్ ఆచార్య
తరువాత సుభాష్ సర్కార్
నియోజకవర్గం బంకురా నియోజకవర్గం, పశ్చిమ బెంగాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-03-28) 1954 మార్చి 28 (వయసు 70)[1]
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి భరత్ దేవ్ వర్మ
సంతానం రైమా సేన్
రియా సేన్
నివాసం కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
పూర్వ విద్యార్థి జాదవ్‌పూర్ యూనివర్సిటీ - (ఎం.ఎ.)
వృత్తి చలనచిత్ర నటి
మతం హిందూ

ప్రారంభ జీవితం

మార్చు

ఈమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రా సేన్, దీపనాథ్ సేన్ దంపతులకు కోల్‌కాతాలో జన్మించింది. ఈమె తండ్రి కోల్‌కాతాలోని అత్యంత ధనిక వ్యాపారులలో ఒకరైన ఆదినాథ్ సేన్. ఈమె ముత్తాత దీనానాథ్ సేన్ త్రిపుర మహారాజా వద్ద దివాన్‌గా పనిచేశాడు.

ఈమె షిల్లాంగ్ లోని లోరెటో కాన్వెంట్‌లో, కోల్‌కాతాలోని లోరెటో హౌస్‌లో చదివింది. ఈమె ఆక్స్‌ఫర్డ్ లోని సోమర్‌విల్లె కాలేజీలో డిగ్రీ చదివింది. అనంతరం కోల్‌కాతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి తులనాత్మక సాహిత్యంలో స్నాతకోత్తర పట్టాను పొందింది. [2]

ఈమె బాల్యంలో ప్రముఖ చిత్రకారుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత జెమినీ రాయ్ వద్ద చిత్రలేఖనం అభ్యసించింది.[3] ఈమెకు వర్ణచిత్రాలన్నా, పురాతన వస్తువులన్నా ఎక్కువ ఇష్టం. ఈమె సినిమాలలో నటించడానికి ముందు ఇంగ్లీషు, గ్రాఫిక్స్ బోధించే ఉపాధ్యాయినిగా పనిచేసింది.[4] ఈమెకు సంఘసేవ పట్ల కూడా ఎక్కువ మక్కువ ఉంది. ఈమె వివాహం చేసుకోక ముందే ఒక శిశువును దత్తత తీసుకుంది.[2]

వృత్తి

మార్చు

నటిగా

మార్చు

మూన్ మూన్ సేన్ తన వివాహం జరిగి, పిల్లలు పుట్టిన తరువాత సినిమాలు, టెలివిజన్‌లలో నటించడం మొదలు పెట్టింది. ఈమె 1984లో విడుదలైన అందర్ బాహర్ సినిమా ద్వారా తన నటనా జీవితాన్ని ఆరంభించింది. [5] ఆ చిత్రంలో ఈమె పాత్ర చూపిన తెగువ వివాదాలను, ప్రకంపనలను సృష్టించింది.

ఈమె తన తల్లి సుచిత్రా సేన్ వలె నటిగా ఎక్కువగా రాణించలేక పోయింది. ఈమె ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సిరివెన్నెల సినిమాలో నటించింది.

ఈమె సినిమారంగానికి రాకముందు ఒంటరిగా, తన కూతుళ్లతో కలిసి కొన్ని ప్రకటనలలో మోడల్‌గా నటించింది. ముఖ్యంగా కొన్ని సబ్బు ప్రకటనలలో కనిపించింది. ఆ ప్రకటనలు 1980లలో వివాదాస్పదమయ్యాయి.[6] ఇవి కాక ఈమె కొన్ని టెలివిజన్ సీరియళ్లలోను, టెలి ఫిలింలలోను నటించింది. 2004లో విడుదలైన మై కర్మ[7] అనే ఆంగ్ల చిత్రంలోని ఈమె నటనకు అంతర్జాతీయ ప్రసంశలు లభించింది.

