సౌశీల్య ద్రౌపది

సౌశీల్య ద్రౌపది కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన ఒక తెలుగు నవల. సౌశీల్య ద్రౌపది నవల ప్రధానంగా వ్యాసభారతము, కవిత్రయ భారతాల ఆధారంగా రచించింది. అక్కడక్కడా, అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని పాటిస్తూ, కల్పనలు చేయబడ్డాయి. భారతీయ ధర్మాన్ని అర్థం చేసుకోని రచయత రచించిన నవలిక ఈ సౌశీల్య ద్రౌపది. పురాణ కథలలో జీవిత సత్యాలు పొందు పరిచి ఉన్నాయి. తరచి చూస్తే అనేక అద్భుతమైన మనుల్లాంటి విషయాలు అర్థమవుతాయి, సౌశీల్య ద్రౌపది నవలలో ఇలాంటి విషయాలు యెత్తిచూపే ప్రయత్నం చేసాడు కస్తూరి మురళీకృష్ణ, పురాణాలు ఏ రకంగా సమకాలీన సమాజానికి ఉపయోగపడతాయో చూపించే ప్రయత్నం చేసాడు కవి. ముఖ్యంగా కస్తూరి మురళీకృష్ణ సౌశీల్య ద్రౌపదిలో 'ద్రౌపది' పాత్రను ఆధునిక సమాజంలో మహిళకు ప్రతీకగా చేసి ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించాడు, తద్వారా మన పురాణ పాత్రలను ఈనాటి సమాజానికి చేరువ చేసే ప్రయత్నం చేసాడు.

సౌశీల్యద్రౌపది - నవల ముఖచిత్రం

చరిత్ర

మార్చు

సౌశీల్య ద్రౌపది కస్తూరి మురళీకృష్ణ వ్రాసాడు. మొదటి ముద్రణ మే 2010 న విడుదలైంది. మెదట సౌశీల్య ద్రౌపది ఆంధ్రభూమి మాస పత్రికలో మినీ నవలగా వెలువడింది.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు