కస్తూరి మురళీకృష్ణ
కస్తూరి మురళీకృష్ణ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో[vague], విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించిన మురళీకృష్ణ రచనలు పాఠకాదరణ పొందుతున్నాయి. మురళీకృష్ణ కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కస్తూరి మురళీకృష్ణ | |
---|---|
జననం | కస్తూరి మురళీకృష్ణ 10-01-65 /జనవరి 10, 1965 షక్కర్ నగర్, బోధన్ తాలూకా, నిజామాబాద్ జిల్లా |
ఇతర పేర్లు | నీలిమ, సూరజ్, లక్ష్మీలత, నీరజ్, శ్రీమాన్ సత్యవాది, పల్లవ్ |
వృత్తి | రైల్వే ఉద్యోగి |
ప్రసిద్ధి | తెలుగు రచయిత,తెలుగు సాహితీకారులు |
మతం | హిందూ |
భార్య / భర్త | కె. పద్మ |
పిల్లలు | నాగసంధ్యాలక్ష్మీ |
తండ్రి | కె. సూర్యనారాయణ రావు |
తల్లి | కె. సత్యవతి |
వెబ్‌సైటు | |
www.kasturimuralikrishna.com |
వ్యక్తిగత జీవితం
మార్చుమురళీకృష్ణ 1965 జనవరి 10 తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా, శక్కర్ నగర్ గ్రామంలో కస్తూరి సూర్యనారాయణరావు, సత్యవతి దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం బోధన్, హైదరాబాదులలో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి భూగర్భశాస్త్రంలో ఎం.ఎస్.సి, దూరవిద్య ద్వారా తత్త్వశాస్త్రంలో ఎం.ఎ., రష్యన్ భాషలో అడ్వాన్స్‌డ్ డిప్లమాలను సాధించాడు. వీరికి ప్రపంచ సాహిత్యం, సంగీతం పట్ల మక్కువ వుంది. మురళీకృష్ణ తొలి రచన 1991 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన మృగతృష్ణ అనే కథ. ప్రస్తుతం ఈయన దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్నాడు.
రచన రంగం
మార్చుతెలుగు సాహిత్యంలో ఉన్న వీలైనన్ని ప్రక్రియలలో రచనలు చేసారు.[vague]విభిన్నాంశాలపై రచనలు చేస్తున్నాడు. ఈయన ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్త, నవ్యవీక్లీ పత్రికలకు నవలలు కథలతోపాటు మరెన్నో శీర్షికలు వ్రాసాడు. అలాగే కాల్పనికేతర రచనలు కూడా చేసాడు. ఇవి కాక టివి స్స్రిప్టు రాస్తున్నాడు. అసిధార, అంతర్మధనం, మర్మయోగం, సౌశీల్య ద్రౌపది, శ్రీకృష్ణదేవరాయలు, పునఃసృష్టికి పురిటినొప్పులు, రోషనారా, ముస్సోలిని మొదలైన నవలలు పుస్తక రూపంలో వచ్చాయి. జీవితం – జాతకం, 4 x 5, రాజతరంగిణి కథలు, రియల్ స్టోరీస్, సైన్స్ ఫిక్షన్ కథలు, ఉజ్వల భారత మహోజ్వల గాథలు, క్రైమ్ స్టోరీస్ వంటి కథా సంపుటాలు వెలువరించాడు. రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు వంటి కథా సంకలనాలకు సహ సంపాదకుడుగా వ్యవహరించాడు. భారతీయ తత్వ చింతన, మన ప్రధాన మంత్రులు, మన ముఖ్య మంత్రులు , భారతీయ వ్యక్తిత్వ వికాసం, తీవ్రవాదం, పాప్ ప్రపంచానికి రారాజు మైకెల్ జాక్సన్, అక్షరాంజలి, శైశవగీతి, నవల నుండి సినిమాకు, పాడుతా తీయగా మొదలైనవి పుస్తక రూపంలోకి వచ్చిన కాల్పనికేతర రచనలు. ఇవికాక, పలు పత్రికలలో పవర్ పాలిటిక్స్, సినీచిత్రాలు, సగటు మనిషి స్వగతం, వ్యంగ్యాస్త్రం, ప్రాచీన విజ్ఞానం, మ్యూజికల్ మ్యూజింగ్స్ వంటివి ఈయన రాసిన శీర్షికలు. కస్తూరి ప్రచురణలు అనే సంస్థను స్థాపించి ఉత్తమ సాహిత్యాన్ని పుస్తక రూపంలో అందిస్తున్నాడు.
