సోగ్గాడి పెళ్ళాం

1996 తెలుగు సినిమా

సోగ్గాడి పెళ్ళాం 1996 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం యొక్క సంగీతం సాలూరి కోటేశ్వర రావు ఇచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అరోమా ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎ. గఫూర్ నిర్మించాడు.

సోగ్గాడి పెళ్ళాం
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
నిర్మాణం ఎం.ఎ.గఫూర్
కథ రాజ్ కిరణ్
చిత్రానువాదం ముత్యాల సుబ్బయ్య
తారాగణం మోహన్ బాబు, రమ్యకృష్ణ
ఛాయాగ్రహణం ఎం.వి,రఘు
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఆరోమా ఆర్ట్స్
భాష తెలుగు
ముత్యాల సుబ్బయ్య

రాంబాబు ( మోహన్ బాబు ) తన కుమార్తెతో ఓ మారుమూల గ్రామానికి వస్తాడు. రాంబాబు తన భార్య హంతకుడు మోహన్ రాజ్ కోసం వెతుకుతున్నాడు. అతని కుమార్తె మాత్రమే హంతకుడిని చూసింది. అయినప్పటికీ, సాక్షిని చంపడానికి వారిని అనుసరిస్తుంది. ఇంతలో, గ్రామ పెద్ద కుమార్తె మోనికా బేడి రాంబాబుతో ప్రేమలో పడుతుంది.

గతంలో, రాంబాబు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు: అతను అల్లరిచిల్లరిగా బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి, అతను పేకాట ఆడటానికే అతడికి సమయం సరిపోయేది కాదు. కాని అతను దయగల వ్యక్తి. రౌడీ మోహన్ రాజ్ వేరే గ్రామంలో నవజాత శిశువును చంపి, ఆడ శిశుహత్యను సమర్ధిస్తాడు.. తరువాత, ఈ పద్ధతికి సహకరించినందుకు రాంబాబు ఆ గ్రామ పెద్ద రాఘవయ్య ( కైకాల సత్యనారాయణ ) తో గొడవ పడతాడు. రాఘవయ్యను శిక్షించడానికి రాంబాబు, అతడి కుమార్తె జానకి ( రమ్య కృష్ణ ) ని కిడ్నాప్ చేసి, తన ఇంట్లో బంధిస్తాడు. అప్పుడు హంతకుడు మోహన్ రాజ్‌ను అరెస్టు చేయమని రాఘవయ్య పోలీసులకు ఫిర్యాదు చేసి మోహన్ రాజ్‌ను జైలుకు పంపుతాడు. ఆ తరువాత, జానకి రాంబాబుతో ప్రేమలో పడుతుంది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. రాంబాబు జానకిని పెళ్ళి చేసుకుంటాడు. కాని అతడి బాధ్యతా రాహిత్యం ఇప్పటికీ అలాగే ఉంటుంది. తరువాత, రాంబాబు కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకుంటాడు. గ్రామంలో గౌరవనీయ వ్యక్తి అవుతాడు. జైలు నుండి విడుదలైన తరువాత, మోహన్ రాజ్ రాంబాబుపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం అతడి భార్య జానకిని హత్య చేస్తాడు.

ప్రస్తుతం లోకి వస్తే, రాంబాబు మోనికా బేడిని వివాహం చేసుకోవటానికి స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతను మోహన్ రాజ్ను శిక్షించటానికి నిశ్చయించుకున్నాడు. తరువాత ఏం జరుగుతుందనేది మిగతా కథ.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
ట్రాక్ # పాట గాయనీ గాయకులు సాహిత్యం వ్యవధి
1 'టక్కరి' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర భువన చంద్ర
2 కొండమల్లి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర గురుచరణ్
3 'సత్యభామ' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర భువన చంద్ర
4 'కొండా కోన' కెజె యేసుదాస్, కెఎస్ చిత్ర సాయి శ్రీహర్ష 4:26
5 'సంక్రాంతి' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర భువన చంద్ర

మూలాలు

మార్చు