సుమతి మురార్జీ

భారతీయ వ్యాపారవేత్త

సుమతి మురార్జీ(ఆంగ్లం:Sumati Morarjee)(1909 మార్చి 13[2] - 1998 జూన్ 27[3]), భారత మొదటి షిప్పింగ్ మహిళగా జనాదరణ పొందిన భారత జాతీయ స్టీమ్ షిప్ యజమానులు సంఘం స్థాపకురాలు. 1971లో భారత ప్రభుత్వం ఈమె సమాజానికి అందిస్తున్న సేవలకు గాను రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అందజేసింది.

సుమతి మురార్జీ
జననం
జమున

(1909-03-13)1909 మార్చి 13
మరణం1998 జూన్ 27(1998-06-27) (వయసు 89)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సింధియా ఆవిరి నావిగేషన్ కంపెనీ
పురస్కారాలుపద్మ విభూషణ్ (1971)
నోట్సు

తొలినాళ్లలో

మార్చు

సుమతి మురార్జీ బాంబే నగరంలో గోకుల్ దాస్ ప్రేమ బాయి దంపతులకు ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. ఆమెకు బృందావనంలో ప్రవహించే నది పేరున జమున అని పేరు పెట్టారు.

సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ

మార్చు

సుమతి మురార్జీ 1923 సంవత్సరంలో తన 14వ ఏట నుండే ఏజెన్సీ కంపెనీ బాధ్యత నిర్వహించేది. దాదాపుగా 23 ఏళ్ల పాటు కంపెనీ నిర్మాణానికి వివిధ రకాలుగా ప్రణాళికలు నిర్వహించి 1946లో 6 వేల మంది ఉద్యోగులతో ఈ సంస్థ నిర్వహించేది. కాలక్రమేణా ఈ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సభ్యురాలిగా బాధ్యతలు  చేపట్టింది,  ఈ ప్రయాణంలో షిప్పింగ్ వ్యాపారానికి సంబంధించి చక్కటి నైపుణ్యం ఏర్పరచుకుంది. 1956లో భారత జాతీయ స్టీమ్ షిప్ యజమానుల సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఈమె అధ్యక్షతన షిప్పింగ్ యజమానులు సంఘం 43 షిప్పింగ్ నాళాలతో 5,52,000 టన్నుల బరువును నిర్వహించే స్థాయికి చేరుకుంది.[4]

1979 నుండి 1987 వరకు మురార్జీ ఈ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉంది, ఆ తరువాత ఈ సంస్థను ప్రభుత్వం తన హాయాంలోకి తీసుకుంది. 1992లో ప్రభుత్వం ఈమెను మళ్ళి  సంస్థ  చైర్‌పర్సన్‌గా నియమించింది.

సాధనలు, స్థాపనలు

మార్చు
  • ముంబైలోని జుహులో ఉన్న సుమతి విద్యా కేంద్ర పాఠశాల స్థాపన.
  • 1965 లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) వ్యవస్థాపకుడు ఆచార్య స్వామి ప్రభుపాదకు సహాయం అందించింది.[5]
  • 1970 లో లండన్‌లోని వరల్డ్ షిప్పింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలి పదవి.
  • నరోత్తం మొరార్జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ షిప్పింగ్ చైర్‌పర్సన్‌గా పనిచేసింది.
  • భారతదేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుండి సింధీలను తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
  • ఆధునిక భారతీయ షిప్పింగ్ కంపెనీలకు ఒక నమూనాను స్థాపించడానికి సహాయపడింది, ప్రపంచానికి వ్యాపార విలువలను అందించడమే కాకుండా భారతీయ సంస్కృతి అలాగే వారసత్వ ఆలోచనలను ప్రచారం చేయడానికి కూడా సహాయపడింది.

సుమతి మురార్జీ 89 సంవత్సరాల వయసులో 1998 జూన్ 27 న గుండెపోటు కారణంగా మరణించింది.

మూలాలు

మార్చు
  1. Satyaraja Dasa. "Passage from India: Sumati Morarjee and Prabhupada's Journey West | Back to Godhead". Btg.krishna.com. Archived from the original on 2013-11-04. Retrieved 2012-07-09.
  2. Manabendra Nath Roy (1999). The Radical Humanist. Maniben Kara. p. 38. Retrieved 22 March 2016.
  3. Fairplay. Fairplay Publications Limited. June 1998. p. 62. Retrieved 22 March 2016.
  4. "SHIPPING BOSS TO OPEN NEW SERVICE". The Straits Times. 22 November 1971. p. 8. Retrieved 21 June 2012.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-04. Retrieved 2021-09-16.

బయటి లంకెలు

మార్చు