స్టంపౌట్
స్టంపౌట్ అనేది క్రికెట్‌లో ఒక బ్యాటర్‌ను అవుట్ చేసే పద్ధతి. బ్యాటరు తన గ్రౌండ్‌లో లేనప్పుడు వికెట్-కీపరు స్ట్రైకర్ వికెట్‌ను కొట్టేస్తాడు [1] (బంతిని కొట్టే ప్రయత్నంలో బ్యాటరు పాపింగ్ క్రీజ్ దాటి బయటికి వెళ్లిపోతాడు). దీన్ని క్రికెట్ చట్టాల్లో చట్టం 39 లో నిర్వచించారు.[1]
"అవుట్ ఆఫ్ వారి గ్రౌండ్" అంటే బ్యాటర్ యొక్క శరీరం, పరికరాలు లేదా బ్యాట్‌లోని ఏ భాగం క్రీజ్ వెనుక నేలను తాకదు.
స్టంపౌట్ అనేది రనౌట్ లో ఒక ప్రత్యేక సందర్భం. అయితే స్ట్రైకర్ పరుగు కోసం ప్రయత్నించనప్పుడు, మరొక ఫీల్డర్ జోక్యం లేకుండా, వికెట్ కీపర్ మాత్రమే స్టంపింగ్ చేస్తాడు. బంతి నో-బాల్ కాకూడదు. రెండు రకాలుగా ఔటైన చోట స్టంపింగుగా రికార్డ్ చేసి, క్రెడిట్ బౌలరు, కీపరు ఇద్దరికీ ఇస్తారు. [2]
క్రికెట్‌లో మామూలుగా జరిగే విధంగానే, ఫీల్డింగ్ జట్టులో ఒకరు అంపైర్‌లను అడగడం ద్వారా వికెట్ కోసం అప్పీల్ చేయాలి. అన్ని స్టంపింగ్‌లను, స్ట్రైకర్ ఎండ్‌లో జరిగే రనౌట్ అప్పీళ్లనూ స్క్వేర్-లెగ్ అంపైర్ నిర్ణయిస్తాడు.
స్టంపింగ్ అనేది క్యాచ్, బౌల్డ్, లెగ్ బిఫోర్ వికెట్, రనౌట్ ల తర్వాత ఐదవ అత్యంత సాధారణమైన ఔట్.[3] అయితే ఇది ట్వంటీ 20 క్రికెట్ వంటి పొట్టి ఆటలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఆటల్లో బ్యాటర్లు దాడి చేసే ఊపులో ఉంటారు కాబట్టి తరచుగా బ్యాలెన్స్ కోల్పోతారు లేదా బంతిని బాగా కొట్టడానికి ఉద్దేశపూర్వకంగా క్రీజును వదిలి బయటికి వస్తారు.
చాలా స్టంపింగ్ అవుట్‌లను కీపర్ 'నిలబడటం' పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మీడియం లేదా స్లో బౌలర్, ముఖ్యంగా స్లోయర్ స్పిన్ బౌలర్ బౌలింగులో ఇది జరుగుతుంది. ఫాస్ట్ బౌలరు బౌలింగు చేసేటపుడు కీపర్ దూరంగా నిలబడితాడు. అప్పుడు, వికెట్-కీపర్ బెయిల్‌లను తొలగించడానికి స్టంప్‌ల మీదికి బంతిని విసిరి స్టంపౌట్ సాధించవచ్చు. ఇతర ఫీల్డర్‌లు అలా విసిరితే అది రన్ అవుట్ అవుతుంది .
స్టంపింగ్ అనేది తరచుగా ఫీల్డింగ్ జట్టు వేసిన ప్లానుకు అనుగుణంగా ఉంటుంది. బౌలరు, వికెట్ కీపర్ల మధ్య సహకారాన్ని బట్టి ఉంటుంది: బౌలరు బ్యాటర్‌ను క్రీజు నుండి బయటకు రప్పిస్తాడు - ఉదాహరణకు బ్యాటర్‌ను టెంప్ట్ చేయడానికి షార్ట్ లెంగ్తు బంతిని వేసి, హాఫ్-వాలీని సృష్టించి, బ్యాటరును క్రీజు నుండి అడుగు బయట వేయిస్తాడు. బ్యాటరు బంతిని మిస్ అయితే, కీపర్ దానిని పట్టుకుని, బ్యాటరు తిరిగి క్రీజు లోకి చేరేలోపు వికెట్‌లను కొట్టేస్తాడు.
స్టంపింగ్ చేసే ముందే బెయిల్‌లను తీసివేసినట్లయితే (ఉదాహరణకు కీపర్ పాదాలు తగిలి), వికెట్ కీపరు, బంతిని చేతిలో పట్టుకుని ఉన్న సమయంలో ఒక స్టంప్‌ను నేలపై నుండి తీసివేస్తే, బ్యాటరు స్టంపౌట్ అయినట్లే.
