స్పందన పల్లి
స్పందన పల్లి (జననం 1992 సెప్టెంబరు 6)భారతీయ నటి, మోడల్. 2018లో, ఆమె ఫెమినా మిస్ ఇండియా ఛత్తీస్‌గఢ్‌ను కైవసం చేసుకుంది.
స్పందన పల్లి | |
---|---|
జననం | ఛత్తీస్‌గఢ్, భారతదేశం | 1992 సెప్టెంబరు 6
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | కేంద్రీయ విద్యాలయ, డోంగర్‌ఘర్ అమిటీ యూనివర్సిటీ, నోయిడా |
వృత్తి | మోడల్, సినిమా నటి |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుఆమె ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంనకు చెందిన తెలుగు కుటుంబంలో జన్మించింది. తండ్రి భారత సాయుధ దళాలలో ఉండడంతో ఆమె పాఠశాల విద్య మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్ లలో జరిగింది.
2017లో, ఆమె నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ నుండి హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది.
ఆమె ఖైరాఘర్‌లోని ఇందిరా కళా సంగీత్ విశ్వవిద్యాలయంలో కథక్ నేర్చుకుంది. కాలేజీ రోజుల్లో ఆమె శాస్త్రీయ నృత్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంది.
కెరీర్
మార్చుఆమె 2017లో మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకుంది. ఫెమినా మిస్ ఇండియా నిర్వహించిన మిస్ ఐకాన్ ఛత్తీస్‌గఢ్ 2017, మిస్ గెట్‌అవే గాడ్స్ 2018లతో సహా పలు అందాల పోటీలలో ఆమె టైటిల్స్ గెలుచుకుంది. ఆమె ఫెమినా మిస్ ఇండియా ఛత్తీస్‌గఢ్ 2018 టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది.
ఇక నటనపై ఆమెకు ఉన్నమక్కువతో 2020లో, ఎంత మంచివాడవురా! అనే తెలుగు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. 2021లో, మ్యాడ్ చిత్రంలో ఆమె మాధవ్ చిలుకూరి, రజత్ రాఘవ్, శ్వేతవర్మలతో కలసి ప్రధాన పాత్రలో నటించింది.[1]
2023లో, సోనీలివ్‌లో ప్రీమియర్ అయిన త్రీసీస్ అనే వెబ్ సిరీస్‌తో ఆమె ఓటిటిలోనూ అరంగేట్రం చేసింది. 2023లో, ఆమె జీ5 తెలుగు వెబ్ సిరీస్ పులి మేకలో శ్వేత పాత్రను పోషించింది.
రామ్ గన్నీ దర్శకత్వం వహించిన ఇంటరాగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ది ట్రయల్ (2023)లో యుగ్ రామ్, వంశీ కోటులతో పాటు ఆమె ప్రధాన పాత్రలో నటించింది.[2]
మూలాలు
మార్చు- ↑ "ఓ వేడుకలా ఉంటుంది |". web.archive.org. 2024-01-10. Archived from the original on 2024-01-10. Retrieved 2024-01-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "The Trail: Telugu's First Interrogative Film Set to Captivate Audiences In Theaters from November 24th". The Hans India (in ఇంగ్లీష్). 9 November 2023. Archived from the original on 14 November 2023. Retrieved 15 November 2023.