సూర్య ప్రతాప్
సూర్య ప్రతాప్ షాహి (జననం 1952 డిసెంబరు 23) భారతీయ రాజకీయ నాయకుడు. సూర్య ప్రతాప్ ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం సూర్య ప్రతాప్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.[1] గతంలో సూర్య ప్రతాప్ ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేశాడు. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీకి సానుభూతి తరంగాలు ఉన్నప్పటికీ 1985లో ఎన్నికల్లో గెలిచిన భారతీయ జనతా పార్టీ నాయకులలో ఆయన ఒకరు.[2]
సూర్య ప్రతాప్ సాహి | |
---|---|
ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి | |
Assumed office 2017 మార్చి 19 | |
ముఖ్యమంత్రి | యోగి ఆదిత్యనాథ్ |
ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు | |
In office 2010 మే 12 – 2012 ఏప్రిల్ 13 | |
అంతకు ముందు వారు | రామ్ త్రిపాఠి |
తరువాత వారు | లక్ష్మణ్ పాల్ |
ఉత్తరప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి | |
In office 1997 సెప్టెంబర్ 21 – 2002 మార్చి 8 | |
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి | మాయావతికళ్యాణ్ సింగ్ రామ్ ప్రకాష్ గుప్తారాజ్ నాథ్ సింగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1952 డిసెంబర్ 23 ఉత్తరప్రదేశ్ , భారతదేశం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | రాణి సాహి |
కళాశాల | బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం |
వృత్తి | వ్యవసాయ వేత్త న్యాయవాది |
బాల్యం
మార్చుసూర్య ప్రతాప్ 1952 డిసెంబర్ 23న భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని పకహాన్ గ్రామంలో భూమిహార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[3] సూర్య ప్రతాప్ ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ నుండి తన విద్యను ప్రారంభించాడు. సూర్య ప్రతాప్ గ్రాడ్యుయేట్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. సూర్య ప్రతాప్ 1974లో వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి పట్టా పొందాడు [4] సూర్య ప్రతాప్ తండ్రి రాజేంద్ర కిషోర్ షాహి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్నాయకుడు. సూర్య ప్రతాప్ కు విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. సూర్య ప్రతాప్ మేనమామ రవీంద్ర కిషోర్ షాహి భారతీయ జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిగా 1977 నుండి 1979 వరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.[5] 1973లో సూర్య ప్రతాప్ కు రాణి షాహీతో వివాహం జరిగింది. సూర్య ప్రతాప్ కు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు సంతానం.
రాజకీయ జీవితం
మార్చుసూర్య ప్రతాప్ 1980లో మొదటిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో సూర్య ప్రతాప్ ఓడిపోయాడు. , 1985లో సూర్య ప్రతాప్ 'కాసియా' శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1991లో సూర్య ప్రతాప్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేశాడు. తర్వాత సూర్య ప్రతాప్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు. 1996లో సూర్య ప్రతాప్ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సూర్య ప్రతాప్ 1997 నుంచి 2002 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పని చేశారు.[6]
- ↑ "Among the 22 cabinet ministers, Surya Pratap Shahi, DNA".
- ↑ "सूर्य प्रताप शाही योगी मंत्रिमंडल में कैबिनेट मंत्री बने, Patrika".
- ↑ "Member Profile". Government of Uttar Pradesh Vidhansabha Portal. Archived from the original on 23 జనవరి 2024. Retrieved 1 September 2019.
- ↑ "सूर्य प्रताप साही, NDTV".
- ↑ "जानिए कौन हैं सूर्य प्रताप साही, Patrika".
- ↑ New BJP President of Uttar Pradesh: Surya Pratap Shahi-Aaj Ki Khabar