సౌర విద్యుత్తు అనగా సూర్యరశ్మి నుంచి తయారయ్యే విద్యుచ్ఛక్తి.

సోలార్ ప్యానెల్

చిన్న తరహా నుంచి మధ్యతరహా అవసరాల కోసం మొదట్లో కేవలం ఫోటోవోల్టాయిక్స్ నే వాడేవారు. ఇందులో ఒకే ఒక సౌర ఘటంతో పనిచేసే క్యాలిక్యులేటర్ మొదలుకొని ఇంటి అవసరాలను తీర్చే సౌర ఫలకాల వరకు ఉన్నాయి. 1980వ దశకం నుంచీ వ్యాపార అవసరాల కోసం సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ఖచ్చు తగ్గడంతో లక్షలకొద్దీ సౌర ఫలకాలు విద్యుత్ గ్రిడ్ లో భాగం కావడం మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే ఫోటోవోల్టాయిక్ పవర్ స్టేషన్ కర్ణాటకలోని పావగడ లో ఉంది. ఇది ఏటా 2050 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నది.[1]

తయారీ

మార్చు

భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల శక్తిగల సూర్యకిరణాలు వెలువడతాయి. వీటిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగెళ్ళిపోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి.

సౌర విద్యుత్తును హీట్ ఇంజన్ (ఉష్ణోగ్రతా భేదాన్ని యంత్ర శక్తిగా మార్చేది) ల నుంచి కానీ ఫోటో వోల్టాయిక్ ఘటాలనుంచి కానీ ఉత్పత్తి చేస్తారు.

సౌర విద్యుత్ తయారీ సూత్రము

మార్చు

సోలార్ పానెల్ లోని ఫొటోవోల్టాయిక్ సెల్స్ వెలుతురుని ఎలెక్ట్రాన్లుగా రూపాంతరణ చేస్తాయి. ఆ వెలుతురుని ఫొటోవోల్టాయిక్ సెల్స్ ఎలెక్ట్రాన్లుగా మార్చి తద్వారా విద్యుత్ శక్తిగా రూపాంతరణ చేస్తాయి . ఒకొక్క సోలార్ సెల్ 1.5 పవర్ జెనరేట్ చేస్తాయి, 30-40 సెల్స్ ఇని సిరీస్, పేర్లల్‌గానో కలిపితే ఒక మాడ్యూల్ అవుతుంది, ఒక్కో మాడ్యూల్ 1/2 చదరపు మీటర్ విస్తీర్ణం అట, ఒక్కో మాడ్యూల్ 40-60వాట్లు జెనరేట్ చేస్తుంది, DC ని AC కి మార్చేటప్పుడు 4-12 శాతం లాస్ వుంటుంది . కాంతి ఏదైనా పొటాషియమ్ లాంటి కాంతి ప్రభావిత పదార్థము పై ఉద్గారము చెందినపుడు ఆ పదార్థము లో ఉన్న ఎలక్ట్రానులు బయటకు వెలువడే ప్రక్రియను స్ఫురదీప్తి (ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్) గా పిలుస్తారు. ఈ ప్రక్రియని జరుపుటకు కాంతికి అవసరమయ్యే అతి తక్కువ శక్తిని ప్రారంభ శక్తి ( Threshold energy ) గా పిలుస్తారు. అలాగే ఈ ప్రక్రియని జరుపుటకు కాంతికి ఉండవలసిన అతి తక్కువ పౌనః పున్యమును శక్తిని ప్రారంభ శక్తి ( Threshold energy ) గా పిలుస్తారు.

ఉపయోగాలు

మార్చు

సౌర విద్యుత్ తో పనిచేయు పరికరాలు

మార్చు

సోలార్ వాహనాలు

మార్చు

సూర్యరశ్మితో నడిచే కారు తయారు చేయాలని 1980ల నుంచీ ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో ఆస్ట్రేలియాలో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహించబడుతుంది. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటారు. ఈ పందెం డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు సాగుతుంది.

నిల్వ చేయు

మార్చు

మూలాలు

మార్చు
  1. Ranjan, Rakesh (2019-12-27). "World's Largest Solar Park at Karnataka's Pavagada is Now Fully Operational". Mercom India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-13.