సుమన్ రాథోడ్
సుమన్ రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2009 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]
సుమన్ రాథోడ్ | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 నుండి 2014 | |||
ముందు | అజ్మీర గోవింద్ నాయక్ | ||
---|---|---|---|
తరువాత | అజ్మీరా రేఖ నాయక్ | ||
నియోజకవర్గం | ఖానాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1974 తెలంగాణ భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | రమేష్ రాథోడ్ | ||
నివాసం | తెలంగాణ భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
వివాదం
మార్చుఖానాపూర్ నియోజకవర్గం నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన హరినాయక్ సుమన్ రాథోడ్‌పైన పోటీ చేసి ఓడిపోయాడు. సుమన్ రాథోడ్ ఎస్టీ కాదని హరినాయక్ కోర్టుకెక్కాడు. ఈ వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కుల ధృవీకరణపై వేసిన కమిటీ సుమన్ రాథోడ్ ఎస్టీ కాదని చెప్పింది. దీంతో హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ సుమన్ రాథోడ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన 2003 సవరణను కొట్టివేస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు తీర్పుపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. హరినాయక్ స్టే ఎత్తివేయాలని కోరుతూ మళ్లీ సుప్రీంను ఆశ్రయించాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ Eenadu (1 November 2023). "ఆకాశంలో సగం.. ఆరుగురికే అవకాశం". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Sakshi (25 December 2013). "సుమన్ రాథోడ్‌కు చుక్కెదురు". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
- ↑ Deccan Chronicle (25 December 2013). "TD Suman Rathod to lose MLA seat" (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.