హెక్సేను
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
హెక్సేను (Hexane) రంగులేని, కొద్దిగా వాసన వున్న హైడ్రొకార్బను ద్రావణి (solvent). అల్కేను (Alkane) గ్రూపునకు చెందినది. పెట్రిలియం నుండి తయారగును. హెక్సేను హైడ్రోకార్బను శృంఖలం 6 కార్బనులను,14 హైడ్రోజను లను కలిగి వుండును. మాములు హెక్సేనును n-హెక్సేను అంటారు (n-:normal) అంటారు. నార్మలు హెక్సేను హైడ్రొకార్బను శృంఖలం సరళంగా వుండి ఎటువంటి శాఖలను కలిగివుండదు. నార్మల్ హెక్సేను యొక్క ఐసోమరులు మాత్రం శాఖలు కల్గివుండును. నార్మలు హెక్సేను, దాని ఐసోమరు లలో ద్విబంధాలు లేవు. హెక్సేనుకు 4 ఐసోమరులు ఉన్నాయి. హెక్సేను ఐసోమరులు శాఖలను కల్గివుండును.
![]() | |
![]() | |
![]() | |
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Hexane
| |
ఇతర పేర్లు
n-Hexane
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [110-54-3] |
పబ్ కెమ్ | 8058 |
డ్రగ్ బ్యాంకు | DB02764 |
కెగ్ | C11271 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:29021 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | MN9275000 |
SMILES | CCCCCC |
| |
ధర్మములు | |
C6H14 | |
మోలార్ ద్రవ్యరాశి | 86.18 g·mol−1 |
స్వరూపం | Colorless liquid |
సాంద్రత | 0.6548 g/mL |
ద్రవీభవన స్థానం | −95 °C (−139 °F; 178 K) |
బాష్పీభవన స్థానం | 69 °C (156 °F; 342 K) |
13 mg/L at 20 °C[1] | |
స్నిగ్ధత | 0.294 cP |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R11 R38 మూస:R48/20 మూస:R62 R65 R67 మూస:R51/53 |
S-పదబంధాలు | (S2) S9 S16 S29 S33 మూస:S36/37 S61 మూస:S62 |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
హెక్సేను రసాయన ఫార్ములా:CH3 (CH4) CH3
ఐసోమరులుసవరించు
- 1. 2-మిథైల్ పెంటెను : (CH3) 2CH (CH2) 2CH3
- 2. 3-మిథైల్ పెంటెను : CH3CH2CH (CH3) CH2CH3
- 3. 2,3-డైమిథైల్ బ్యుటేను :CH3CH (CH3) CH (CH3) CH3
- 4. 2,2-డైమిథైల్ బ్యుటేను :CH3C (CH3) 2CH2CH3
Common name | IUPAC name | Text formula | Skeletal formula |
---|---|---|---|
normal hexane n-hexane |
hexane | CH3 (CH2) 4CH3 | |
isohexane | 2-methylpentane | (CH3) 2CH (CH2) 2CH3 | |
3-methylpentane | CH3CH2CH (CH3) CH2CH3 | ||
2,3-dimethylbutane | CH3CH (CH3) CH (CH3) CH3 | ||
neohexane | 2,2-dimethylbutane | CH3C (CH3) 2CH2CH3 |
భౌతిక లక్షణాలుసవరించు
భౌతిక ధర్మాలు | |
---|---|
అణుపార్ములా | C6H14 |
అణుభారం | 86.18గ్రామ్/మోల్ |
ద్రవీభవన స్ధానం | -950Cవద్ద |
మరుగు స్ధానం | 68.70Cవద్ద |
