స్వింగ్ చెక్ వాల్వు

(స్వింగు చెక్ వాల్వు నుండి దారిమార్పు చెందింది)

స్వింగ్ చెక్ వాల్వు ఒక ఏకదిశ ప్రవాహ కవాటం. ఏకదిశ ప్రవాహ కవాటం అనునది ఒక ప్రత్యేక రకమైన కవాటం.కవాటంలో రెండు పక్కల ప్రవహించు అవకాశం వుండగా ఏకదిశ ప్రవాహ కవాటంలో ప్రవాహం ఒకదిశలో మాత్రమే పయనించును.వ్యతిరేక దిశలో పయనించలేదు.

స్వింగ్ చెక్ వాల్వు రేఖాచిత్రం
Y రకపు స్వింగు చెక్ వాల్వు
నిలువుగా వున్న స్వింగు చెక్ వాల్వు/పంపు ఫూట్ వాల్వ్
స్వింగ్ చెక్ వాల్వు

కవాటం

మార్చు

కవాటం అనగా ఒక వ్యవస్థ లేదా గొట్టంలో ప్రవహిస్తున్న ఒక ద్రవం లేదా వాయువు యొక్క ప్రవాహాన్ని పూర్తిగా నిలిపి వేయునది, లేదా పాక్షికంగా ప్రవహించునటుల నియంత్రణ చేయునది, లేదా ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో గొట్టంలో ప్రవహించునటుల చేయు పరికరం[1]. ఇందులో ప్రవాహాన్ని నియంత్రణ చేయు కవాటబిళ్ళ యొక్క కాడ పిడి కల్గి వుండి, ప్రవాహం వెళ్ళునపుడు పిడిని ఒకదిశలో తిప్పడం వలన వాల్వు తెరచు కొనును.గొట్టం నుండి ద్రవ/వాయు ప్రవాహం /ప్రసరణ లేనప్పుడు, కవాటం తనకు తానుగా మూసుకోదు.తిరిగి కవాటం పిడిని వ్యతి రేకదిశలో తిప్పినపుడు మాత్రమే మూసుకొనును.

ఏకదిశ ప్రవాహ కవాటం

మార్చు

ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువులు కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును.[2] ఏకదిశ ప్రవాహ కవాటాన్ని ఆంగ్లంలో చెక్ వాల్వు అనియు, నాన్ రిటర్నువాల్వు అంటారు. వ్యతిరేక దిశలో ప్రవహించు టను తనకు తాను స్వయం ప్రీరితంగా నిరోధించును. ఏకదిశ ప్రవాహ కవాటంఒక విధంగా రక్షణ కవాటం/సేఫ్టి వాల్వుగా పనిచేయును.ఉదాహరణకుగ్లోబ్ వాల్వు లేదాప్లగ్ వాల్వు లేదా బాల్ వాల్వు లలో రెండు వైపులా ప్రవహిం చును. పైన పేర్కొన్న వాల్వులు అటోమాటిగా మూసుకోవు. గొట్టంలో ఒక ద్రవం కొంత పీడనంతో ఒక దిశలో ప్రవహిస్తూ, ఏదైనా కారణం చేత ప్రవాహం ఆగిన, ప్రవాహం వెళ్ళిన దిశలో/ మార్గంలో పీడనం ఎక్కువ ఉండుటచే, ద్రవం వెనక్కి ప్రవహించడం మొదలు పెట్టును.ఒక పంపు ద్వారా ద్రవం వెళ్ళుచు, పంపు ఆగిన గొట్టంలోని ద్రవం వ్యతిరేక దిశలో వెనక్కి పంపులోకి రావడం వలన పంపు/తోడు యంత్రం పాడై పో వును. ఒకవేళ కంప్రెసరు (వాయు సంకో చక యంత్రం) నుండి వాయువు పీడనంతో ప్రవహిస్తూ కంప్రెసరు ఆగిన, వాయువు ఎక్కువ పీడనం, త్వరణంతో వెన్నక్కి ప్రవహించడం వలన కంప్రెసరు పాడగును.బాయిలరు పని చేయునపు డు అందులో తయారగు స్టీము అధిక పీడనం కల్గి వుండును.కావున బాయి లరులో వున్న పీడనం కన్న ఎక్కువ పీడనంతో నీటిని పంపు ద్వారా పంపిస్తారు. ఎప్పుడైతే పంపు ఆపిన వెంటనే, బాయిలరులో పీడనం ఎక్కువగా వుండటం వలన స్టీము + నీరు వెనక్కి పంపులోకి, ఫీడ్ వాటరు టాంకులోకి ప్రవేశించి నష్టం వాటిల్లును.

