సోమరసం
(సోమరసము నుండి దారిమార్పు చెందింది)
సోమరసం ఒక ప్రత్యేకమైన మొక్కల కాండాల నుండి రసం సంగ్రహించుట వలన సిద్ధం అవుతోంది అని వేదాలలో వర్ణించబడింది.[1]
చరిత్ర
మార్చు- సోమలత యొక్క చిన్న చిన్న కొమ్మలు అంశువులు అని అంటారు. వీటిని రెండు చేతులు, పది వ్రేళ్ళతో త్రిప్పుతూ రాళ్ళతో చితక కొడతారు. వీటి నుండి సోమరసం స్రవిస్తుంది (ద్రవిస్తుంది). ఆ తరువాత పది వ్రేళ్ళతో, ఉన్నివస్త్రాలతో ఆ సోమ రసాన్ని వడగడతారు. ఆ వచ్చిన ద్రవాన్ని పాల తోనూ, పెరుగు తోనూ, బార్లీ తోనూ, నీళ్ళ తోనూ కొన్ని సందర్భాలలో తేనె తోనూ కలిపిన రసాన్ని యజ్ఞములలో వినియోగించుతారు.
ఈ మొక్క చాలా అరుదైనది . ఈ మొక్క యొక్క ఆకు, రోజుకు ఒక్క ఆకు చొప్పున శుక్లపాడ్యమి నుండి పున్నమి వరకు పెరిగి బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు ఒక్కొక్క ఆకును రాల్చుతుంది.
యజ్ఞం
మార్చుఆఫ్ఘనిస్తాన్ లో 'సోమలత సమృద్ధిగా దొరుకుతుంది. సోమరసం లేకుండా ఏ యజ్ఞం లేదు. ఋగ్వేదం యొక్క తొమ్మిదో మండలం సోమ మండలం అంటారు.[2]
నమ్మకము
మార్చు- ఈ సోమరసం ఇంద్రుడుకి చాలా ఇష్టం,
- ఈ సోమరసము త్రాగిన వారిని అమరులని చేస్తుందని నమ్మకము. ఈ అమృతమును పీయూషము అని కీర్తించ బడింది.
- ఈ సోమరసము, సోమలత, సోమదేవతలు హరిత వర్ణము, అరుణ వర్ణము లతో కలిగి ఉంటాయి.
- ఈ సోమరసం మూజవత పర్వతము లలో పుట్టినదని, దివ్య పక్షి చేత స్వర్గము నుండి భూలోకము నకు తీసుకు రాబడినదని ఋగ్వేదములో వర్ణించ బడింది.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- Anthony, David W. (2007), The Horse The Wheel And Language. How Bronze-Age Riders From the Eurasian Steppes Shaped The Modern World, Princeton University Press
- Bakels, C.C. 2003. “The contents of ceramic vessels in the Bactria-Margiana Archaeological Complex, Turkmenistan.” in Electronic Journal of Vedic Studies, Vol. 9. Issue 1c (May 2003)
- Beckwith, Christopher I. (2009), Empires of the Silk Road, Princeton University Press
- Jay, Mike. Blue Tide: The Search for Soma. Autonomedia, 1999.
- Lamborn Wilson, Peter. Ploughing the clouds:The search for Irish Soma, City Lights,1999.
- McDonald, A. "A botanical perspective on the identity of soma (Nelumbo nucifera Gaertn.) based on scriptural and iconographic records" in Economic Botany 2004;58
మూలాలు
మార్చు- ↑ https://en.wikipedia.org/wiki/Soma
- ↑ (ఋ, 9.42.1, 9.61.17)