బ్యాటరు వైడ్ డెలివరీలో స్టంప్ అవుట్ కావచ్చు.[4] ఈ సందర్భంలో బ్యాటింగ్ చేసే జట్టుకు ఒక పరుగు అదనంగా జమ చేయబడుతుంది. అంపైర్‌లు ఇద్దరూ స్కోరర్‌లకు సంకేతం ఇవ్వాలి: బౌలర్ ఎండ్ అంపైర్ వైడ్ అని సూచిస్తాడు, స్ట్రైకర్ ఎండ్ అంపైరు బ్యాట్స్‌మన్ ఔట్ అని సూచిస్తాడు.
నో బాల్‌లో బ్యాటర్‌ను స్టంపౌట్ చేయలేరు.
గమనికలు:
- పాపింగ్ క్రీజ్ అనేది క్రీజ్ మార్కింగుకు వెనుక అంచుగా నిర్వచించబడింది (అంటే వికెట్‌కు దగ్గరగా ఉండే అంచు). అందువల్ల, క్రీజ్ మార్కింగ్ పైన బ్యాట్ లేదా పాదం ఉన్న బ్యాటర్, కానీ క్రీజ్ మార్కింగ్ వెనుక నేలను తాకకుండా ఉంటే స్టంపౌట్ చేయవచ్చు. బ్యాటరు వెనుక పాదం బొటనవేలు మాత్రమే నేలను తాకి ఉండి, మిగతా పాదం పైకి లేపి ఉన్నట్లయితే ఇది చాలా సాధారణం.
- క్రికెట్ చట్టాల చట్టం 29 ప్రకారం వికెట్‌ను సరిగ్గా పడవేయాలి: వికెట్‌ను పడేసే సమయంలో బంతిని గానీ, బంతిని తాకి ఉన్న చేతిని గానీ ఉపయోగించాలి. వికెట్ కీపర్ నుండి బంతి కేవలం రీబౌండ్ అయి, వికెట్లను పడవేసినా కూడా స్టంపింగ్ చెల్లుతుంది.
- బంతి బ్యాటర్‌ను గానీ, అతని బ్యాట్‌ను తాకని పక్షంలో వికెట్ కీపర్ బంతిని తీసుకునేముందు దానిని స్టంప్‌లను దాటనివ్వాలి (చట్టం 21.9). [5] వికెట్ కీపర్ అలా కాక ముందే బంతిని తీసుకుంటే అది డెలివరీ నో బాల్ అవుతుంది, బ్యాటరును స్టంపౌట్ చేయలేరు. రనౌట్ కూడా ఇవ్వలేరు, బ్యాటరు పరుగు కోసం ప్రయత్నిస్తే తప్ప.[6]
- స్ట్రైకర్ గాయపడి, రన్నర్‌ను పెట్టుకుని ఆడుతూంటే (ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇప్పుడూ దీనికి అనుమతి లేదు), రన్నర్ తమ క్రీజ్‌ను విడిచిపెట్టి ఉండగా, కీపరు వికెట్లను పడవేస్తే అది స్టంపౌట్ కాకుండా రనౌట్ అవుతుంది.
రికార్డులు
మార్చు
|
|
వెస్టిండీస్‌కు చెందిన కీమో పాల్‌ను కేవలం 0.08 సెకన్లలో అవుట్ చేసినందుకు MS ధోని, క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్టంపింగ్ రికార్డు సాధించాడు.[13]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Law 39 (Stumped)". Marylebone Cricket Club. 2013. Retrieved 5 January 2017.
- ↑ Marylebone Cricket Club, Tom Smith's Cricket Umpiring and Scoring, Marylebone Cricket Club, 2022
- ↑ "Analysing Test dismissals across the ages". ESPNcricinfo. 18 January 2013. Retrieved 5 January 2017.
{{cite web}}
: Check|url=
value (help)[permanent dead link] - ↑ "Ask Steven: Cricketing MPs, and stumped off a wide". ESPNcricinfo. Retrieved 2020-09-10.
- ↑ ball "MCC - No ball". MCC. Retrieved 30 October 2022.
{{cite web}}
: Check|url=
value (help)[permanent dead link] - ↑ "Law 38 – Run out". MCC. Retrieved 17 September 2020.
- ↑ "Test matches – Wicketkeeping records – Most stumpings in career". ESPNcricinfo. Retrieved 8 January 2017.
- ↑ "One Day International matches – Wicketkeeping records – Most stumpings in career". ESPNcricinfo. Retrieved 8 January 2017.
- ↑ "Twenty20 International matches – Wicketkeeping records – Most stumpings in career". ESPNcricinfo. Retrieved 8 January 2017.
- ↑ "Women Test matches | Wicketkeeping records | Most stumpings in career". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-27.
- ↑ "Women ODI matches | Wicketkeeping records | Most stumpings in career". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-27.
- ↑ "Women T20I matches | Wicketkeeping records | Most stumpings in career". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-27.
- ↑ "Best Wicket Keepers in the World | Dhoni to Gilchrist, Top 10 List 2022". www.howzat.com. Retrieved 4 November 2022.