సుశీల్ కుమార్ రింకూ

సుశీల్ కుమార్ రింకూ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]

సుశీల్ కుమార్ రింకూ

లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 మే 2023
ముందు సంతోఖ్ సింగ్ చౌదరి
నియోజకవర్గం జలంధర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2017 – 2022
తరువాత షీతల్ అంగురల్
నియోజకవర్గం జలంధర్ వెస్ట్

వ్యక్తిగత వివరాలు

జననం (1975-06-05) 1975 జూన్ 5 (వయసు 49)
జలంధర్, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
జీవిత భాగస్వామి సునీతా రింకు
నివాసం జలంధర్
పూర్వ విద్యార్థి దావ్ కాలేజీ, జలంధర్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

సుశీల్ కుమార్ రింకూ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జలంధర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మహీందర్ పాల్ భగత్ పై 17334 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆప్ అభ్యర్థి శీతల్ అంగురల్ చేతిలో ఓడిపోయాడు.

2019లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహించిన భారత్​ జోడో యాత్రలో భాగంగా 2023 జనవరి 14న లూథియానా ఫిలౌర్‌ నుంచి పాల్గొన్న ఆయన గుండె పోటుతో మరణించడంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక జరగగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సుశీల్ కుమార్ రింకూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుండి బహిష్కరించింది.

ఆయన 2023 ఏప్రిల్ 6న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు.[3] ఆయన జలంధర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్ధిగా పోటీ ఎంపీగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. Hindustan Times (13 May 2023). "Jalandhar Lok Sabha byelection: AAP's Sushil Kumar Rinku wins by 58,691 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2023. Retrieved 13 July 2023.
  2. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. Andhra Jyothy (6 April 2023). "కాంగ్రెస్‌కు షాకిచ్చి ఆప్‌లో చేరిన 24 గంటల్లోనే." Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  4. The Times of India (14 May 2023). "Jalandhar Bypoll Result 2023: AAP's Sushil Rinku wins Lok Sabha seat". Archived from the original on 13 July 2023. Retrieved 13 July 2023.