సాంద్రత | 0.6594కె.జి/లీ./200Cవద్ద |
బాష్పపీడనం | 124టారు/200Cవద్ద |
స్నిగ్ధత | 0.31cP/250Cవద్ద |
స్వయందహనఊష్ణోగ్రత | 233.90Cవద్ద |
నీటిలోద్రావణీయత | 13మి.గ్రాం/లీ/20<sup<0Cవద్ద |
భారతదేశం పెట్రొలియం చట్టం 1934 (XXX of 1934), 1976 చట్టం ప్రకారం హెక్సేను 'పెట్రొలియం తరగతిA (classA) ' కు చెందిన పెట్రొలియం ఉత్పత్తి. అనుమతి లేకుండగా ఎక్కువ పరిమాణంలో నిల్వవుంచరాదు. ఛీఫ్ కంట్రొలరు ఆఫ్ ఎక్సుఫ్లొసివ్స్, నాగపూరు నుండి ఫారం 'XIII' ద్వారా అనుమతి పొందిన తరువాత మాత్రమే ఎక్కువ ప్రమాణంలో నిల్వ వుంచుకోవాలి. హెక్సేను బాష్పపీడనం (vapor pressure) ఎక్కువ.అందుచే మాములు ఉష్ణోగ్రత వద్ద కూడా అతి త్వరతంగా బాష్పికరణ చెందును.అరచేతిలో కొంచెం హెక్సేను తీసుకున్నచో శరీర ఉష్ణోగ్రతను గ్రహించి క్షణాలలో వాయువుగా మారును. బాష్పపీడనం అధికం కావడం వలన అతిత్వరగా చిన్ననిప్పురవ్వ తగిలినను గాలితో కల్సిమండును. అందుచే హెక్సేనును బారీస్దాయిలో నిల్వవుంఛునప్పుడు అగ్నిప్రమాదం జరుగకుండగా పటిష్ఠమైన అగ్నిప్రమాద నిరోధక జాగ్రత్తలు తీసు కొవాలి. అగ్నిమాపక శాఖ వారి సహాయంతో మాక్‌డ్రిల్ నిర్వహించవలెను.నూనె గింజల నుండి, ఆయిల్ కేకునుండి నూనెను తీయు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్‌లలో హెక్సేనును నూనెను తీయుటకు సాల్వెంట్‌గా వాడెదరు. అందుచే సాల్వెంట్ ప్లాంట్‌లలో అధిక మొత్తంలో హెక్సేనును నిల్వ వుంచెదరు. అగ్నిప్రమాదం నుండి రక్షణకై సాల్వెంట్ ప్లాంట్‌లలో హెక్సేనును భూమిలోపల వుంచిన స్టోరెజి టాంకులలో నిల్వచెయుదురు. పెట్రొలు బంకులలోని పెట్రొల్, డిజిల్‌ను కూడా భూమిలో కప్పివుంచిన టాంకులలో నిల్వవుంచడము అందరుకు తెలిసిన విషయమే.హెక్సేను కొంతఎత్తునుండి ధారగా పడునప్పుడు స్థిరవిద్యుతును (static electricity) ను ఏర్పడును. ఆంతియే కాదు టాంకరుల ద్వారా హెక్సేనును రోడ్దు ద్వారా రవాణా చెయ్యునప్పుడు, కుదుపుల వలన టాంకరులో ముందుకు వెనుకకు హెక్సేను కదలటం వలన కూడా స్ధిరవిద్యుతు ఎర్పడును. ఆందుచే టాంకరును దిగుమతి చేయ్యవలసిన గమ్యస్దానానికి వచ్చిన తరువాత ఒక గంట సేపు అలాగే వదలి, ఆ తరువాత అన్‌లోడ్ చెయ్యుదురు. అంతియే కాదు అన్‌లోడింగ్ సమయంలో టాంకరులను, నిల్వటాంకులను, పైపులనురాగి తీగ ద్వారా ఎర్తు చెయ్యుదురు. హెక్సేను త్వరగా మండె లక్షణం వున్నప్పటికి, గాలిలో హెక్సేను నుండి వెలువడు వాయువులు 1.25-6.9% నిష్పత్తిలో వున్నపుడు, మాత్రమే మండును. గాలిలో హెక్సేను నుండి వెలువడు వాయువులు 1.25% కన్నతక్కువగా వున్నను, 6.9% కన్న ఎక్కువగా వున్నను మండదు. అందుచే పైన పెర్కొన్ననిష్పత్తిలో హె క్సేను వాయువు, గాలి లేకుండగా జాగ్రత్త తీసుకోవాలి.
