స్కెచ్ (2018 సినిమా)
స్కెచ్ 2018లో విడుదలైన తెలుగు సినిమా. మూవింగ్ ఫ్రేమ్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు విజయ్ చందర్ దర్శకత్వం వహించాడు. విక్రమ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 12, 2018న విడుదలైంది.
స్కెచ్ | |
---|---|
దర్శకత్వం | విజయ్ చందర్ |
రచన | విజయ్ చందర్ |
నిర్మాత | మూవింగ్ ఫ్రేమ్ |
తారాగణం | విక్రమ్, తమన్నా |
ఛాయాగ్రహణం | ఎం. సుకుమార్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | మూవింగ్ ఫ్రేమ్ |
విడుదల తేదీ | 12 జనవరి 2018 |
సినిమా నిడివి | 155 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చులోన్ కట్టని వెహికల్ యజమానులు దగ్గర మైండ్ గేమ్ తో మొండి బకాయిలు వసూలు చేసే స్కెచ్ (విక్రమ్) రికవరీ ఏజెంట్. జీవా ( విక్రమ్ ) ఐడియాలు చూసి అతన్ని స్కెచ్ అని పిలుస్తుంటారు. ఈ క్రమంలో ఓ కారు విషయంలో ఈ గ్యారేజ్ లో పనిచేసే నలుగురు గ్యాంగ్ చేసిన పనితో రౌడీ వీరిపై కక్ష కడతాడు. ఇంతలో ఆ గ్యాంగ్ లోని జీవా ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా మాయం అయిపోతుంటారు. దీని వెనుక ఎవరున్నారు , ఆ రౌడీ పై స్కెచ్ ఎలా పగ తీర్చుకున్నాడు, చివరికి ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[1][2]
నటీనటులు
మార్చు- విక్రమ్
- తమన్నా
- సూరి
- బాబురాజ్
- ఆర్.కె. సురేష్
- శ్రీమాన్
- కల్లూరి వినోత్
- కబాలి విశ్వనాథ్
- హరీష్ పేరడీ
- జంగిరి మధుమిత
- శ్రీ ప్రియాంక
- వేలా రామమూర్తి
- అరుల్ దాస్
- అభిషేక్ వినోద్
- మేఘాలి
- చీను మోహన్
- జీవా రవి
- రవి కిషన్
- పి.ఎల్. తేనప్పన్
- పోస్టర్ నందకుమార్
- కృష్ణమూర్తి
- కే. ఎస్. జి. వెంకటేష్
- అంకిత్
- విజయ్ చందర్ (అతిధి పాత్రలో)
- దస్తా (అతిధి పాత్రలో)
- విజయ్ సేనాతిపతి (అతిధి పాత్రలో)
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: మూవింగ్ ఫ్రేమ్
- నిర్మాత: మూవింగ్ ఫ్రేమ్
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: విజయ్ చందర్
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
- ఎడిటర్ : రూబెన్
మూలాలు
మార్చు- ↑ The Times of India (13 January 2018). "Sketch Movie Review {2.5/5}: Critic Review of Sketch by Times of India". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
- ↑ IndiaGlitz (12 January 2018). "Sketch review. Sketch Telugu movie review, story, rating". Archived from the original on 20 సెప్టెంబరు 2021. Retrieved 20 September 2021.