సౌత్ ఇండియన్ బ్యాంక్

భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ కంపెనీ

సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ (ఎస్ఐబి) (South Indian Bank Limited (SIB) భారతదేశంలోని కేరళ రాష్ట్రము లోని త్రిస్సూరు లో ప్రధాన కార్యాలయం ఉన్న ఒక ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకు. భారతదేశం అంతటా విస్తరించిన శాఖలతో వినియోగదారులకు ఆర్ధిక సేవలను అందిస్తున్న బ్యాంక్.

సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్.
రకంపబ్లిక్
బి.ఎస్.ఇ: 532218
NSESOUTHBANK
పరిశ్రమబ్యాంకింగ్
ఆర్ధిక సేవలు
స్థాపన29 జనవరి 1929; 95 సంవత్సరాల క్రితం (1929-01-29)
ప్రధాన కార్యాలయంత్రిస్సూర్, కేరళ, భారతదేశం
కీలక వ్యక్తులు
  • సలీం గంగాధరన్
    (చైర్మన్)
  • మురళి రామకృష్ణన్
    (మేనేజింగ్ డైరెక్టర్ (ముఖ్య నిర్వహణ అధికారి)
[1][2]
ఉత్పత్తులుక్రెడిట్ కార్డులు, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారం, డీమ్యాట్ అకౌంట్, వినియోగదారు బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఆర్ధిక,ఇన్స్యూరెన్స్, తనఖా రుణం, ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్
రెవెన్యూIncrease6,562.64 crore (US$820 million) (2017)[2]
Increase 1,214.59 crore (US$150 million) (2017)[2]
Increase 392.50 crore (US$49 million) (2017)[2]
Total assetsIncrease74,312.15 crore (US$9.3 billion) (2017)[2]
ఉద్యోగుల సంఖ్య
7,677 (2017) [2]
మూలధన నిష్పత్తి12.37% [2]
వెబ్‌సైట్www.southindianbank.com Edit this on Wikidata

చరిత్ర

మార్చు

దక్షిణ భారతదేశంలోని పురాతన బ్యాంకులలో ఒకటైన సౌత్ ఇండియన్ బ్యాంక్ (ఎస్.ఐ.బి) స్వదేశీ ఉద్యమ సమయంలో స్థాపన జరిగింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ 29 జనవరి 1929 న త్రిస్సూర్ లో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించబడింది, తరువాత 1939 ఆగస్టు 11 న పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చబడింది. ఎస్.ఐ.బి.ని త్రిస్సూరు లోని ఔత్సాహికలు సమాజంలో సురక్షితమైన సమర్థవంతమైన,సేవా ఆధారితముగా ప్రజలకు అందించడానికి, మరోవైపు అత్యాశగల వడ్డీ వ్యాపారుల బారి నుండి వ్యాపారులను కాపాడడానికి, సహేతుకమైన వడ్డీ రేట్లకు అవసరమైన ఆధారిత రుణాన్ని అందించడం కొరకు ఈ బ్యాంక్ లక్ష్యం గా పెట్టుకుని ఏర్పాటు చేయబడింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ 31 డిసెంబర్ 2020 నాటికి దేశవ్యాప్తంగా 877 బ్రాంచీలతో, 1443 ఎటిఎమ్ ల నెట్ వర్క్ తో ఉన్నది.[3]

సేవలు

మార్చు

సౌత్ ఇండియన్ బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ ( పర్సనల్ బ్యాంకింగ్ ) లో కింద డిపాజిట్, పొదుపు, రుణాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డీమ్యాట్ సర్వీసులు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మొదలైన అనేక రకాల వ్యక్తిగత బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. మ్యూచువల్ ఫండ్ సేవలలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎఎంసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, టాటా మ్యూచువల్ ఫండ్, సుందరం బిఎన్పి పరిబాస్, యుటిఐ మ్యూచువల్ ఫండ్స్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎస్బిసి ఇన్వెస్ట్మెంట్స్,హెచ్ డి ఎఫ్ సి మ్యూచువల్ ఫండ్, ఫిడిలిటీ ఫండ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్స్, ఫోర్టిస్ ఇన్వెస్ట్మెంట్స్, బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, డిఎస్పి బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వివిధ ఫండ్ల మ్యూచువల్ ఫండ్స్ ను బ్యాంక్ అందిస్తుంది.

ఎన్ఆర్ఐ బ్యాంకింగ్- ప్రవాస భారతీయల (ఎన్ఆర్ఐ) ఖాతాదారులకు డిపాజిట్, కారు రుణాలు, రెమిటెన్స్లు, పెట్టుబడి పథకాలు, భీమా వంటి సేవలను అందిస్తుంది.

కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలలో సౌత్ ఇండియన్ బ్యాంక్ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ మొదలైన సేవలను పారిశ్రామిక రంగములో అందిస్తుంది.[4]

అభివృద్ధి

మార్చు
  • ఏప్రిల్ 1992లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున కరెన్సీ చెస్ట్ ను తెరిచిన భారతదేశంలోని ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి బ్యాంకు.
  • 1992 నవంబరులో ఎన్ ఆర్ ఐ శాఖను ప్రారంభించిన మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకు.
  • మార్చి 1993లో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ బ్రాంచీని ప్రారంభించిన ప్రైవేట్ రంగములో మొట్టమొదటి బ్యాంకు.
  • జూన్ 1993 లో ఎగుమతి , దిగుమతి వ్యాపారానికి ప్రత్యేకంగా సేవలందించడానికి "ఓవర్సీస్ బ్రాంచ్" ను ప్రారంభించిన కేరళలోని ప్రైవేట్ రంగ బ్యాంకులలో మొదటిది.
  • 1992 నుండి ఇన్-హౌస్ పాక్షిక ఆటోమేషన్ సొల్యూషన్ ఆపరేషన్ కు అదనంగా ఒక ఇన్-హౌస్, పూర్తిగా ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ ఆటోమేషన్ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసిన కేరళలోని మొదటి బ్యాంక్.
  • కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి కేరళ ఆధారిత బ్యాంకు.
 
త్రిస్సుర్ లో ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంకు శాఖ - ఏ టి ఎం

ఈ బ్యాంకు భారతదేశంలో అత్యంత అనుకూలమైన చురుకైన బ్యాంకులలో ఒకటిగా పరిగణించబడుతుంది, వినియోగ దారుల సేవల కీలక భాగంలో నిపుణులతో సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బ్యాంకు గా ఉన్నది. [5]

అవార్డులు

మార్చు

సౌత్ ఇండియన్ పొందిన అవార్డులు ఈ విధముగా ఉన్నాయి.[6]

  • సౌత్ ఇండియన్ బ్యాంక్ ఐడీఆర్ బీటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ ప్రత్యేక అవార్డును దక్కించుకుంది.
  • ఏషియన్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ మ్యాగజైన్ నుండి ఉత్తమ "ఏషియన్ బ్యాంకింగ్ వెబ్ సైట్" అవార్డును అందుకుంది
  • 2012-13 సంవత్సరంలో ఐబీఏ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ గ్రహీత..
  • సండే స్టాండర్డ్ బెస్ట్ బ్యాంకర్స్ -2013 అవార్డ్స్
  • సౌత్ ఇండియన్ బ్యాంక్ ఐడిఆర్ బిటి నుండి టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డు 2011-12 ను పొందింది.
  • సౌత్ ఇండియన్ బ్యాంక్ బెస్ట్ బ్యాంక్ అవార్డ్
  • సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉత్తమ వెబ్ సైట్ అవార్డును కెఎమ్ఎ నుండి గెలుచుకుంది
  • బిజినెస్ వరల్డ్ ఇండియాస్ బెస్ట్ బ్యాంక్ 2010- అవార్డ్ టు సౌత్ ఇండియన్ బ్యాంక్
  • సండే స్టాండర్డ్ బెస్ట్ బ్యాంకర్స్ -2013 అవార్డ్స్
  • సౌత్ ఇండియన్ బ్యాంక్ IDRBT నుంచి టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డు 2010ని గెలుచుకుంది
  • 2020 - "ఇన్ఫోసిస్ ఫినాకిల్ క్లయింట్ ఇన్నోవేషన్ అవార్డులను సౌత్ ఇండియన్ బ్యాంక్ గెలుచుకుంది".
  • 2021 - సౌత్ ఇండియన్ బ్యాంక్ యూఐపాత్ ఆటోమేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 అవార్డును క్రైసిస్ ఫర్ బిజినెస్ కంటిన్యూటీ కింద బెస్ట్ ఆటోమేషన్ కింద దక్కించుకుంది. -సౌత్ ఇండియన్ బ్యాంక్ వీడియో కెవైసి అకౌంట్ ఓపెనింగ్ ను ప్రారంభించింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ 4 కేటగిరీల్లో ఐబీఏ అవార్డులను గెలుచుకుంది.

మూలాలు

మార్చు
  1. "Board of Directors - South Indian Bank". southindianbank.com. Retrieved 2020-10-08.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Balance Sheet 31.03.2017" southindianbank.com (16 March 2018).
  3. "South Indian Bank Ltd". Business Standard India. Retrieved 2022-07-22.
  4. "South Indian Bank: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of South Indian Bank - NDTV". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-22.
  5. "About Us | Leading Private Bank in India - South Indian Bank". www.southindianbank.com. Retrieved 2022-07-22.
  6. "History of South Indian Bank Ltd., Company". Goodreturn (in ఇంగ్లీష్). Retrieved 2022-07-22.