జలంధర్

పంజాబ్ లోని జిల్లా

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో జలంధర్ జిల్లా ( డోయాబీ:ਜਲੰਧਰ ਜ਼ਿਲਾ) ఒకటి. జలంధర్ నగరం జిల్లాకు కేంద్రంగా ఉంది. గురు అమర్దాస్, 3 గురువు గురుగోబింద్‌సింగ్, 10వ గురువు వరకు పంజాబు రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు సిఖ్ఖు మతానికి మారారు. జిల్లావైశాల్యం 2,632చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,962,700.

Jalandhar district

ਜਲੰਧਰ ਜ਼ਿਲ੍ਹਾ
Located between the Kapurthala the states
Location in Punjab, India
Country India
StatePunjab
పేరు వచ్చినవిధముArea inside the water or King Jalandhara
HeadquartersJalandhar
ప్రభుత్వం
 • Deputy commissionerShruti Singh
విస్తీర్ణం
 • మొత్తం2 కి.మీ2 (1,016 చ. మై)
జనాభా
(2011)‡[›]
 • మొత్తం2
 • సాంద్రత830/కి.మీ2 (2,100/చ. మై.)
Languages
 • OfficialPunjabi
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
Literacy82.4%
జాలస్థలిjalandhar.nic.in

భౌగోళికంసవరించు

జలంధర్ జిల్లా దోయాబ్ దక్షిణ భాగంలో బిస్ట్ జలంధర్‌లో ఉంది. జిల్లా దక్షిణ భాగంలో బియాస్, సట్లైజ్ నదులు ప్రవహిస్తున్నాయి.

విభాగాలుసవరించు

5 తాలూకాలు: జలంధర్ 1 (ఉపతాలూకా: ఆదంపూర్), జలంధర్ 2 (ఉపతాలూకా: కర్తర్పూర్, భొగ్పూర్), నకోదర్ ఫిల్లౌర్, షహ్‌ కోట్.

 • జిల్లాలో 4 ఉప తాలూకాలు ఉన్నాయి: ఆదంపూర్, నకోదర్‌పూర్, షహ్‌కోట్, ఫిల్లౌర్, నూర్మహల్, రూర్కా లోహియన్ కలానీ.
 • 11 నగరాలు, 954 గ్రామాలు ఉన్నాయి.
 • 1997 సెప్టెంబరు వరకు నవాన్షహర్ జలంధర్ జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది.

చరిత్రసవరించు

హిందూపురాణాలలో జలందర్ ప్రస్తావన ఉంది. " లలితా సహస్రనామం స్తోత్రంలో " జలందర పీఠ అనే నామం జలంధర్‌లోని కాళిమాత గురించినదని భావిస్తున్నారు. 4వ శతాబ్దంలో బౌద్ధుల పాలనా వ్యవస్థ ఉన్నదని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న బౌద్ధాలయం అందుకు నిదర్శనంగా ఉంది. క్రీ.శ 399, 411 మధ్యకాలంలో భారతదేశంలో సంచరించిన చైనాయాత్రికుడు పాహియాన్ వ్రాతలను అనుసరించి ఈ ప్రాంతంలో దాదాపు 50 బుద్ధవిహారాలు ఉన్నాయని ఈ ప్రాంతంలో పలువురు బుద్ధమత అవలంబీకులు ఉన్నారు.

