స్మిత్‌సోనియన్ సంస్థ

స్మిత్‌సోనియన్ సంస్థ ఒక విద్యా సంస్థ, పరిశోధన సంస్థ , సంగ్రహాలయాల సముదాయము. ఈ సంస్థను నడపడానికి నిధులు అమెరికా ప్రభుత్వము, దాతలు, విరాళములు , బహుమతుల దుకాణము/పత్రిక అమ్మకాలు వలన వచ్చిన లాభాల నుండి సమకూరుతుంది.. ఈ సంస్థ యొక్క భవనాలు, ఇతర వసతులు చాలా మటుకు వాషింగ్టన్ డి.సి.లో ఉన్నప్పటికీ, 15 సంగ్రహాలయాలు, 8 పరిశోధనా కేంద్రాలు న్యూయార్క్ నగరం, వర్జీనియా, పనామా , ఇతర ప్రాంతాలలో కూడా ఉన్నాయి. మొత్తము అన్నిటిలో సుమారుగా 14.2 కోట్ల ప్రదర్శనా వస్తువులు ఉన్నవని అంచనా. ఈ సంస్థ "స్మిత్‌సోనియన్" పేరుతో ఒక మాస పత్రికను ప్రచురిస్తున్నది.

వాషింగ్టన్ డి.సీలోని నేషనల్ మాల్ లో "క్యాసిల్"గా ప్రసిద్ధిపొందిన స్మిత్‌సోనియన్ భవనం సంస్థ యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నది

చరిత్ర

మార్చు

స్మిత్‌సోనియన్ సంస్థ స్థాపనకు ఒక బ్రిటిష్ శాస్తవేత్త .జేమ్స్ స్మిత్‌సన్ (1765-1829) మరణానంతరము ఇచ్చిన నిధులు తోడ్పడినవి. ఆ తరువాత అమెరికా శాసనసభ (కాంగ్రెస్) చేసిన చట్టముతో ఈ ప్రభుత్వ/ప్రైవేటు భాగస్వామ్య సంస్థ ఏర్పడినది.

స్మిత్‌సోనియన్ మ్యూజియంలు

మార్చు
 
జాతీయ వాయు , అంతరిక్ష మ్యూజియంలో అనేక రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి: ఫోర్డ్ ట్రైమోటర్ , డగ్లస్ డి.సి-3 (పైది , పైనుండి రెండవది)

స్మిత్‌సోనియన్ పరిశోధనా సంస్థలు

మార్చు