సూర్యదేవర రాఘవయ్య చౌదరి

సూర్యదేవర రాఘవయ్య చౌదరి రచయిత, హేతువాది.

జీవిత విశేషాలుసవరించు

సూర్యదేవర రాఘవయ్య చౌదరి గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా కొల్లూరు గ్రామములో నాగయ్య, రుక్మిణమ్మ దంపతులకు 1876లో జన్మించాడు. అతను తురుమెళ్ళలోని తన మేనమామ ఇంట ప్రబంధ కావ్య పఠనమునకు విద్య నభ్యసించాడు. అతను చిన్ననాటి నుండి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు. సంగంజాగర్లమూడికి చెందిన కాంతమ్మను వివాహం చేసుకున్నాడు. సంతానం కలుగలేదు. తన తమ్ముని కుమారుడు నాగేశ్వరరావును దత్తత చేసుకొన్నాడు.

సాంఘికవ్యవస్థలో అగ్రకులముగ నున్నబ్రాహ్మణులకు తప్ప యితరకులజులకు స్థానములేకపోవుటచే జి.ఎస్.పి. సరస్వతి(నెల్లూరు) స్వాములవారి బోధననలననుసరించి, ఒక బ్రహ్మాండమైన ఉద్యమము లేవదీసి ఆంధ్రదేశములో వాడవాడలా, వేదములు చదువుటకు అన్నివర్ణములకు హక్కుకలదని ఉపన్యాసములిచ్చాడు. బ్రాహ్మణ సహాయనిరాకరణోద్యమము చేయుచు స్వసంఘ పౌరోహిత్యము, ప్రత్యేకముగ నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి మండలములలో స్వసంఘములు నెలకొల్పాడు. కాని వ్యక్తిగతముగ ఏయొక బ్రాహ్మణుని ద్వేషించువాడుకాదు[1].

కొల్లూరులో 1915-16లో బ్రాహ్మణేతర సంఘాన్ని స్థాపించి బ్రాహ్మణేతర కులాల స్వాభిమాన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు.[2] ఇతని ఉద్యమ స్ఫూర్తితో జస్టిస్ పార్టీ ఏర్పడింది. తెనాలి తాలూకా బోర్డు మెంబరుగా పనిచేశారు. రాఘవయ్య చౌదరి 1937లో మరణించాడు[3].

రచనలుసవరించు

 1. బ్రాహ్మణేతర విజయం 1925 [4]
 2. బ్రహ్మణేతరోద్యమతత్వం
 3. ఆర్యకవికుతంత్రం
 4. బ్రాహ్మణేతరసంఘాదర్శం 1927
 5. స్వసంఘపౌరోహిత్యం 1927
 6. విప్ర చరిత్ర
 7. కమ్మవారి చరిత్ర

మూలాలుసవరించు

 1. తణుకు నరేంద్ర సాహిత్య మండలి వారిచే1973 సంవత్సరంలో ప్రచురితమైన సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారి రచన ‘కమ్మవారి చరిత్ర’ గ్రంధము నుండి.
 2. Civil Disobedience Movement in Andhra By Palle Sivasankarareddi పేజీ.15 [1]
 3. http://www.sundarayya.org/sites/default/files/2020-08/Kammavaari%20Charithra.pdf
 4. kammasvictory.blogspot.com/2009_11_01_archive.html

బాహ్య లంకెలుసవరించు

 • Kamalakaram, Kotha (13, మే 2011, శుక్రవారం). "Kamma Velugulu కమ్మ వెలుగులు: సూర్యదేవర రాఘవయ్య చౌదరి Suryadevara Raghavayya Chowdary". Kamma Velugulu కమ్మ వెలుగులు. Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-04. Check date values in: |date= (help)