హూయంత్సాంగ్సవరించు

7వ శతాబ్దంలో త్రిగర్తదేశానికి జలంధర్ రాజధానిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని హూయంత్సాంగ్ సందర్శించాడు. త్రిగర్తదేశంలో ప్రద్తుత జలంధర్, నవాంషహర్, హోషియార్‌పూర్, కాంగ్రా, స్థానిక రాజ్యాలైన చంబా, మండి, సుకేత్ ఉన్నాయి. హర్షవర్ధనుడు కొంతకాలం ఈ ప్రాంతాన్ని పాలించాడు. హ్యూయంత్సాంగ్ వర్ణణల ఆధారంగా రాజ్యం తూర్పు, పడమరులుగా 270 కి.మీ ఉత్తర దక్షిణాలుగా 215 కి.మీ విస్తరించింది. కయోచ్ సామ్రాజ్యంలో జలంధర్ రాజధానిగానూ అతి పెద్ద నగరంగానూ గుర్యించబడుతూ వచ్చింది. కొన్ని ఆటంకాల నడుమ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం కలిగి ఉంది. 12వ లాల్ సెఫ్లే జలంధర్ రాజధానిగా అలాగే కాంగ్రాలో కోట నిర్మించి పాలించాడు. 9వ శతాబ్దం చివరిదశలో పృద్వి చంద్రా చంద్ర శంకర కాష్మీర్ చేతిలో ఓటమి చెందాడని రాజతరంగిణి పేర్కొన్నాడు. 8-9 వశతాబ్ధాల మద్య కాలంలో జలంధర్ నాథ్ నాయకత్వంలో నాథ్ ఉద్యమానికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. 10వ శతాబ్దం చివరికాలానికి 1019 వరకు షాహి పంజాబీల ఆధీనంలో ఉంది.

ఢిల్లీ సుల్తానులుసవరించు

1088లో ఈ నగరాన్ని " గజనీవిద్ సుల్తాన్ ఇబ్రహీం బీన్ మాసైద్ " (ఇబ్రహీం షాహ్ ఘుర్) జయించాడు. తతువాత ఈ ప్రాంతంలో ముస్లిముల పాలన సాగించి. తరువాత ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తానుల పాలనలో లాహోర్ రాజ్యంలో ఉంది. సయ్యిద్ సామ్రాజ్యం (1414-1415) కాలంలో ఢిల్లీ సుల్తానేట్ బలహీనపడిన కారణంగా ఈ ప్రాంతంలో పలు తిరుగుబాట్లు సాగాయి. వీటిలో ఖోఖర్ నాయకత్వంలో సాగిన తిరుగుబాటు ముఖ్యమైనది. 1555లో మొగల్ సైన్యాలు ఈ ప్రాంతంలో కేంద్రీకరించబడ్డాయి. హుమాయూన్ ఈ యుద్ధానికి సాక్ష్యంగా ఉండడానికి అనుమతించబడ్డాడు. 1560లో ఇంపీరియల్ సైన్యం బైరం ఖాన్‌ను ఓడించి ఈ ప్రాంతాన్ని వశపరచుకుంది. అక్బర్ పాలనా కాలంలో ఈ ప్రాంతం సర్కార్ సంస్థానానికి కేంద్రంగా ఉంది.అదినా ఆర్యన్ సంతతికి చెందిన అరైయన్, ఈ ప్రాంతాన్ని పాలించిన చివరి రాజుగా గుర్తింపును పొందాడు. పంజాబులో మొగలు పాలన సమాప్తం అయ్యే సమయంలో ఆర్యన్ పాలన ప్రజాదరణతో కొనసాగింది.

సిక్కుల తిరుగుబాటుసవరించు

తరువాత 1717లో నర్మల్, కర్తర్‌పూర్‌లను కేంద్రంగా చేసుకుని సిఖ్ఖుల తిరుగుబాటు సాగింది. 1758 నాటికి మహారాజా ఘమండ్ చంద్ కటోచ్ సామ్రాజ్యం అహమ్మద్ షాహ్ దురాని " నిజాం ఆఫ్ జలంధర్‌గా " మారింది. సిఖ్ఖు తిరుగుబాటు దారులకు ఈ ప్రాంతవాసుల నుండి తగినంత మద్దతు లభించింది. కొంతమంది నాయకుల నాయకత్వంలో వారికి డోయాబ్ అంతటా ఉన్న స్వతంత్ర రాజుల మద్దతుతో కొంత సైన్యం ఏర్పడింది. 1766 నాటికి కుషాల్ సింగ్ నాయకత్వంలో జలంధర్ ఫైజులాపురియా మిస్ల్ ఆధీనంలోకి చేరింది. ఆయనకుమారుడు రాజ్యవారసుడు అయిన బుధ్‌సింగ్ నగరంలో కోటను నిర్మించాడు. ఇతర సిఖ్ఖు నాయకులు నగర పరిసరాలలో కోటలను నిర్మించుకున్నారు. బుధ్‌సింగ్ ఫిల్లౌర్‌ను ఆక్రమించుకున్న తరువాత ఫిల్లౌర్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యస్థాపన చేసాడు.