అందువలన ఎక్కువ పీడనం, వేగంతో ఒక వ్యవస్థలో ద్రవం లేదా వాయువు ప్రవహిస్తున్నపుడు, ద్రవాన్ని లేదా వాయువును తోడుయంత్రం /పంపు ఆగినపుడు ప్రవాహం వెనక్కి ప్రవహించడం కుండా ఈ ఏకదిశ కవా టలు నిరోధించును.పంపుల ద్వారా నదులు, కాలువల నుండి నీటిని ఒవర్ హెడ్ ట్యాంకులను నీరును తోడునపుడు, పంపు ఆగిన, ఈ ఏకదిశ కవాటం లేనిచో ఒవర్ హెడ్ ట్యాంకులోని నీరంతా మరల కిందికి వచ్చును. బావుల నుండి, కాలువల నుండి నీటిని తోడు పంపుల సక్షను పైపు కింది భాగంలో వుండు ఫూట్ వాల్వ్ కూడా ఒకరకమైన ఏకదిశ కవాటమే.

స్వింగ్ చెక్ వాల్వు/ వూగే ఏకదిశ కవాటం

మార్చు

స్వింగ్ చెక్ వాల్వు/ వూగే ఏకదిశ కవాటం లోని భాగాలు

  • 1.బాడీ/బాహ్య ఆకృతి
  • 2.కవాటబిళ్ళ /డిస్కు
  • 3.మడతబందు/కీలు/భ్రమణ కీలకం
  • 4.గ్యాస్కెట్టులు

ఇది సాధారణంగా పోత ఇనుము లేదా పోత ఉక్కుతో చెయ్యబడి వుండును.బాడీ చివరలు పైపు బిగించుటకు మరలు వున్న స్క్రూడ్ ఎండ్ వాల్వు అంటారు.ఫ్లాంఝి వున ఫ్లాంజి ఎండ్ వాల్వు అంటారు. వాతావరణ పరిస్థితులను, వత్తిడిని తట్టుకునేలా గ్రే ఐరన్ (ఇనుము) తో కూడా చేస్తారు.బాడీని సాధారణంగా పైపుకు/గొట్టానికి క్షితిజ సమాంతరంగా బిగిస్తారు.నీరును బారీ ప్రమాణంలో తోడు పంపుల సక్షను గొట్టానికి ఫూట్ వాల్వుగా వాడునపుడు నిలువుగా బిగిస్తారు.

వాల్వు డిస్కు/కవాట బిళ్ళ

మార్చు

ఇది గుడ్రంగా వృత్తంలా వుండును.కవాట బిళ్ళను కదుపు, వూపు ఆధారం లేదా మడతబందు లేదా బ్రమణ కీలకం బిళ్ల ఒక అంచున లేదా బిళ్ల మధ్యగా అతికించబడి వుండును.బిళ్లకి కాడ మధ్యలో లేదా వృత్తాకార అంచున వుండును.కాడ చివర రంధ్రం వుండును.ఈ రంధ్రం సహాయంతో బిళ్ళనుకీలుకు బిగిస్తారు.బిల్లకాడ, కీలు కలిసి మడత బందులా పనిచేసి కవాట బిళ్ళ ఒకదిశలో పైకి కిందికి కదులును.

నిర్మాణం

మార్చు

ఇందులో ప్రవాహాన్ని అనుమతించు వాల్వు బిళ్ళ, వర్తులంగా వుండి, ఒక చివర మడతబందు/కీల ద్వారా వాల్వు బాడీకి బిగింపబడి వుండును.కొన్నింటిలో బిళ్ళ మధ్య భాగం నుండి వంపు కాడ వుండి కాడ చివరి భాగం మడత బందుకు బిగింపబడి వుండును.ఈ డిస్కు ఒక దిశలో మాత్రమే పైకి కిందికి కదులును.వాల్వు బాడీ నిటారుగా వంపులేని ఆకృతి లేదా Y ఆకారంలో వుండును. వాల్వును సాధారణంగా క్షితిజ సమాంతరంగా అమర్చే దరు. కొన్ని సందర్భాలలో వాల్వులను నిలువుగా కుడా బిగిస్తారు. మడతబందుకు బిగించిన బిళ్ళ సాధారణంగా కాస్ట్ ఐరన్ తో చెయ్యబడి బరువుగా వుండును. కవాట బిళ్ళ నేరుగా బాడీ వాల్వు సీట్ హోల్/పీఠ రంధ్రం (seat ring) మీద అనివుండును.లేదా తోలు లేదా రబ్బరు రింగు వాల్వు బిళ్ళకు అతికించబడివుండటం వలన, ద్రవం కవాట బిళ్ళ, కవాట సీట్ మధ్య నుండి బయటికి కారే అవకాశం వుండదు[3].

