సూత్రధార్ (1987 సినిమా)
సూత్రధార్ 1987లో విడుదలైన హిందీ చలనచిత్రం. చంద్రకాంత్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నానా పటేకర్ ముఖ్యపాత్రల్లో నటించారు. స్మితా పాటిల్ మరణించిన తరువాత విడుదలైన ఈ చిత్రం, ఆవిడ జ్ఞాపకార్థంగా నిలిచింది.[1]
సూత్రధార్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | చంద్రకాంత్ జోషి |
రచన | విజయ్ కువలేకర్ (కథ & స్క్రీన్ ప్లే), వసంత డియో (మాటలు) |
నిర్మాత | పుండాలిక్ చోపాడే, వాసుదేవ్ దేశింకర్, సంజీవ్ కులకర్ణి, రాజేంద్ర ఓస్వాల్, వైశాలి పరేఖ్ |
నటవర్గం | స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నానా పటేకర్ |
ఛాయాగ్రహణం | దేబు దేయోధర్ |
సంగీతం | సుధీర్ మోఘే |
నిర్మాణ సంస్థ | వర్తమాన్ ఫిల్మ్స్ |
విడుదల తేదీలు | 1987 |
నిడివి | 124 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
కథసవరించు
గ్రామంలోని జమీందారు గ్రామస్తులపై దౌర్జన్యాలు చేస్తుంటాడు. యువకుడైన కుమార్ జమీందారు తీరును చూసి సహించలేకపోతాడు. కుమార్ కు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వస్తుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఏకైక కుమార్తె, కుమార్ చిన్ననాటి స్నేహితురాలైన ప్రేర్ణ కలకత్తాలో చదివు పూర్తిచేసుకొని వస్తుంది. జమీందార్‌కు వ్యతిరేకంగా నిలబడటానికి సిద్ధంగా ఉన్న కుమార్ ధైర్యానికి, దృఢ నిశ్చయానికి ముగ్దురాలైన ప్రేర్ణ అతన్ని మెచ్చుకుంటుంది. గ్రామ సంక్షేమం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి యువకులను చేర్చే ప్రయత్నంలో ఆమె కుమార్‌తో కలిసి పనిచేస్తుంది. వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటారు. గ్రామంలో జరిగే ఎన్నికల్లో గ్రామపెద్ద పదవికి కుమార్ పోటీ చేస్తాడు. తాను ఎక్కువగా అసహ్యించుకునే వ్యక్తిగా కుమార్ మారబోతున్నాడని ప్రేర్ణ గుర్తిస్తుంది.[2]
నటవర్గంసవరించు
- గిరీష్ కర్నాడ్ (జమీందారు)[3][4]
- స్మితా పాటిల్ (ప్రేరణ)
- నానా పటేకర్ (కుమార్)
- గజానన్ జాగీర్దార్ (ప్రధానోపాధ్యాయుడు)
- ఆశాలత (బేల)
- నీలు పూలే
- మధు కాంబికర్
- కమళాకర్ సారంగ్
- శ్రీకాంత్ మోగే
- సుధీర్ దేవి
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: చంద్రకాంత్ జోషి
- నిర్మాత: పుండాలిక్ చోపాడే, వాసుదేవ్ దేశింకర్, సంజీవ్ కులకర్ణి, రాజేంద్ర ఓస్వాల్, వైశాలి పరేఖ్
- కథ & స్క్రీన్ ప్లే: విజయ్ కువలేకర్
- మాటలు: వసంత డియో
- సంగీతం: సుధీర్ మోఘే
- ఛాయాగ్రహణం: దేబు దేయోధర్
- నిర్మాణ సంస్థ: వర్తమాన్ ఫిల్మ్స్
మూలాలుసవరించు
- ↑ "Sutradhar". IMDb. Retrieved 27 June 2019.
- ↑ "Sutradhar". Apun Ka Choice. Retrieved 4 August 2019.[permanent dead link]
- ↑ The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 1 July 2019.
- ↑ https://timesofindia.indiatimes.com/city/bengaluru/a-manthan-of-masala-art/articleshow/69734520.cms