స్వరాజ్యం 1983 ఆగస్టు 5న విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ బ్యానర్ పై మాదాల రంగారావు నిర్మించిన ఈ సినిమాకు నవతరం యూనిట్ దర్శకత్వం వహించింది. మాదాల రంగారావు, శ్యామల గౌరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. [1]

స్వరాజ్యం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం నవతరం యూనిట్
తారాగణం మాదాల రంగారావు ,
శ్యామలగౌరి
నిర్మాణ సంస్థ నవతరం పిక్చర్స్
భాష తెలుగు

సినిమా సమీక్ష మార్చు

ప్రస్తుత వ్యవస్థ కుళ్ళిపోయిందనీ, దాన్ని సమూలంగా పెకళించి నూతన సమసమాజాన్ని స్థాపించడం ఒక్కటే పరిష్కారమని చెబుతూ, ఇది ఒక్క రక్తపాతం వల్లనే సాధ్యమవుతుందని ఈ చిత్రం ఇచ్చే అంతర్గత సందేశం.

మన సమాజ వ్యవస్థ క్షీణదశకు చేరుకున్నదని నిరూపించడానికి ఈ చిత్రంలో పురోగామి పంథాన నడిచే ఒక కుటుంబ ఇతివృత్తాన్ని ఆలంబనగా చేసుకొని అది స్వార్థపరశక్తుల విలయ తాండవ పదఘట్టాంలో ఎలా నలిగి నాశనమైపోయిందో ఇందులో చూపించారు. స్వరాజ్యం కోసం సర్వశక్తులూ ధారపోసిన కుటుంబమిది. కానీ స్వరాజ్యం వచ్చిన తరువాత దాని ఫలితాలను అనుభవిస్తున్నది. స్వార్థపరశక్తులు, నీతిలేని రాజకీయ నాయకులు, ప్రజల్ని దోచుకునే వ్యాపార వర్గాలు, అవినీతికి పట్టం గట్టే ప్రభుత్వోద్యోగులు. కొడుకు నిరుద్యోగంతో విసిగి వేసారిపోతే భార్య అనారోగ్యానికి ఆహుతైపోగా ఒక్కగాని ఒక్క కూతురును తమ ఆలోచనా సరళితో ఏకీభవించే ఒక ముస్లిం యువకునికిచ్చి మతాంతర వివాహం జరిపిస్తాడు. తండ్రి అమరయ్య/ వ్యవసాయ కూలీల నాయకుడయిన అమరయ్యను ఆ ఊరి నాయకుల కుట్రతో జైలు పాలు చేయగా ఆ కేసులో తన తరపున వాదించిన అల్లుడు రహీం ను, ఆఖరుకు కూరురును కూడా ఆ నర రూప రాక్షసులు పొట్టన పెట్టుకుంటారు. ఈ అన్యాయాల్ని తానొక్కడుగా ఎదుర్కొని ఆఖరుకు ప్రతినాయకుని హత్య చేసికక్ష తీర్చుకోవడంతో విప్లవ సందేశం ముగుస్తుంది. [2]

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

  1. అమరవీరులెందరు
  2. చూడు చూడు నీడలు
  3. కాలేజి కుర్రవాడ కులాసాగ తిరిగినోడ
  4. మంచుకన్నా చల్లననా
  5. ఎందరో మరెందరు
  6. అప్పారావు ఓ అప్పారావు

మూలాలు మార్చు

  1. "Swarajyam (1983)". Indiancine.ma. Retrieved 2021-04-27.
  2. "చిత్ర సమీక్ష". indiancine.ma. 2021-04-27.{{cite web}}: CS1 maint: url-status (link)

బాహ్య లంకెలు మార్చు