సుసానే ఖాన్
సుసానే ఖాన్ (ఆంగ్లం: Sussanne Khan; జననం 1975 అక్టోబరు 26) ఒక భారతీయ ఇంటీరియర్ కమ్ ఫ్యాషన్ డిజైనర్.[1]
సుసానే ఖాన్ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1975 అక్టోబరు 26
ఇతర పేర్లు | సుసానే రోషన్ |
విద్యాసంస్థ | బ్రూక్స్ కాలేజ్ |
వృత్తి |
|
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
బంధువులు |
|
ప్రారంభ జీవితం
మార్చుసంజయ్ ఖాన్, జరీన్ కాట్రక్ ఖాన్‌లకు సుసానే ఖాన్ 1975 అక్టోబరు 26న ముంబైలో జన్మించింది. 1980లలో ప్రముఖ నటుడు అయిన ఆమె తండ్రి సంజయ్ ఖాన్‌తో సహా వారి కుటుంబంలో చలనచిత్ర కళాకారులు, ఫ్యాషన్ డిజైనర్లు. ఆమె తల్లి, జరీన్ కాట్రక్ కూడా నటి, ఇంటీరియర్ డిజైనర్.[2][3]
ఆమె తమ్ముడు జాయెద్ ఖాన్ కూడా బాలీవుడ్ నటుడు. నలుగురిలో పెద్ద బిడ్డగా జన్మించిన ఫరా ఖాన్ అలీ నగల డిజైనర్, సుసానే రెండవ సోదరి, సిమోన్ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్ గానే చేస్తుంది.
ఆమె నటుడు ఫిరోజ్ ఖాన్, దర్శకుడు అక్బర్ ఖాన్ ల అన్న కూతురు. అలాగే, బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ కు ఆమె కజీన్.
కెరీర్
మార్చుఅమెరికాలోని బ్రూక్స్ కాలేజ్ నుండి 1995లో ఇంటీరియర్ డిజైనింగ్‌లో అసోసియేట్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన సుసానే ఖాన్ 1996లో ఇంటీరియర్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.[4][5]
2011లో, ఆమె తోటి ఇంటీరియర్ డిజైనర్, మంచి గుర్తింపు పొందిన చిత్ర నిర్మాత గౌరీ ఖాన్‌తో కలిసి ముంబైలో ది చార్‌కోల్ ప్రాజెక్ట్ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ఇది భారతదేశంలో మొదటి ఇంటీరియర్ ఫ్యాషన్ డిజైన్ స్టోర్ కావడం విశేషం.[6][7] చార్‌కోల్ ప్రాజెక్ట్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజైన్ స్టోర్‌గా కూడా పరిగణించబడుతుంది.[8][9]
ఆమె 2012లో స్థాపించబడిన ది లేబుల్ లైఫ్ అనే ఇ-కామర్స్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ కంపెనీకి కూడా పనిచేసింది. ఆమె కంపెనీకి మొదటి ఇంటీరియర్ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది.[10] 2014లో, ఆమె ముంబైలోని పెరల్ అకాడమీ (Pearl Academy) క్యాంపస్ అధికారిక శాఖను ప్రారంభించింది. అలాగే, ఆమె స్కాలర్‌షిప్‌లను నిర్వహించడం ద్వారా అకాడమీ విద్యార్థులకు మద్దతుగా నిలిచింది.[11]
వ్యక్తిగత జీవితం
మార్చు2000లో ఆమె హృతిక్ రోషన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట తమ 13 ఏళ్ల బంధాన్ని 2013లో విడాకులతో ముగించారు. అయితే, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయినప్పటికీ, వారు ఇప్పటికీ సన్నిహిత మిత్రులుగా ఉన్నారు.[12][13][14][15][16]
మూలాలు
మార్చు- ↑ Assomull, Sujata. "Business of Fashion: When 3 is Company". m.khaleejtimes.com. Archived from the original on 19 February 2023. Retrieved 2018-05-19.
- ↑ "Bollywood actor Firoz Khan dies at 70". Dawn News. 27 April 2009. Archived from the original on 11 October 2020. Retrieved 12 March 2009.
- ↑ Sangghvi, Malavika (8 June 2012). "Parsis in Bollywood". midday. Archived from the original on 25 October 2018. Retrieved 25 October 2018.
- ↑ "Meet the original style mavens, Gauri Khan, Sussanne Khan, Twinkle Khanna | Latest News & Updates at Daily News & Analysis". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-01-13. Archived from the original on 23 March 2019. Retrieved 2018-05-19.
- ↑ Jeshi, K. (2016-09-01). "I am enchanted by the world of design". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 13 June 2021. Retrieved 2018-05-19.
- ↑ "WHY SUSSANNE KHAN IS ONE OF THE TOP INTERIOR DESIGNERS IN INDIA". www.delightfull.eu (in అమెరికన్ ఇంగ్లీష్). 11 May 2017. Archived from the original on 8 January 2019. Retrieved 2018-05-19.
- ↑ "Sussanne Khan, Gauri Shinde feted as women achievers". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-04-08. Archived from the original on 23 March 2019. Retrieved 2018-05-19.
- ↑ "Exclusive: Sussanne Khan joins as the first Indian designer for Yoo". Vogue India (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-02-26. Archived from the original on 23 March 2019. Retrieved 2018-05-18.
- ↑ Bhatia, Ritika (2015-05-02). "Quiet luxury". Business Standard India. Archived from the original on 7 September 2017. Retrieved 2018-05-18.
- ↑ "Simply Suzzane". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 23 March 2019. Retrieved 2018-05-18.
- ↑ "Sussanne Roshan teams up with Pearl Academy". /www.aninews.in. Archived from the original on 2014-04-20. Retrieved 2017-09-30.
- ↑ "Another son for Hrithik and Suzanne". Rediff.com. 1 May 2008. Archived from the original on 2 May 2008. Retrieved 1 May 2008.
- ↑ "Hrithik's son to be named Hridhaan". Daily News and Analysis. 29 March 2006. Archived from the original on 27 April 2006. Retrieved 29 March 2006.
- ↑ Deshpande, Swati (1 November 2014). "Hrithik Roshan and Sussanne Khan granted divorce by family court". The Times of India. Archived from the original on 10 January 2017. Retrieved 30 December 2016.
- ↑ "Sussanne Khan Finally Revealed That Why She Ended Her 13 Years Of Marriage With Hrithik Roshan". BollywoodShaadis. Archived from the original on 23 March 2019. Retrieved 2018-05-18.
- ↑ "Hrithik Roshan, Forever And Always: Ex-Wife Sussanne Khan's Birthday Post". NDTV.com. Archived from the original on 23 March 2019. Retrieved 2018-05-18.