సోలన్ జిల్లా

హిమాచ;ల ప్రదేశ్ లోని జిల్లా

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో సోలన్ జిల్లా ఒకటి. సోలన్ పట్టణం జిల్లాకేంద్రగా ఉంది. జిల్లా వైశాల్యం 1,936 చ.కి.మీ.

సోలన్ జిల్లా
హిమాచల్ ప్రదేశ్ పటంలో సోలన్ జిల్లా స్థానం
హిమాచల్ ప్రదేశ్ పటంలో సోలన్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంసోలన్
మండలాలు1. సోలన్, 2. కసౌలి, 3. నాలాగఢ్, 4. అర్కి 5. కందాఘాట్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు5
Area
 • మొత్తం1,936 km2 (747 sq mi)
Population
 (2011)
 • మొత్తం5,76,670
 • Density300/km2 (770/sq mi)
 • Urban
18.22%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత85.02%
 • లింగ నిష్పత్తి852
సగటు వార్షిక వర్షపాతం1253 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర మార్చు

ప్రస్తుత సోలన్ జిల్లా ప్రాంతంలో ఒకప్పుడు భోపాల్, భగత్, కునిహార్, కుతార్, మంగల్, బేజా, మహ్‌లాగ్,నలగర్, కియోతల్, కోథి, పర్వతమయ ప్రాంతాలు కలిసి పంజాబ్ ప్రోవిన్స్‌లో భాగంగా ఉంటూ వచ్చాయి. తరువాత 1966 నవంబరు 1 న ఇవి హిమాచల్ ప్రదేశ్ లో కలిసాయి. 1972 సెప్టెంబరు 1 న సోలన్ జిల్లా ఏర్పడింది. ఈ జిల్లా మునుపటి మహాసు జిల్లా నుండి సోలన్, అర్కి తహసీళ్ళు, మునుపటి సిమ్లా జిల్లా నుండి కందఘాట్, నలఘర్ తహసీళ్ళనూ కలిపి ఏర్పాటు చేసారు.ఈ జిల్లాలో ఉన్న షూలిని దేవి పేరిట ఈ జిల్లాకు నామకరణం చేసారు. షూలిని మాత సోలన్ ప్రాంతాన్ని వినాశనం నుండి రక్షించిందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

విభాగాలు మార్చు

సోలన్ జిల్లా 4 ఉపవిభాగాలుగా (సోలన్,నలగర్, అర్కి, కందఘాట్) గా విభజించబడి ఉంది. సోలన్ ఉప విభాగంలో సోలన్, కసౌలి తెహసీళ్ళు ఉన్నాయి. నలఘర్ అర్కి అర్కి, కందఘాట్‌లు ప్రత్యేక తెహ్సిల్స్‌గా ఉన్నాయి. జిల్లాలో 5 విధానసభ నియోజకవర్గాలు (అర్కి,సోలన్,డూన్, సోలన్, కసౌలి) ఉన్నాయి. ఇవి అన్నీ సిమ్లా పార్లమెటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు మార్చు

సోలన్ జిల్లాలో అందార్ బజార్ వద్ద మాతా షూలిని దేవి ఆలయం, రాజ్ఘర్ రోడ్డు వద్ద జతోలీ మందిర్, మాల్ రోడ్డు వద్ద చిల్డ్రెన్ పార్క్, శిఖరం మీద జవహర్ పార్క్, భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన " మోహన్ మీకిన్ బ్రివెరీస్ ఉన్నాయి. కల్క-సిమ్లా మార్గంలో నడుపబడుతున్న టాయ్ ట్రైన్ సోలన్ జిల్లా గుండా ప్రయాణిస్తుంది.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 576,670,[1]
ఇది దాదాపు సోలోమన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో 532 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత 298 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 15.21%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 824:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాస్యత శాతం 85.02%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Archived from the original on 2012-05-05. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Wyoming 563,626
==భౌగోళిక స్థానం ==

బయటి లింకులు మార్చు