సూర్య క్షిపణి
సూర్య ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. భారత్ దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీని గురించిన మొదటి రిపోర్టు 1995 లో ది నాన్-ప్రోలిఫరేషన్ రివ్యూలో వచ్చింది. 2012 నాటికి ఈ ప్రాజెక్టు స్థితి ఏమిటన్నది ఇంకా ధ్రువపడలేదు.
సూర్య ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి | |
---|---|
రకం | ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి[1] |
అభివృద్ధి చేసిన దేశం | India |
సర్వీసు చరిత్ర | |
సర్వీసులో | ధ్రువీకరణ కాలేదు |
ఉత్పత్తి చరిత్ర | |
డిజైనరు | భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) |
విశిష్టతలు | |
బరువు | ~55,000 kg |
వార్‌హెడ్ | 3-10 మిర్వ్ వార్‌హెడ్లు యీల్డ్>200 kt[2] |
ప్రొపెల్లెంటు | మొదటి రెండు దశలు ఘన ఇంధనంతో, మూడవ దశ ద్రవ ఇంధనంతో (లేదా మూడు దశలూ ఘన ఇంధనంతో)[3] |
ఆపరేషను పరిధి | ~12,000-16,000 కిమీ[1] |
వేగం | Mach 24 (29,400 km/h) |
లాంచి ప్లాట్‌ఫారం | TEL |
చరిత్ర
మార్చుది నాన్-ప్రోలిఫరేషన్ రివ్యూలో ప్రచురితమైన రిపోర్టు ప్రకారం భారత్ అభివృద్ధి చేస్తున్న ఖండాంతర క్షిపణి పేరు సూర్య.[4] DRDO ఈ ప్రాజెక్టును 1994 లో మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. 2010 వరకు ఈ రిపోర్టును మరే ఇతర వర్గం కూడా ధ్రువీకరించలేదు. భారత ప్రభుత్వ అధికారులు పదేపదే ఈ ప్రాజెక్టు ఉనికిని ఖండించారు.
ఆ రిపోర్టు ప్రకారం సూర్య భూమ్మీద నుండి ప్రయోగించే, ఘన, ద్రవ ఇంధనంతో కూడిన, ఖండాంతర క్షిపణి. ఇది భారత సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం యొక్క ప్రాజెక్టుల్లో ఒకటి. దీని పరిధి 12,000[5] నుండి 16,000 కిమీ ఉంటుందని భావిస్తున్నారు.[1]
ఈ క్షిపణిని ఇంకా అభివృద్ధి చెయ్యలేదు కాబట్టి, దాని సాంకేతిక వివరాలు ఇంకా తెలియ రాలేదు. కార్యక్రమం వివరాలు మొత్తం చాలా రహస్యంగా ఉన్నాయి.
చలామణీలో ఉన్న సాంకేతిక వివరాలు
మార్చు- శ్రేణి: ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి
- Lasing: భూమ్మీద నుండి ప్రయోగించేలా, సముద్రం లోపల నుండి ప్రయోగించేలా. జలాంతర్గామి నుండి ప్రయోగించే వీలు ఉండడం దీని ప్రధానమైన అంశం - ఈ కూర్పు యొక్క పరిధి 10,000 కిమీ పైచిలుకు.
- పొడవు: 40.00 మీ.
- వ్యాసం: 1.1 మీ.
- బరువు: 55,000 కెజి.
- ప్రొపల్షన్: మొదటి/రెండు దశలు ఘన, మూడవ దశ ద్రవ.
- వార్‌హెడ్ సామర్థ్యాలు: 3-10 అణు వార్‌హెడ్‌లు -ఒక్కొక్కటీ 250-750 కిలో టన్నులు.
- స్థితి: ధ్రువీకరించబడలేదు
- మోహరించబడిందా?: ధ్రువీకరించబడలేదు
ఇవి కూడా చూడండి
మార్చు- అగ్ని క్షిపణులు
- పిఎస్ఎల్వి
మూలాలు వనరులు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Missile impossible: why the Agni-V falls short". rbth. Retrieved 29 July 2015.[permanent dead link]
- ↑ N. Madhuprasad (25 August 2005). "Boost to Indian Armed Forces' Deterrence Arsenal; India to Develop Intercontinental Ballistic Missile". Bangalore Deccan Herald.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ 3.0 3.1 "Surya-1/-2 | Missile ThreatMissile Threat". Missilethreat.com. 2012-10-29. Retrieved 2012-12-11.[permanent dead link]
- ↑ Surya ICBM.
- ↑ "Surya - India Missile Special Weapons Delivery Systems". Fas.org. Retrieved 2010-08-31.