ప్రస్తుతం ఈమె బెంగాలీ భాషలో ఒక వంటల పుస్తకాన్ని వ్రాసింది. ముద్రణ కావలసి ఉంది.[ఆధారం చూపాలి]

రాజకీయ వేత్తగా

మార్చు

ఈమె మార్చి 2014లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[8] ఈమె 2014 లోక్‌సభ ఎన్నికలలో బంకూరా నియోజకవర్గం నుండి పోటీ చేసి అంతకు ముందు వరుసగా తొమ్మిది పర్యాయాలు గెలిచిన సిపిఐ (ఎం) పార్టీకి చెందిన బాసుదేవ్ ఆచార్యను ఓడించింది. [9][10]

వ్యక్తిగత జీవితం

మార్చు

మూన్ మూన్ సేన్ 1978లో త్రిపుర రాజ్యానికి చెందిన రాజకుటుంబీకునితో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు రైమా సేన్, రియా సేన్ జన్మించారు. ఇద్దరూ చలనచిత్ర నటీమణులుగా రాణించారు. తన వృత్తి జీవితానికి సదా సహకరిస్తున్న ఈమె భర్త పట్ల ఈమెకు ఎనలేని గౌరవముంది.[4]

ఈమె అత్తగారు ఇలాదేవి కూచ్ బెహర్ రాజాస్థానానికి చెందిన రాణి ఇందిరారాజే కుమార్తె, జైపూర్ మహారాణి గాయిత్రీ దేవికి అక్క.

ఈమె వెండితెరపై అనైతిక పాత్రలను పోషించినా నిజజీవితంలో గాఢమైన ధార్మిక నిష్ట కలిగి ఉంది. ఈమె తన తల్లి మరణించిన తరువాత కర్మకాండలు జరిపి తన తల్లి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేసింది.[11]

పురస్కారాలు

మార్చు

ఫిల్మోగ్రఫీ

మార్చు

హిందీ

మార్చు
 • అందర్ బాహర్ (1984)
 • ముసాఫిర్ (1986)
 • మొహబ్బత్‌ కీ కసం (1986)
 • జాల్ (1986)
 • సీషా (1986)
 • ప్యార్ కీ జీత్ (1987)
 • మజ్ను (1987)
 • అమర్ కంటక్ (1987)
 • మాషుకా (1987)
 • వో ఫిర్ ఆయేగీ (1988)
 • బె లగాం (1988)
 • మిల్ గయీ మంజిల్ ముఝే (1989)
 • తేరే బినా క్యా జీనా (1989)
 • ఏక్‌ దిన్ అచానక్ (1989)
 • అప్నా దేశ్ పరాయే లోగ్ (1989)
 • పత్తర్ కే ఇన్సాన్ (1990)
 • లేకిన్... (1991)
 • జీవన్ ఏక్ సంఘర్ష్ (1990)
 • బహార్ ఆనె తక్ (1990)
 • 100 డేస్
 • ఇరాదా (1991)
 • విష్ కన్య (1991)
 • వక్త్ కి బాద్షా (1992)
 • జఖ్మి రూహ్ (1993)
 • జఖ్మి దిల్ (1994)
 • కుచ్ తో హై (2003)
 • లవ్ ఎట్ టైం స్క్వేర్ (2003)
 • తాజ్ మహల్: ఎ మాన్యుమెంట్ ఆఫ్ లవ్ (2003)
 • మై కర్మ (2003)
 • బరూద్ (ది ఫైర్) - ఎ లవ్ స్టోరీ (2010)

తెలుగు

మార్చు

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 "Sixteenth Lok Sabha – Members Bioprofile – Varma, Smt. Dev (Moon Moon Sen)". Parliament of India – Lok Sabha. Retrieved 14 December 2016.
 2. 2.0 2.1 "Focus on IIFCL refinance to pump in Rs 75,000 crore". 6 January 2009. Archived from the original on 1 మే 2010. Retrieved 14 మార్చి 2017.
 3. "Sorry". Indianexpress.com. Retrieved 6 July 2012.
 4. 4.0 4.1 "Sorry". Screenindia.com. Archived from the original on 31 జనవరి 2008. Retrieved 6 July 2012.
 5. "The Tribune, Chandigarh, India - NCR stories".
 6. "Rediff On The NeT: Transcript of the Adi Godrej Chat". Archived from the original on 2007-05-21. Retrieved 2017-03-14.
 7. My Karma (2004) IMDb
 8. "Baichung Bhutia, Moon Moon Sen bring star power to Mamata's TMC".
 9. "Tollywood wishes luck to Dev, Moon Moon Sen for Lok Sabha Polls". IANS. news.biharprabha.com. Retrieved 7 March 2014.
 10. "Lok Saba polls: Bhaichung Bhutia, Moon Moon Sen to contest on Trinamool ticket". The Times of India. 5 March 2014. Retrieved 7 March 2014.
 11. "Moon Moon Sen immerses ashes of late mother Suchitra Sen in Ganges". 18 January 2014.
 12. "Kalakar award winners" (PDF). Kalakar website. Archived from the original (PDF) on 25 ఏప్రిల్ 2012. Retrieved 16 October 2012.

బయటి లింకులు

మార్చు