క్షితిజ సామాంతరంగా గొట్టానికి బిగించివున్న కవాటంలో కవాట బిళ్ళను బాడీకి పైనున్న మడతబందుకు వేలాడతీస్తారు.y ఆకారపు కవాటానికి/కవాటబిళ్ళ ఏటవాలుగా వేలాడుతుండును.వాల్వుబాడీ మీద ప్రవాహ దిశను సూచి స్తూ ఒక బాణం గుర్తు వుండును. దానితో పాటు కవాటం సైజు, కవాటం తరగతి కూడా ముద్రింపబడి వుండును

వినియోగం

మార్చు
  • 1.సాల్వెంట్ ఎక్సుట్రాక్షను ప్లాంటులలో ( తవుడు నుండీ, తెలగపిండి (oil cale) నుండి నూనె పరిశ్రమలో 10 మీటర్ల ఎత్తులో ఒక ఒవరు హెద్దు ట్యాంకు వుండును.దానినుండి ఒక లైను ప్రధానప్లాంటూ వాటరు హెడరుకు కలపబడి వుండి, హెడరు వైపు బాణం అంచు వుండేలా (అనగా రివర్సులో) బిగించబడి వుండును.ప్లాంటుకు 1.0-1.5 కీజిల వత్తిడిలో ఒకపంపుద్వారా ఈ హెడరుకు నీరు వస్తూవుంటుంది. హెడరులోని నీఋఊ కండెన్సరులలోకి వెళ్లి, అందులోని వాయు రూపంలోని హెక్సేనును ద్రవంగా మార్చును. హెడరులోనినీటి వత్తిడి వలన వాల్వు డిస్కు వెనక్కి బలంగా నొక్కబడి, నీరు ట్యాంకు నుండి కిందికి రాదు.కరెంటు పోయినపుడు పంపు ఆగిన వెంటనే, వాల్వు కవాట బిళ్ల మీడి వత్తిడి సున్నాకు పడిపొవడం తో, ట్యాంకులోని వాటరు కల్గుగచేయు వత్తిడి వలన వాల్వు బిల్ల తెరచుకుని నీరు వోవరు హెడ్ ట్యాంకునుండి హెడరుకు, అక్కడి నుండి కండెన్సరులకు వెళ్లును.
  • 2.ఫ్లష్ టాయిలెట్ లో వుండు ఫ్లఫ్ఫెర్ వాల్వు flapper ఒకరకమైన స్వింగ్ కవాటమే. ఇది ఫ్లష్ టాంకు అడుగు నుండి నీటిని టాంకులోకి అనుమతించును, కాని బయటకు వెళ్ళటాన్ని నిరోధించును. వాటరు, వ్యర్య జలాల ట్రీట్ మెంట్ ప్లాంట్లలో స్వింగ్ చెక్ వాల్వులను ఉపయోగిస్తారు.
  • అగ్నిమాపక వ్యవస్థలో నీటీని పంపు వాల్వులలో., వ్యర్ధ/మురికి నీటీ వ్యవస్థలో ఉపయోగిస్తారు[4]

బయటి లింకుల వీడియోలు

మార్చు

ఇవికూడా చదవండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "valve". businessdictionary.com. Archived from the original on 2007-03-27. Retrieved 2018-03-06.
  2. "UNDERSTANDING CHECK VALVES". waterworld.com. Retrieved 2018-02-03.
  3. "Check Valves". spiraxsarco.com. Archived from the original on 2017-08-25. Retrieved 2018-03-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Types of Check Valves and Their Recommended Applications". cpvmfg.com. Archived from the original on 2017-08-31. Retrieved 2018-03-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)