మనోజ్ సిన్హా
మనోజ్ సిన్హా (జననం 1 జూలై 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర కమ్యూనికేషన్స్ రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత), రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేస్తున్నాడు.[1]
మనోజ్ సిన్హా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 ఆగష్టు 2020 | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ముందు | జి. సి. ముర్ము | ||
రైల్వే శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 16 మే 2014 – 24 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
లోక్ సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | రాధా మోహన్ సింగ్ | ||
తరువాత | అఫ్జాల్ అన్సారీ | ||
నియోజకవర్గం | ఘాజీపూర్ | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | ఓంప్రకాష్ సింగ్ | ||
తరువాత | అఫ్జాల్ అన్సారీ | ||
నియోజకవర్గం | ఘాజీపూర్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | విశ్వనాధ్ శాస్త్రి | ||
తరువాత | ఓంప్రకాష్ సింగ్ | ||
నియోజకవర్గం | ఘాజీపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మోహన్ పుర, ఘజిపూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ | 1959 జూలై 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నీలం సిన్హా (m. 1977) | ||
నివాసం | *రాజ్ భవన్ (జమ్మూ) (శీతాకాలం)
| ||
వృత్తి | సివిల్ ఇంజనీర్ |
జననం, విద్యాభాస్యం
మార్చుమనోజ్ సిన్హా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఘాజీపూర్ జిల్లా, మోహన్‌పురాలో శ్రీ బీరేంద్ర కుమార్ సింగ్, వృంద్‌వషిణీ దేవీ దంపతులకు 1959 జూలై 1న జన్మించాడు. ఆయన వారణాసిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీ.టెక్ & ఎం.టెక్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుమనోజ్ సిన్హా 1982లో బనారస్ హిందూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 1989 నుండి 1996 వరకు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఉన్నాడు. సిన్హా 1996లో మొదటిసారి లోక్‌సభకు ఎంపీగా, 1999లో రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1998, 2004లో ఘాజియాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. సిన్హా 2014లో లోక్‌సభకు మూడోసారి ఎన్నికై మే 2014లో నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా, ఆ తరువాత జూలై 2016లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కమ్యూనికేషన్ల శాఖ(స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రిగా పని చేశాడు.[2]
మనోజ్ సిన్హా 2020లో జమ్మూ కాశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Times of India (7 August 2020). "Manoj Sinha takes oath as LG of Jammu and Kashmir" (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
- ↑ "With Manoj Sinha, a career politician returns to the helm of the administration in Jammu and Kashmir". 6 August 2020. Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ The Print (7 August 2020). "Former union minister Manoj Sinha takes oath as L-G of Jammu and Kashmir". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.