సౌమిలీ బిస్వాస్

బెంగాలీ టివీ, సినిమా నటి, మోడల్, యాంకర్, శాస్త్రీయ నృత్య కళాకారిణి.

సౌమిలీ బిస్వాస్, బెంగాలీ టివీ, సినిమా నటి, మోడల్, యాంకర్, శాస్త్రీయ నృత్య కళాకారిణి.[1] 2003లో వచ్చిన అలో సినిమాలోని సహాయక పాత్రలో తొలిసారిగా నటించింది. తారా బంగ్లాలో సిలబస్-ఇ నీ అనే నాన్-ఫిక్షన్, స్టూడెంట్-బేస్డ్ షో యాంకర్‌గా టివీరంగంలోకి అడుగుపెట్టింది.[2] 2007లో, ఈటివీ బంగ్లా దుర్గే దుర్గతినాశినిలో దుర్గాదేవి పాత్రను పోషించింది.[3] జీ బంగ్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగాలీ డాన్స్ రియాలిటీ షో డాన్స్ బంగ్లా డ్యాన్స్ సీజన్లకు మెంటార్‌గా పనిచేస్తోంది. 2021, ఫిబ్రవరి 17న భారతీయ జనతా పార్టీలో చేరింది.

సౌమిలీ బిస్వాస్
జననం29 సెప్టెంబరు
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటి, మోడల్, డ్యాన్సర్
జీవిత భాగస్వామిఅయాన్ ఘోష్‌ (2012)

జననం, విద్య మార్చు

సౌమిలీ సెప్టెంబరు 29న దక్షిణ కోల్‌కతాలోని బరిషా/బెహలాలో జన్మించింది. కోల్‌కతాలోని బెహలాలోని బిద్యా భారతి బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన సౌమిలీ, కలకత్తా విశ్వవిద్యాలయంలోని జోగమాయా దేవి మహిళా కళాశాల నుండి ఆర్థికశాస్త్రం (ఆనర్స్)లో పట్టభద్రురాలైంది.

నృత్యరంగం మార్చు

మూడు సంవత్సరాల వయస్సు నుండి భరతనాట్యంలో శిక్షణ నేర్చుకొని, తరువాత తంకమణి కుట్టి, మమతా శంకర్ ల దగ్గర బ్యాలెట్‌లో శిక్షణ పొందింది. కోల్‌కతా, ఇతర ప్రాంతాలలో నృత్య నాటకాలు, సోలో, గ్రూప్ క్లాసికల్ ప్రదర్శనలలో పాల్గొన్నది. భరతనాట్యంలో సంగీత రత్న, సంగీత్ బిభాకర్ అవార్డులను అందుకుంది.[1][4][5]

వ్యక్తిగత జీవితం మార్చు

2012 డిసెంబరులో బ్యాంకింగ్ ప్రొఫెషనల్ అయిన అయాన్ ఘోష్‌తో సౌమిలీ వివాహం జరిగింది.

సినిమాలు మార్చు

  • అలో (2003) - సహాయ నటి
  • గ్యరకల్ (2003) - దిశా, సహాయ నటి
  • సంగ్రామ్ (2005) - సహాయ నటి
  • ఆశా (2006) - ప్రధాన పాత్ర
  • అగ్నిశపత్ (2006)
  • బాజిమాత్ (2008) - సహాయ నటి
  • యూ-టర్న్ (2010) - ప్రధాన పాత్ర
  • అగ్నిసాక్షి (2011) - సహాయ నటి
  • తీన్ తనయ (2011) - సహాయ నటి
  • సుధు తోమాకే చాయ్ (2013) - ప్రధాన పాత్ర (దీపా)

టెలివిజన్ మార్చు

  • ఝుమ్ తరా రా ( జీ బంగ్లా )
  • సిలబస్-ఇ నెయి (తారా బంగ్లా)
  • కోన్ కనోనర్ ఫూల్ ( జీ బంగ్లా )
  • సోమోయ్ ( రూపోషి బంగ్లా )
  • జాయ్ బాబా లోకేనాథ్ (జీ బంగ్లా)

మహాలయ మార్చు

  • 2007 ఈటివీ (కలర్స్) బంగ్లా మహాలయా దేవి మహిసాసురమర్దిని
  • 2008 డిడి బంగ్లా మహాలయా దేవి మహిషాసురమర్దిని

రియాలిటీ షోలు మార్చు

  • రాన్నాఘోర్ (జీ బంగ్లా)
  • దీదీ నం. 1 (జీ బంగ్లా)
  • డ్యాన్స్ బంగ్లా డాన్స్ (మెంటార్‌గా జీ బంగ్లా)[6]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Soumili Biswas Tollyworld profile". Tollyworld website. Archived from the original on 23 June 2013. Retrieved 1 March 2022.
  2. "Interview: Danseuse-Actress Soumili Biswas (Teen Tanaya, Sudhu Tomake Chai, Kanchanbabu) talks about her career in Bengali films". WBRi. Archived from the original on 1 మార్చి 2022. Retrieved 1 March 2022.
  3. "Spotlight Soumili". 5 October 2007. Retrieved 1 March 2022.
  4. "Clean & Clear event at Jogamaya Devi College - Times Of India". archive.ph. 2013-01-03. Archived from the original on 2013-01-03. Retrieved 2022-03-01.
  5. "tollyworld.com/index.php?option=com_artist&controller=arti…". archive.ph. 2013-02-04. Archived from the original on 2013-02-04. Retrieved 2022-03-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Delhi, BestMediaInfo Bureau; May 24; 2021. "Zee Bangla launches 11th season of its dance reality show Dance Bangla Dance". www.bestmediaifo.com. Retrieved 2022-03-01. {{cite web}}: |last3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు మార్చు