ముస్లిం రాజపుత్రులుసవరించు

నకోదర్ ముస్లిం రాజపుత్రులకు జహంగీర్ ఈ ప్రాంతాన్ని జాగీరుగా ఇచ్చాడు. సరదార్ తారాసింగ్ ముస్లిం రాజపుత్రులను తరిమికొట్టి ఇక్కడ కోట కట్టి ఈ ప్రంతాన్ని స్వాధీనపరచుకున్నాడు. దక్షిణ ప్రాంతంలో రజనీత్ సింగ్ క్రమంగా తనశక్తిని కేంద్రీకరించి 1807లో ఫిల్లౌరును స్వాధీనం చేసుకున్నాడు. 1811లో ఫైజుల్లాపురియా రాజ్యాన్ని డోయబ్ ఆఫ్ జలంధర్‌తో కలపడానికి దేవన్ మొఖం చంద్ పంపబడ్డాడు. బుధ సింగ్ సట్లైజ్ మీదుగా పారిపోయినా ఆయన సైన్యాలు మాత్రం రజనీత్ సింగ్ సైన్యాలను ఎదుర్కొన్నాయి.

రంజిత్‌సింగ్సవరించు

1816లో రజనీత్ సింగ్ సరదర నాకోదర్‌ను స్వాధీన పరచుకున్నాడు. కొంతమంది సంపన్నులు మాత్రం ఈ ప్రాతం నుండి వెలుపలికి పంపబడ్డారు. చివరకు ఈ ప్రాంతం లాహోరు న్యాయపరిధిలోకి వచ్చింది. సిఖ్ఖుల పాలన కఠినంగా, పన్నులభారంతో ప్రజలు బాధలు అనుభవించారు. షైఖ్ ఘులాం ముహి-ఉద్-దిన్ ఈ ప్రాంతానికి చివరి ఆధికారిగా నియమించబడ్డాడు. ఆయన నిర్వహించిన హింసాత్మకమైన పాలనలో ప్రజలు బాధలు అనుభవించారు. తరువాత ఆయన రాజ్యాధికారం ఆయన కుమారుడైన ఇమాముద్దీనుకు అప్పగించబడింది. అయినప్పటికీ తండ్రీ కుమారులిద్దరూ ఇక్కడ నివసించలేదు. రాజ్యాధికారం తమ సహాయకులైన సందే ఖానుకు (హోషియార్‌పూర్), కరీం బక్షు (జలంధర్) ఇవ్వబడింది.

బ్రిటిష్ పాలనసవరించు

1846 మార్చి 9 నాటికి మొదటి సిఖ్ఖు యుద్ధం ముగింపుకు వచ్చిన తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. త్రాంస్ సట్లైజ్ సంస్థానానికి సర్ జాన్ లారెంస్ మొదటి కమీషనర్‌గా నియమించబడ్డాడు. 2 సంవత్సరాల కాలం జనరల్ ప్రభుత్వ పాలన సాగింది. తతువాత 1848లో లాహోరు రెసిడెంస్‌లో భాగంగా మారింది. 1849లో పంజాబుతో అనుసంధానించబడిన తరువాత అమృతసర్ ప్రోవింస్‌లో చేర్చబడింది. 1849లో జలంధర్, హోషియార్‌పూర్, కాంగ్రా జిల్లాలు ఏత్పాటు చేయబడ్డాయి. 1881లో జలంధర్ వైశాల్యం 3,424 చ.కి.మీ. 1901లో 3,706 చ.కి.మీ. నకోదర్‌లో సైనిక ప్రధానకార్యాకయం, ఫిల్లౌర్‌లో ఆయిధాగారం నిర్మించబడింది. 1857 లో ఆయుధాగారం నిరుపయోగం చేయబడింది. 1854లో ప్రధానకార్యాలయం తరలించబడింది. 1857లో జలంధర్, ఫిల్లౌర్ సైన్యాలు ఢిల్లీలోని తిరుగుబాటు సైన్యాలతో చేరుకున్నాయి. రాజా రణబీర్ సింగ్ కపూర్తలా బ్రిటిష్ ప్రభుత్వానికి విశ్వాసంగా ఉంటూ తన పలుకుబడితో పంజాబులో ప్రశాంతతను సంరక్షించాడు.