దృక్పథం
మార్చుఈయన రచనలపై, సాహిత్య దృక్పథంపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం కనిపిస్తుంది.[ఆధారం చూపాలి] తెలుగు సాహిత్యంలోని అన్ని రకాల ప్రక్రియలూ, విభాగాలలో రచనలు చేయాలనేది మురళీకృష్ణ సంకల్పం.[ఆధారం చూపాలి] ఈ క్రమంలోనే వైవిధ్యభరితమైన రచనలు చేశాడు.
బహుమతులు, పురస్కారాలు
మార్చు- 1995లో ఆంధ్ర ప్రభ ’దీపావళి ‘ నవలల పోటీలో ‘అంతర్యాగం ‘ నవలకు ద్వితీయ బహుమతి
- 1999 లో ఆంధ్ర భూమి సస్పెన్స్ నవలల పోటీలో న ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి.
- 2017 లో ఆధ్యాత్మిక సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని అందుకున్నాడు.[1]
నవలలు
మార్చు- అంతర్యాగం
- రోషనార
- ముస్సోలిని
- అసిధార
- అంతర్మధనం
- మర్మయోగం
- సౌశీల్య ద్రౌపది
- పునఃసృష్టికి పురిటి నొప్పులు
- శ్రీకృష్ణ దేవరాయలు
సంపుటాలు/సంకలనాలు
మార్చు- జీవితం – జాతకం
- 4 x 5
- కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు
- రియల్ స్టోరీస్
- సైన్స్ ఫిక్షన్ కథలు
- ఆ అరగంట చాలు (తెలుగులో భయానక కథల తొలి సంపుటి)
- ఉజ్వల భారత మహోజ్వల గాథలు
- క్రైమ్ స్టోరీస్ (డిటెక్టివ్ శరత్ పరిశోధన కథలు)
- భారతీయ ప్రేమకథామాలిక
- రైలు కథలు (సహ సంపాదకత్వం)
- దేశభక్తి కథలు (సహ సంపాదకత్వం)
- క్రీడా కథ (సహ సంపాదకత్వం)
- కులం కథ (సహ సంపాదకత్వం)
- తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు (సహ సంపాదకత్వం)
సినిమా సంబంధ రచనలు
మార్చు- పాడుతా తీయగా
- కమర్షియల్ క్లాసిక్స్
- నవల నుంచి సినిమా వరకు
కాల్పనికేతర రచనలు
మార్చు- భారతీయ తత్వ చింతన
- మన ప్రధాన మంత్రులు
- మన ముఖ్య మంత్రులు
- 1857-మనం మరవ కూడని మహా యుద్ధం
- భారతీయ వ్యక్తిత్వ వికాసం
- తీవ్రవాదం
- పాప్ ప్రపంచానికి రారాజు మైకెల్ జాక్సన్
- అక్షరాంజలి
- ప్రాచీన విజ్ఞానం
- నీలమతపురాణం
శీర్షికలు
మార్చు- పవర్ పాలిటిక్స్
- సినీ సిత్రాలు
- సగటుమనిషి స్వగతం
- పాడుతా తీయగా
- ఏదయినా ఏమయినా
- కథాసాగరమథనం
- మ్యూజికల్ మ్యూజింగ్స్
- సంపూర్ణ జాతక కథలు
- కశ్మీర రాజతరంగిణి
మూలాలు
మార్చు- ↑ ఈనాడు (డైలీహంట్) (13 October 2015). "43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 15 October 2018. Retrieved 28 May 2019.