ఒమర్ అబ్దుల్లా రెండో మంత్రివర్గం

(ఒమర్ అబ్దుల్లా రెండవ మంత్రివర్గం నుండి దారిమార్పు చెందింది)

2024లో జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల తర్వాత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా 16 అక్టోబరు 2024న రెండవ ఒమర్ అబ్దుల్లా మంత్రిత్వ శాఖ ఏర్పడింది.[1][2][3]

రెండవ ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం

జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత 1వ మంత్రిత్వ శాఖ
ఒమర్ అబ్దుల్లా
రూపొందిన తేదీ16 అక్టోబర్ 2024
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
ముఖ్యమంత్రిఒమర్ అబ్దుల్లా
ఉప ముఖ్యమంత్రిసురీందర్ కుమార్ చౌదరి
మంత్రుల సంఖ్య6 (ముఖ్యమంత్రితో సహా)
పార్టీ
సభ స్థితిసంకీర్ణ ప్రభుత్వం
55 / 95 (58%)
ప్రతిపక్ష పార్టీఅధికారిక ప్రతిపక్షం:
ప్రతిపక్ష నేతప్రకటించాల్సి ఉంది
చరిత్ర
ఎన్నిక(లు)2024 ఎన్నికలు
శాసనసభ నిడివి(లు) 13వ శాసనసభ (2024 - ప్రస్తుతం)
అంతకుముందు నేతమెహబూబా ముఫ్తీ మంత్రివర్గం (రాష్ట్రం)

శ్రీనగర్‌లోని షెరి ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కొత్త సీఎంగా ఒమర్‌ అబ్దుల్లాతో ప్రమాణం చేయించాడు. ఉప ముఖ్యమంత్రిగా జమ్మూకు చెందిన సురీందర్ కుమార్ చౌదరి, మరో నలుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా బ్లాక్‌ తరపున సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌, సీపీఎం నేత ప్రకాశ్‌ కారత్‌, సీపీఐ నేత డి.రాజా, డీఎంకే కనిమొళి, ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గం తరపున సుప్రియా సులే, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తదితరులు హాజరయ్యారు.

నేపథ్యం

మార్చు

మెహబూబా ముఫ్తీ మంత్రివర్గం 2018లో రద్దు తర్వాత భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిజెపి ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 & ఆర్టికల్ 35Aని రద్దు చేసి, లడఖ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్ ను సెమీ అటానమస్ హోదాను కల్పించి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం ఎగువ సభ (లెజిస్లేటివ్ కౌన్సిల్) రద్దు చేయబడింది. 2022లో డీలిమిటేషన్ కమిషన్ 90 మంది సభ్యులకు సీట్లను పునర్విభజన చేయాలని సిఫార్సు చేసింది. 2023లో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి సెప్టెంబర్ 2024లోపు ఎన్నికలను నిర్వహించాలని సూచించగా ఎన్నికల అనంతరం 16 అక్టోబర్ 2024న జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ , కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ( ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌లో భాగం) 49 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2019 ఆగస్ట్‌ 5న ఆర్టికల్‌ 370 రద్దు చేశాక ఇటీవల జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 42 స్థానాల్లో నెగ్గింది. ఎన్సీ కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ 6 చోట్ల గెలిచింది. ఐదుగురు ఇండిపెండెంట్‌ ఎమ్యెల్యేలు, ఒక ఆప్‌ ఎమ్మెల్యే, ఒక సీపీఎం ఎమ్మెల్యే ఒమర్‌ అబ్దుల్లా ప్రభుత్వానికి మద్దతిచ్చారు. దీంతో మొత్తం 55 మంది ఎమ్మెల్యేల బలం ప్రభుత్వానికి ఉంది. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో 90 నియోజకవర్గాలకు పోటీ జరగ్గా ఐదుగురిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 95 కానుంది.

క్యాబినెట్ మంత్రుల జాబితా

మార్చు
మంత్రిత్వ శాఖలు మంత్రి మంత్రిత్వ శాఖలు[4] పదవీ బాధ్యతలు నుండి పదవీ బాధ్యతలు వరకు పార్టీ
ముఖ్యమంత్రి[5] ఒమర్ అబ్దుల్లా ఏ మంత్రులకు కేటాయించబడని మిగిలిన అన్ని శాఖలు[6] 16 అక్టోబర్ 2024 ప్రస్తుతం జేకేఎన్‌సీ
ఉపముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరి పబ్లిక్ వర్క్స్ (ఆర్ & బి), పరిశ్రమలు, వాణిజ్య మైనింగ్, లేబర్ & ఎంప్లాయ్‌మెంట్ & స్కిల్ డెవలప్‌మెంట్[6] 16 అక్టోబర్ 2024 ప్రస్తుతం జేకేఎన్‌సీ
క్యాబినెట్ మంత్రి సకీనా మసూద్ ఆరోగ్య & వైద్య విద్య, పాఠశాల విద్య, ఉన్నత విద్య & సాంఘిక సంక్షేమం[6] 16 అక్టోబర్ 2024 ప్రస్తుతం జేకేఎన్‌సీ
క్యాబినెట్ మంత్రి జావేద్ అహ్మద్ దార్ వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, సహకార & ఎన్నికలు[6] 16 అక్టోబర్ 2024 ప్రస్తుతం జేకేఎన్‌సీ
క్యాబినెట్ మంత్రి జావేద్ అహ్మద్ రాణా జల శక్తి, అటవీ, జీవావరణ శాస్త్రం, పర్యావరణం & గిరిజన వ్యవహారాలు[6] 16 అక్టోబర్ 2024 ప్రస్తుతం జేకేఎన్‌సీ
క్యాబినెట్ మంత్రి సతీష్ శర్మ ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాలు, రవాణా, సైన్స్ & టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యువజన సేవలు & క్రీడలు, ఎఆర్ఐ & శిక్షణ[6] 16 అక్టోబర్ 2024 ప్రస్తుతం స్వతంత్ర

మూలాలు

మార్చు
  1. The Times of India (16 October 2024). "Omar Abdullah takes oath as J&K chief minister, Congress to stay out of government". Retrieved 16 October 2024.
  2. India Today (16 October 2024). "5 MLAs take oath with Omar Abdullah, no Cabinet berth for ally Congress" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
  3. "Omar's balancing act as five-member cabinet takes charge in J&K". 16 October 2024. Retrieved 16 October 2024.
  4. PTI (2024-10-18). "J&K L-G allocates portfolios; who gets what in newly inducted Omar Abdullah-led cabinet". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-10-18.
  5. The Hindu (16 October 2024). "Omar Abdullah sworn in as new CM of Union Territory of Jammu and Kashmir; Surinder Kumar Choudhary to be his deputy". Retrieved 16 October 2024.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "Order No. 1791-JK(GAD) of 2024". General Administration Department, Government of Jammu and Kashmir. 2024-10-17. Retrieved 2024-10-18.