ఉపయోగాలుసవరించు
- 1. కొన్నిరకాల నూనెగింజల నుండి (సోయా, సాల్‌సీడ్, షియాసీడ్, మామిడి పిక్క, వంటివి), అయిల్ కేకుల నుండి, తవుడు నుండి సాల్వెంట్ ప్లాంట్‌ల ద్వారా నూనెను తీయుదురు. భారతదేశంలో 450 సాల్వెంట్ ప్లాంట్‌లున్నాయి. ఎడాదికి 400-500 లక్షల లీటరుల హెక్సేనును సాల్వెంట్‌గా సాల్వెంట్ ప్లాంట్‌లలో ఉపయోగిస్తున్నారు.
- 2. కొన్ని రకాల ఓషదు మొక్కల, పూల నుండి ఓషదులను, సువాసనద్రవ్యాలను సంగ్రహించుటకై హెక్సేను ఉపయోగిస్తారు.
- 3. పాదరక్షలను, చర్మ వుత్పత్తులను, పై కప్పులను అతికించు జిగురు ల తయారులో ఉపయోగిస్తారు.
- 4. వస్త్ర పరిశ్రమలలో తయారి సమయంలో వస్త్రాలకు అంటుకున్న గ్రీజు, నూనె మరకలను తొలగించుటకు వాడెదరు.
- 5. దుస్తుల, ఉన్నిబట్టల డ్రైక్లినింగ్‌లో కూడా ఉపయోగిస్తారు.
దుష్పలితాలుసవరించు
హెక్సేను తక్కువ స్దాయిలో విష లక్షణాలు కల్గివుంది. దీర్ఘకాలంగా హెక్సేను వాయువు ప్రభావానికి గురైనప్పుడు శ్వాసకోశ, నాడీవ్యవస్ధకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపు తక్కువ మోతాదులో (400-500 ppm) హెక్సేను వాయువులను పీల్చినప్పుడు తలనొప్పి, కళ్లు తిరగడం, మత్తుగా అవ్వడం జరుగుతుంది. ఎక్కువ మోతాదులో కొద్దిసేపు హెక్సెను వాయువులను పీల్చిన సృహ తప్పడం జరుగును. అటువంటి వ్యక్తిని బాగా గాలి అందు ప్రదేశంలో వుంచి గాలి ఆందినచో సృహలోనికి వచ్చును. చర్మం మీద పడిన, చర్మంలో వుండు నూనె గ్రంథుల నుండి నూనెను తొలగించడం వలన శరీరం పొడి బారిపోవును. సాల్వెంట్ ప్లాంట్‌లలో తీసిన నూనెలో 5-10 ppm వరకు హెక్సేను వుండును అయితే ఈ నూనెలను రిపైన్ చేసినప్పుడు తొలగింపబడును.
ఉత్పతిదారులుసవరించు
భారతదేశంలో సాల్వెంట్ ప్లాంట్‌లలో వాడు హెక్సేనును 1.హిందుస్థాన్ పెట్రొలియం కార్పొరెసను లిమిటెడ్ (HP, భారత్ పెట్రొలియమ్‌లిమిటెడ్ (BP, ఇండియన్ పెట్రొలియం అయిల్స్ లిమిటెడ్ (IOL) లు ఉత్పత్తి చెయ్యుచున్నవి. హెక్సేనును ఉత్ప్త్తిచెయ్యు రిఫైనరిలు, విక్రయకేంద్రాలు ముంబై, కలకత్తా, చెన్నై వద్దకలవు.ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో నున్న చెర్లోపల్లి, గుంటూరు దగ్గరి తాడేపల్లిలో హెక్సేనువిక్రయ డిపోలున్నాయి.