సురీందర్ కుమార్ ఛౌదరి

సురీందర్ కుమార్ చౌదరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో నౌషేరా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై[1], అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2]

సురీందర్ కుమార్ చౌదరి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 అక్టోబర్ 2024
Lieutenant Governor లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
ముందు కవీందర్ గుప్తా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 అక్టోబర్ 2024
ముందు రవీందర్ రైనా
నియోజకవర్గం నౌషేరా నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
నివాసం జమ్మూ కాశ్మీర్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

సురీందర్ కుమార్ చౌదరి 1968లో జమ్మూలోని మారాలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు దయాళ్ చంద్, సురీందర్ కుమార్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

సురీందర్ కుమార్ చౌదరి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 ఎన్నికల్లో పీడీపీ అభ్యర్థిగా ఆపాటి చేసి తన సమీప ప్రత్యధి బీజేపీ అభ్యర్థి రవీంద్ర రైనా చేతిలో 9503 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయనకు 27,871 ఓట్లు, రవీంద్ర రైనాకు 37,374 ఓట్లు వచ్చాయి.

సురీందర్ కుమార్ చౌదరి ఆ తరువాత మార్చి 2022లో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి 2023 జూలైలో బీజేపీకి రాజీనామా చేసి నేషనల్ కాన్ఫరెన్స్‌లో చేరాడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో నౌషేరా నియోజకవర్గం జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రవీంద్ర రైనాపై 7819 ఓట్ల మెజారిటీతో గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,[4] అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Hindu (16 October 2024). "Omar Abdullah sworn in as new CM of Union Territory of Jammu and Kashmir; Surinder Kumar Choudhary to be his deputy" (in Indian English). Retrieved 16 October 2024.
  3. Navbharat Times (16 October 2024). "रविंद्र रैना को हराया, नौशेरा सीट पर रचा इतिहास, जानें जम्मू-कश्मीर के डिप्टी सीएम सुरिंदर कुमार चौधरी कौन". Retrieved 16 October 2024.
  4. ABP News (8 October 2024). "J-K Elections: Ravinder Raina Loses Nowshera Against NC Candidate With Margin Of 7,819 Votes" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
  5. "रविंद्र रैना को हराने वाले सुरेंद्र चौधरी बने उमर अब्दुल्ला सरकार में डिप्टी सीएम, जानें कौन है". 16 October 2024. Retrieved 16 October 2024.
  6. PTI (2024-10-18). "J&K L-G allocates portfolios; who gets what in newly inducted Omar Abdullah-led cabinet". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-18.