సైతువాల్ జిల్లా

మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒక జిల్లా

సైతువాల్ జిల్లా, మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒక జిల్లా. 2019, జూన్ 3 నుండి ఈ జిల్లా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.[1]

సైతువాల్ జిల్లా
మిజోరాం రాష్ట్ర జిల్లా
మిజోరాంలోని ప్రాంతం ఉనికి
మిజోరాంలోని ప్రాంతం ఉనికి
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
ముఖ్య పట్టణంసైతువాల్
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గంమిజోరాం లోకసభ నియోజకవర్గం
జనాభా
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
జాలస్థలిsaitual.nic.in

చరిత్రసవరించు

1974 నుండి సైతువాల్ జిల్లా ఏర్పాటు డిమాండ్ ప్రారంభమయింది.[2] 1993లో సిటిజెన్ కమిటీ స్థాపించబడింది. అనేక ఇతర కమిటీలు, సంఘాలు అన్ని కలిసి సైతువాల్ జిల్లా ఏర్పాటు డిమాండ్ కమిటీగా[3] ఏర్పడ్డాయి. ఆ కమిటీ అధ్వర్యంలో నిరసనలు, బంద్‌లు, ర్యాలీలు, సమావేశాలు మొదలైనవి జరిగాయి.[4] చివరికి, 2008, సెప్టెంబరు 12న సైతువాల్ జిల్లా ఏర్పాటయింది.[5] దీని ముఖ్య పట్టణం సైతువాల్.

టోపోనిమిసవరించు

జిల్లా ప్రధాన కార్యాలయం సైతువాల్ పేరును జిల్లాకు పెట్టారు.

రవాణాసవరించు

సైతువాల్ నుండి రాష్ట్ర రాజధాని ఐజాల్ మధ్య దూరం 77 కి.మీ. ఉంటుంది. ఇక్కడినుండి బస్సులు, మాక్సికాబ్స్ లతో రవాణా సౌకర్యం ఉంది.[6]

విభాగాలుసవరించు

ఈ జిల్లాలో చల్ఫిల్, షావి, లెంగ్టెంగ్ అనే మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 37 పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. 10,219 కుటుంబాలలో 50,575 మంది నివసిస్తున్నారు. ఇందులో 25,607 మంది పురుషులు, 24,968 మంది మహిళలు ఉన్నారు. జిల్లా రాజధానిలో 2,457 కుటుంబాలు ఉండగా, అక్కడ 11,619 జనాభా నివసిస్తున్నారు.[7]

మూలాలుసవరించు

  1. "Hnahthil DISTRICT CELEBRATES FORMATION". DIPR Mizoram. Retrieved 28 December 2020.
  2. "Saitual DC leh SP lawmna hun buatsaih". Vanglaini. Archived from the original on 9 ఆగస్టు 2019. Retrieved 28 December 2020.
  3. "Saitual District Implementing Demand Committee, tlawmngai pawl hrang hrang leh Political Party hrang hrang \angrual in vawiin khan Saitual khawpuiah Lungawilohna ni an hmang". Zonet. Retrieved 28 December 2020.
  4. "Protest over new district". telegraphindia. Retrieved 28 December 2020.
  5. "MINISTER R LALZIRLIANA'N SAITUAL DC OFFICE HAWNG, SAITUAL DC LEH SP HMASA BER LAWMNA BUATSAIH". DIPR Mizoram. Retrieved 28 December 2020.
  6. "Aizawl to Champhai". Mizoram NIC. Archived from the original on 1 ఏప్రిల్ 2012. Retrieved 28 December 2020.
  7. "District thar 3-ah mi 1,15,424 an awm Saitual district-ah mihring an tam ber". Vanglaini. Archived from the original on 6 ఆగస్టు 2020. Retrieved 28 December 2020.