సైతువాల్

మిజోరాం రాష్ట్రంలోని సైతువాల్ జిల్లా ముఖ్య పట్టణం.

సైతువాల్, మిజోరాం రాష్ట్రంలోని సైతువాల్ జిల్లా ముఖ్య పట్టణం.

సైతువాల్
పట్టణం
సైతువాల్ is located in Mizoram
సైతువాల్
సైతువాల్
మిజోరాంలో ప్రాంతం ఉనికి
సైతువాల్ is located in India
సైతువాల్
సైతువాల్
సైతువాల్ (India)
Coordinates: 23°41′23″N 92°57′20″E / 23.689630°N 92.955670°E / 23.689630; 92.955670
దేశం భారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లాసైతువాల్
జనాభా
 (2001)
 • Total10,243
భాషలు
 • అధికారికమిజో
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
796261
Vehicle registrationఎంజెడ్ 09

చరిత్ర

మార్చు

సైతువాల్ పట్టణాన్ని గతంలో సైహ్మార్ ఖాన్ అని పిలిచేవారు. 1912లో డోరవ్టా సైలో ఇక్కడ క్రైస్తవ స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. మొదట్లో 16 కుటుంబాలు చేరగా, 1916లో ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు. జనాభా పెరగడంతో పాఠశాలలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటుచేయబడ్డాయి. గ్రామాన్ని ఎవరు స్థాపించారు అనే దానిపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది వాదన ప్రకారం, 1914లో సుమారు 12 కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. 1915లో డోరవ్టా సైలోఈ గ్రామానికి చీఫ్ అయ్యాడు. 2015లో ఈ పట్టణ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి.[1]

జనాభా

మార్చు

2001 భారత జనాభా లెక్కల,[2] ప్రకారం సైతువాల్ పట్టణంలో 10,243 జనాభా ఉంది. ఈ జనాభాలో 50% మంది పురుషులు, 50% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 83% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 84% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 82% గా ఉంది. సైతువాల్ పట్టణ జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

రవాణా

మార్చు

సైతువాల్ పట్టణానికి, ఐజాల్ నగరానికి మధ్య 77 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, మాక్సిక్యాబ్ లతో రవాణా సౌకర్యం ఉంది.[3]

పర్యాటకం

మార్చు

తామ్ దిల్

మార్చు

ఐజాల్ నుండి 110 కి.మీ.ల దూరంలో, సైతువాల్ పట్టణానికి 6 కి.మీ.ల దూరంలోని కొండలలో తామ్ దిల్ సరస్సు (జలాశయం) ఉంది.

 
తామ్ దిల్ సరస్సు

విద్య

మార్చు

ఇక్కడ మిజోరాం విశ్వవిద్యాలయం పరిధిలోని సైతువాల్ కళాశాల, అనేక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.

 
సైతువాల్ కళాశాల

మీడియా

మార్చు

సైతువాల్ పట్టణంలో సైతువాల్ పోస్ట్ అనే ప్రధాన వార్తాపత్రిక ఉంది.[4]

మూలాలు

మార్చు
  1. "SAITUAL KHAW CHANCHIN TLANGPUI". Retrieved 28 December 2020.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 28 December 2020.
  3. "Aizawl to Champhai". Mizoram NIC. Archived from the original on 1 ఏప్రిల్ 2012. Retrieved 28 December 2020.
  4. "The Saitual Post". Retrieved 28 December 2020.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సైతువాల్&oldid=4011859" నుండి వెలికితీశారు