అజ్మీరా రేఖ నాయక్
అజ్మీరా రేఖ నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తుంది.[2][3]
అజ్మీరా రేఖ నాయక్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | డిసెంబరు 19, 1974 హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | శంకర్ నాయక్,[1] శ్యామలా | ||
జీవిత భాగస్వామి | శ్యామ్ నాయక్ | ||
సంతానం | పూజ, అక్షిత్ | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
జననం - విద్యాభ్యాసం
మార్చుఅజ్మీరా రేఖ నాయక్ 1975, డిసెంబరు 19న శంకర్ నాయక్, శ్యామల దంపతులకు హైదరాబాదులో జన్మించింది. తండ్రి బిహెచ్ఈఎల్ సంస్థలో ఉద్యోగికాగా, తల్లి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసింది. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి స్కూల్ విద్యను చదివిన అజ్మీరా రేఖ, 1999లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని వనితా మహావిద్యాలయంలో బిఏ చదివింది. ఆ తరువాత 2010లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ (సోసియాలజీ), 2013లో పడాల రాంరెడ్డి కళాశాల నుండి ఎల్ఎ.ఎల్.బి.ని పూర్తి చేసింది.[4]
వివాహం - పిల్లలు
మార్చు1997, ఆగస్టు 10న రవాణా శాఖలో ప్రభుత్వ ఉద్యోగి శ్యామ్ నాయక్ తో అజ్మీరా రేఖ నాయక్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (పూజ, అక్షిత్).[5]
రాజకీయరంగ ప్రస్థానం
మార్చుఅజ్మీరా రేఖ నాయక్ 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ జెడ్.పి.టి.సి. మెంబర్ గా పోటీచేసి, విజయం సాధించింది. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారితో విజయం సాధించింది. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.[6][7]
రేఖా నాయక్ కు 2023లో జరిగే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో 2023 అక్టోబరు 06న ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది.[8] ఆమె 2023 అక్టోబర్ 20న కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్రలో భాగంగా ఆర్మూర్‌లో జరిగిన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[9]
హోదాలు
మార్చు- 2016-2018: మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్, తెలంగాణ శాసనసభ
- 2019-ప్రస్తుతం: మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్, తెలంగాణ శాసనసభ
ఇతర వివరాలు
మార్చుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించింది.
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (17 July 2021). "ఎమ్మెల్యే రేఖా నాయక్ తండ్రి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం". Namasthe Telangana. Archived from the original on 17 జూలై 2021. Retrieved 17 July 2021.
- ↑ ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (12 December 2018). "అసెంబ్లీకి ఎన్నికైన తొమ్మిదిమంది మహిళలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "Ajmera Rekha | MLA | Khanapur | Nirmal | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-17. Retrieved 2021-10-22.
- ↑ 10టివీ (17 January 2019). "దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 January 2019). "ముందుగా మహిళా ఎమ్మెల్యేలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
- ↑ ABP Desham (6 October 2023). "బీఆర్ఎస్ కు మరో షాక్ - పార్టీని వీడిన మరో ఎమ్మెల్యే రేఖా నాయక్". Archived from the original on 6 October 2023. Retrieved 6 October 2023.
- ↑ Mana Telangana (20 October 2023). "కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.