సోనాక్షి సిన్హా

భారతీయ నటి

సోనాక్షి సిన్హా (జననం 1987 జూన్ 2) భారతీయ సినీ నటి, గాయని. [1] తన కెరీర్ ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన తరువాత, సిన్హా యాక్షన్-డ్రామా చిత్రం దబాంగ్ (2010) లో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇది ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది . [2] దబాంగ్, రౌడీ రాధోడ్ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాలలో నటించింది. ఈమె ప్రముఖ హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె.

సోనాక్షి సిన్హా
Sonakshi Sinha promotes 'Joker' 01.jpg
'జోకర్' చిత్ర ప్రచారంలో సోనాక్షి
జననం
సోనాక్షి సిన్హా

(1987-06-02) 1987 జూన్ 2 (వయస్సు 35)
విద్యFashion Designing course from SNDT, Mumbai
వృత్తినటి, రూపదర్శిని
క్రియాశీల సంవత్సరాలు2010 - present
తల్లిదండ్రులుShatrughan Sinha
Poonam Sinha
బంధువులుLuv Sinha and Kussh Sinha (brothers)
వెబ్‌సైటుwww.sonakshisinha.net

జీవిత విశేషాలుసవరించు

సోనాక్షి 1987 జూన్ 2 న బీహార్ లోని పాట్నాలో [3] సినీ నటులు శత్రుఘన్ సిన్హా, పూనమ్ సిన్హా లకు జన్మించింది. ఆమె తండ్రి బిహారీ కాయస్థ కుటుంబానికి చెందినవారు కాగా, ఆమె తల్లి సింధి హిందూ కుటుంబానికి చెందినది. [4] ఆమె తండ్రి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. [3] [5] అతను 2019 లో భారత జాతీయ కాంగ్రెస్‌ లోకి మారిపోయాడు. సోనాక్షి ముగ్గురు పిల్లలలోకీ చిన్నది – ఆమెకు ఇద్దరు (కవల) సోదరులు, లవ్ సిన్హా, కుష్ సిన్హా ఉన్నారు. ఆమె ఆర్య విద్యా మందిరంలో పాఠశాల విద్యను అభ్యసించింది. తరువాత శ్రీమతి నాతిబాయి దామోదర్ థాకర్సే ఉమెన్స్ యూనివర్శిటీకి చెందిన ప్రేమ్లీలా వితల్దాస్ పాలిటెక్నిక్ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ లో పట్టభద్రురాలైంది. [6]

సినిమా జీవితంసవరించు

రౌడీ రాథోడ్ (2012), సన్ ఆఫ్ సర్దార్ (2012), దబాంగ్ 2 (2012), హాలిడే: ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ (2014) వంటి చిత్రాల్లో రొమాంటిక్ పాత్రలు ధరించింది. పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేపట్టినందుకు ఆమె విమర్శలు ఎదుర్కొంది. రొమాంటిక్ డ్రామా లుటేరా (2013) లో క్షయ వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళ పాత్రలో ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీనికి ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుకు నామినేషన్ పొందింది. [7] [8] [9] ఆ తరువాత మిషన్ మంగల్ (2019) మినహా, ఆమె నటించిన సినిమాలి వరుసగా వాణిజ్యపరంగా విఫలమయ్యాయి.[10]

సినిమాల్లో నటించడంతో పాటు, సిన్హా తన తేవార్ (2015) చిత్రంలో ఇమ్రాన్ ఖాన్ పాట "లెట్స్ సెలబ్రేట్"లో ఒక చిన్న భాగాన్ని పాడింది. ఆమె " ఆజ్ మూడ్ ఇష్క్‌హోలిక్ హై " కూడా పాడింది. మొత్తం నాలుగు చిత్రాలలో పాడింది.

ఫిల్మోగ్రఫీసవరించు

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. {{cite web}}: Empty citation (help)
  2. Gaurav Dubey. "Salman Khan hosts an impromptu birthday bash for Sonakshi Sinha". Mid Day. Retrieved 12 October 2017.
  3. 3.0 3.1 "'Shotgun Junior' Sonakshi Sinha turns 26!". Zee News. Retrieved 12 October 2017.
  4. Pradhan S. Bharati (12 June 2012). "It's work first for Sonakshi". The Telegraph (Kolkata). Retrieved 30 October 2019.
  5. {{cite web}}: Empty citation (help)
  6. {{cite web}}: Empty citation (help)
  7. "Sonakshi Sinha: Year since 'Lootera', appreciation hasn't stopped". The Times of India. IANS. 5 July 2014. Archived from the original on 14 July 2014. Retrieved 28 November 2015.
  8. "Shatrughan Sinha breaks down after watching daughter Sonakshi in Lootera". Indian Express. Retrieved 12 October 2017.
  9. http://www.bollywoodhungama.com/news/features/no-one-doubted-capacity-actor-past-well-sonakshi-sinha-akira-appreciation/
  10. "Sonakshi Sinha". Retrieved 8 March 2018.