సోమశేఖరస్వామి దేవాలయం
సోమశేఖరస్వామి దేవాలయం బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం కోటిపల్లి గ్రామంలో నెలకొని ఉంది. ఇది గుంటూరు జిల్లా ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటి[1].
సోమశేఖరస్వామి దేవాలయం | |
---|---|
పేరు | |
ప్రధాన పేరు : | సోమశేఖరస్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | బాపట్ల జిల్లా |
ప్రదేశం: | కోటిపల్లి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సోమశేఖరస్వామి (శివుడు) |
ప్రధాన దేవత: | సత్యజ్ఞాన ప్రసూనాంబ |
ముఖ్య_ఉత్సవాలు: | శివరాత్రి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూ |
స్థలపురాణం
మార్చుసా.శ.1770లో రాచూరు జమీందారు రాజా జగ్గన్నారావు మాణిక్యాలరావు విహారయాత్రకు వెళ్లి కోటిపల్లి మీదుగా తిరిగి వస్తుండగా "నన్ను చూడకుండానే వెళ్ళుచున్నావా" అనే మాటలు అతని చెవులకు సోకాయట. వెంటనే ఆ జమీందారు అక్కడ దిగి అటూ ఇటూ చూడగా ఒక పుట్ట కనిపించింది. దానిపై కొన్ని పుష్పాలు కూడా కనిపించాయి. వెంటనే అతడు తన నగరానికి వెళ్లి తన మంత్రి, పురోహితులతో ఈ విషయం గురించి వివరించగా వారు ఆ పుట్టలో శివలింగం ఉన్నట్లు తెలిపారట. వెంటనే ఆ జమీందారు అక్కడి స్థలాన్ని పరిశీలించి, ఆగమ, వేద శాస్త్రాల ప్రకారం శివలింగాన్ని వెలికి తీయించి ఒక శుభముహూర్తంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిపించాడు. తరువాత స్వామివారికి గర్భాలయం, ముఖమంటపం మొదలైనవి కట్టించి వైభవోపేతంగా ప్రతిష్ఠాపన ఉత్సవాలు నిర్వహించాడు. పావనకృష్ణానదిలో స్నానం చేసి ఈ దేవుని సందర్శిస్తే సర్వపాపాలు నశిస్తాయని ఇక్కడి భక్తుల నమ్మకం.
విశేషాలు
మార్చు- ఈ ఆలయం కృష్ణానదీ తీరంలో నెలకొని ఉంది.
- దోనేపూడి గ్రామానికి 1.5 కి.మీల దూరంలో తెనాలి - రేపల్లె రోడ్డు మార్గంలో ఈ దేవాలయం ఉంది.
- సమీప రైల్వేస్టేషన్ భట్టిప్రోలు.
- ఈ ఆలయ ప్రాంగణంలో సత్యజ్ఞానప్రసూనాంబ అమ్మవారు, పాపవిమోచన స్వామి, వినాయక, నవగ్రహాలు కొలువై ఉన్నారు.
- ఈ ఆలయానికి చాలాకాలం రాచూరు జమీందారీ వంశీకులు ధర్మకర్తలుగా వ్యవహరించారు. తరువాత ఈ ఆలయ నిర్వహణ దేవాదాయ ధర్మాదాయశాఖ చేపట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది.
- ఈ ఆలయానికి గాలిగోపురము, యజ్ఞశాల, వాహనశాల, కళ్యాణమంటపాలు ఉన్నాయి. స్వామివారికి నంది వాహనము, చలవచప్రములు ఉన్నాయి.
- ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి, దేవీనవరాత్రులు, కార్తీక మాసం, ముక్కోటి ఏకాదశి, సంవత్సరాది పండుగలలో విశేషపూజలు జరుగుతాయి.
మూలాలు
మార్చు- ↑ పి.వి.ఆర్. అప్పారావు (18 January 1981). "శ్రీ సోమశేఖరస్వామి వారి దేవస్థానము కోటిపల్లి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 284. Retrieved 4 February 2018.[permanent dead link]