కోటిపల్లి (కొల్లూరు)

(కోటిపల్లి(కొల్లూరు) నుండి దారిమార్పు చెందింది)

"కోటిపల్లి(కొల్లూరు)" బాపట్ల జిల్లా కొల్లూరు మండలానికి చెందిన గ్రామం. [1]

కోటిపల్లి(కొల్లూరు)
—  గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 388: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల జిల్లా
మండలం కొల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ : 522 324 522 324
ఎస్.టి.డి కోడ్ : 08644

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలుసవరించు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

ఈ గ్రామములో శ్రీ సత్య జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ సోమశేఖరస్వామి దేవాలయం ఉంది. [1]

గ్రామములోని ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామములోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయము

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎన్.సుధాకరరావు, వికలాంగుల భారత క్రికెట్ జట్టుకు ఎంపికైనారు. 2015,ఆగస్టు-19 నుండి 24 వరకు, వికలాంగుల క్రికెట్ అసోసియేషన్, తిరుపతిలో నిర్వహించిన ప్రాబబుల్ మ్యాచ్ లో, 35 మంది పాల్గొన్నారు. వీరిలో ముగ్గురిని రాష్ట్రం నుండి ఎంపికచేయగా, ఆ ముగ్గురిలో వీరొకరు. జిల్లా నుండి వీరొక్కరే ఎంపిక కావడం విశేషం. భారత జట్టుకు ఎంపిక అయిన ఈ క్రీడాకారులు, డిసెంబరు/2015లో టాలీవుడ్ జట్టుతోనూ, ఫిబ్రవరి/2016లో దుబాయిలో నిర్వహించు త్రిముఖ (భారత్, శ్రీలంక, పాకిస్థాన్) పోటీలలో పాల్గొంటారు. [2]

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.