గణాంకాలుసవరించు

బ్రిటిష్ ప్రభుత్వకాలంలో జనసంఖ్య :

 • 1868: 794 418
 • 1881: 789 555
 • 1891: 907 583
 • 1901: 917 587
 • జిల్లా 4 తాలూకాలుగా విభజించబడింది: (జంధర్, నవాషహర్, ఫిల్లౌర్, నకోదర్).

జలంధర్ జిల్లా వైశాల్యం 1,013 చ.కి.మీ. 1901లో జిల్లాలో జనసంఖ్య 305,976. 1881లో 295,301. జిల్లాలో 409 గ్రామాలు ఉన్నాయి. జిల్లాకు జలంధర్ కేంద్రంగా ఉంది. (1901 లో) జలంధర్ జనసంఖ్య 67,735. జిల్లాలో 7 పురపాలకాలు ఉన్నాయి: ఆదాంపూర్, కర్తర్పూర్, అల్వాల్పూర్, ఫిల్లౌర్, నర్మహల్, బంగ, నకోదర్. జిల్లాలో 46% ముస్లిములు, 40% సిఖ్ఖులు, 14% హిందువులు ఉన్నారు. జిల్లాలో అధికంగా పంజాబీ భాష వాడుకలో ఉంది.

 • ఫిల్లౌర్ కోట : ఈ కోట 1809లో షెర్-ఇ- పంజాబు మహారాజా రంజింత్ సింగ్ (1801-1838) చేత నిర్మించబడింది.
 • కర్తర్పూర్ సాహిబ్ :ఈ పట్టణం 5వ సిఖ్ మాస్టర్ " గురు అర్జున్ దేవ్ జి " చేత 1594లో స్థాపించబడింది.
 • నగరంలో ముఖ్యమైన ప్రదేశాలలో నకోదర్‌లో ఉన్న నూర్‌మహల్‌లో ఉన్నా నూర్జహాన్ సెరాగ్లియో.

జలంధర్ జిల్లాలోని గ్రామాలుసవరించు

 • బత్నౌరా లుబానా ( పంజాబులో అతి పెద్ద గ్రామాలలో ఒకటి. గుర్దల్ సింగ్ (జడ్జ్), బల్కర్ సింగ్ ఐ.పి.ఎస్ ఈ గ్రామంలో జన్మించినవారే)
 • అలిపూర్ (పి.ఓ మిథాపూర్)
 • బోలీనా
 • కోట్లా
 • శం చౌరాసి
 • తాండా
 • కహ్ల్వాన్
 • చిట్టి
 • నుస్సి
 • బిద్ధిపూర్
 • భతిజ
 • నామా పిండ్
 • రంధ్వా మసంద
 • జింద
 • స్లమెపూర్
 • సమరమ
 • రాపూర్
 • రహీం పుర్ (కర్తార్ పుర్)
 • లస్సురి
 • బల్లన్
 • మిథాపూర్
 • పధియానా
 • పతరా, జలంధర్
 • సంసార్పూర్
 • ఖొస్రొపూర్
 • నహలాన్ (నహాల్)
 • నాంగల్ శ్యామా
 • దౌలా
 • సంధ్మ
 • ఫొరివాలా (జలంధర్ లో ఉత్తమ గ్రామం)
 • ధొగ్రి
 • నూర్ మహల్
 • జకోపుర్ కలన్ (జక్కుపూర్ కలాన్) ఇది లోహియన్ మండలం ‌లోని చిన్న గ్రామం.[1] ఇది జలంధర్ నగరానికి 35-40 కి.మీ దూరంలో, నకోదర్‌ నగరానికి 30 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ సిఖ్ఖులు, హిందువులు ఉన్నారు. ప్రజలలో అత్యధికులు జాట్, కాంబోజ్ గిరిజనప్రజలు అధికంగా ఉన్నారు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.
 • మదరా

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,181,753, [2]
ఇది దాదాపు. లాట్వియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 209వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 831 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.16%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 913:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 82.4%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలుసవరించు

 1. "Jakopur Kalan". One Five Nine Explore India. Retrieved 29 November 2012.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జలంధర్&oldid=2909092" నుండి వెలికితీశారు