సుల్భా సంజయ్ ఖోడ్కే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మహారాష్ట్ర శాసనసభకు బద్నేరా, అమరావతి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

సుల్భా సంజయ్ ఖోడ్కే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు సునీల్ దేశ్‌ముఖ్
నియోజకవర్గం అమరావతి
పదవీ కాలం
2004 – 2009
ముందు జ్ఞానేశ్వర్ ధనే పాటిల్
తరువాత రవి రాణా
నియోజకవర్గం బద్నేరా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (12 అక్టోబర్ 2024-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు *శివసేన (2024-2024)
జీవిత భాగస్వామి సంజయ్ ఖోడ్కే
సంతానం సంయుక్త, యష్
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

సుల్భా ఖోడ్కే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బద్నేరా శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ద్యానేశ్వర్ ధనే పాటిల్ పై 5759 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రవి రాణా చేతిలో 18771 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

సుల్భా ఖోడ్కే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అమరావతి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దేశ్‌ముఖ్ సునీల్ పంజాబ్‌రావుపై 18269 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2][3][4] ఆమె ఆ తరువాత తిరిగి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ దేశ్‌ముఖ్ పై 5413 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5][6]

మూలాలు

మార్చు
  1. The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. The Times of India (26 October 2019). "Meet Maharashtra's 24 women MLAs". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. The Hindu (24 October 2019). "Only 19 of 235 women contestants taste victory in Maharashtra" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Amaravati". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
  6. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)