సూరజ్‌కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా
సూరజ్‌కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా (ఆంగ్లం: Surajkund International Crafts Mela) సూరజ్‌కుండ్ అనేది 10వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన జలాశయం, ఇది హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ నగరంలోని ఆరావళి శ్రేణి దక్షిణ ఢిల్లీ శిఖరంపై దక్షిణ ఢిల్లీ నుండి 8 కిమీ (5 మైళ్ళు) దూరంలో ఉంది.[1] సూరజ్‌కుండ్ కృత్రిమంగా ఏర్పడిన జలాశయం, అర్ధ వృత్తాకార రూపంలో యాంఫిథియేటర్ ఆకారపు కట్టతో నిర్మింపబడి ఉంటుంది. దీనిని 10వ శతాబ్దంలో తోమరా రాజపుత్రుల రాజు సూరజ్పాల్ నిర్మించినట్లు చెబుతారు. ఢిల్లీ రాజపుత్ర పాలకుడు అనంగ్పాల్ తోమర్ చిన్న కుమారుడు తోమర్ సూర్య ఆరాధకుడు, అందువల్ల అతను దాని పశ్చిమ ఒడ్డున సూర్య దేవాలయాన్ని నిర్మించాడు.[1][2][3][4] సూరజ్‌కుండ్ దాని వార్షిక ఉత్సవం "సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా" కు ప్రసిద్ధి చెందింది, ఈ ఉత్సవం 2015 ఎడిషన్ ను 160,000 మంది విదేశీయులు, 20కి పైగా దేశాల నుండి పాల్గొన్నారు.[5]
వసంత ఋతువులో, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుండి భారతదేశంలోని రంగురంగుల సాంప్రదాయ చేతిపనుల పండుగ 40 ఎకరాల సూరజ్‌కుండ్ ఆవరణలో జరుగుతుంది, దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాలు అనేక డజన్ల ఇతర దేశాలతో పాటు 200,000 మంది విదేశీయులతో సహా 12 లక్షలకు పైగా సందర్శకులు హాజరవుతారు.[6] ఈ ఉత్సవం మొదటిసారిగా 1987లో ప్రారంభమైంది.[7][8][9] "సూరజ్‌కుండ్ క్రాఫ్ట్స్ మేళా", "సూరజ్‌కుండ్ డిజైనర్ల గ్రామం" అని పిలువబడే ఈ వార్షిక వేడుకలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి సాంప్రదాయ హస్తకళాకారులు అనగా కళాకారులు, చిత్రకారులు, నేత కార్మికులు, శిల్పులు వంటి వారు పాల్గొంటారు. కలప, లోహ, వెదురు, ఇనుము, గాజు, వస్త్రాలు, రాతితో 50 మంది ఉత్తమ డిజైనర్లు, హస్తకళాకారులు రూపొందించిన డిజైనర్ వస్తువులను ఇక్కడ చూడవచ్చు. ఈ మేళాను ప్రపంచం నలుమూలల నుండి కళలు, చేతిపనుల ప్రేమికులు సందర్శిస్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం భారతీయ సంస్కృతి, చేతిపనులపై విభిన్న ఇతివృత్తంతో జరుగుతుంది.[10][11]
చిత్రమాలిక
మార్చు-
ప్రతిష్టాత్మక సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా 2016లో, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలంగాణ కళారూపాల కళాయాత్రలో బోనాల కళాకారుల ప్రదర్శన
-
సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా 2016లో, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలంగాణ కళారూపాల కళాయాత్రలో బోనాల కళాకారుల ప్రదర్శన
-
సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా 2016లో, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలంగాణ కళారూపాల కళాయాత్రలో చిందు యక్షగాన కళాకారులు
-
సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా2016లో, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలంగాణ కళారూపాల కళాయాత్రలో డప్పు కళాకారుల ప్రదర్శన
-
సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా 2016లో, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలంగాణ కళారూపాల కళాయాత్రలో ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన
-
సూరజ్ కుండ్ మేళాలో అమ్మకానికి వివిధ చేతివృత్తుల వస్తువులు
-
2013లో సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా
-
2019లో సూరజ్‌కుండ్‌లో చార్మినార్ సూక్ష్మరూపం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Sharma, Y.D (2001). Delhi and its Neighbourhood. New Delhi: Archaeological Survey of India. p. 100 in 161. Archived from the original on 31 ఆగస్టు 2005. Retrieved 5 సెప్టెంబరు 2009.
Page 100: Suraj Kund lies about 3 km south-east of Tughlaqabad in district Gurgaon---The reservoir is believed to have been constructed in the tenth century by King Surjapal of Tomar dynasty. Page 101: About 2 km south-west of Surajkund, close to the village of Anagpur (also called Arangpur) is a dam ascribed to Anagpal of the Tomar Dynasty, who is also credited with building the Lal Kot
{{cite book}}
:|work=
ignored (help) - ↑ "Ticketed Monuments – Haryana: Suraj Kund". National Informatics Centre, Government of India. Retrieved 2009-09-05.
- ↑ Peck, Lucy (2005). Delhi - A thousand years of Building. New Delhi: Roli Books Pvt Ltd. p. 29. ISBN 81-7436-354-8. Retrieved 2009-09-05.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ "The Fair". Retrieved 2009-09-05.
- ↑ "29th Surajkund International Crafts Mela Ends". Ndtv.com. Retrieved 2015-10-31.
- ↑ "29th Surajkund International Crafts Mela Ends". Ndtv.com. Retrieved 2015-10-31.
- ↑ "34th Surajkund International Crafts Mela - The Statesman". The Statesman.
- ↑ "32nd Surajkund International Handicraft Mela 2018". BookMyShow.
- ↑ Surajkund mela to be opened today, Punjab kesari, 1 Feb 2019.
- ↑ "The Fair". Retrieved 2009-09-05.
- ↑ "Haryana". Surajkund Designer's Village. National Informatics centre (NIC). Archived from the original on 2009-03-23. Retrieved 2009-09-06.