హంగరీలో హిందూమతం

హంగేరిలో హిందూ మతం మైనారిటీ మతం.

దేవనాగరిలో "ఓం" గుర్తు

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్‌నెస్

మార్చు

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) హంగేరిలో భక్తివేదాంత థియోలాజికల్ కాలేజీని నిర్వహిస్తోంది. ఈ కాలేజీకి హంగేరియన్ ప్రభుత్వం ఒక భవనాన్ని విరాళంగా ఇచ్చింది.

హంగేరిలో కృష్ణ భక్తులు మొట్టమొదటగా 1970ల చివరలో కనిపించారు. కానీ 1980ల మధ్యలో వచ్చిన మిషన్ యొక్క రెండవ తరంగంలోనే ఆచరణాత్మకంగా సంఘం అభివృద్ధి చెందింది.

హంగరీలో హరే కృష్ణలు

మార్చు

హంగేరిలో 8,000-12,000 మంది భక్తులు ఉన్నారని ఇస్కాన్ నాయకులు పేర్కొన్నారు. తమస్ బరాబాస్ (ఇస్కాన్ నాయకులలో ఒకరు) ప్రకారం, దేవాలయాలలో 190-200 మంది నివసిస్తున్నారు, 700-900 మంది తమ మతాన్ని నిష్ఠగా ఆచరిస్తారు. నాలుగు పండుగలలో 9,000-10,000 మంది వ్యక్తులు తమ పేర్లను ఇచ్చారు. వీరిలో చాలా మంది వివిధ కృష్ణ చైతన్య కార్యక్రమాలకు వెళతారు.

హంగరీలోని అతిపెద్ద ఇస్కాన్ కేంద్రం నైరుతి హంగరీలోని సోమోగ్వామోస్ అనే చిన్న గ్రామంలో ఉంది.

హరే కృష్ణలకు హంగేరిలో మొత్తం ఎనిమిది కేంద్రాలు ఉన్నాయి.

శివరామ స్వామి హంగేరిలో అధికారిక GBC ప్రతినిధి.

నందఫాల్వా హిందూ దేవాలయం

మార్చు

ఇది క్సోన్‌గ్రాడ్ కౌంటీలో ఓపుజ్టాజర్ నేషనల్ హెరిటేజ్ పార్క్ నుండి 19 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయం హంగేరియన్, హిందూ నిర్మాణ శైలుల అద్భుతమైన సంగమం. దీనిని గ్యులా స్జిగేటి నిర్మించారు.

దీనిని 1979లో స్వామి BA నారాయణ్, అతని అనుచరులూ నిర్మించారు. స్వామి BA నారాయణ్‌ను అతని ఆధ్యాత్మిక గురువు AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద హంగేరీకి పంపారు. నందగ్రామ్ అనే భారతీయ పవిత్ర స్థలం పేరిట నందఫాల్వాకు ఆ పేరు పెట్టారు. 20 సంవత్సరాల కార్యకలాపాల తర్వాత, 2000లో ఈ హిందూ దేవాలయం తలుపులు తెరిచారు. ఆలయ గోపురంలో ఉన్న 100 కిలోల గంట హంగేరియన్ సంప్రదాయానికి అనుగుణంగా ప్రతిరోజూ ప్రతిధ్వనిస్తుంది. 1993లో వ్యవస్థాపకుడు పరమపదించిన తర్వాత స్వామి BA పరమద్వైతి నేతృత్వంలో నడుస్తోంది. [1]

కృష్ణా లోయ

మార్చు
 
కృష్ణా లోయలో హరే కృష్ణుల దేవాలయం

కృష్ణా లోయ హంగేరిలోని సోమోగివామోస్ గ్రామంలో ఉన్న 660 ఎకరాల ఇస్కాన్ వ్యవసాయ క్షేత్రం. ఇక్కడికి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తారు. [2] ప్రస్తుతానికి, కృష్ణా-లోయలో 150 మంది నివాసులు ఉన్నారు. సంవత్సరానికి అదనంగా 30,000 మంది ప్రజలు సందర్శిస్తూంటారు లేదా మతపరమైన ఉత్సవాల్లో పాల్గొంటారు. కృష్ణా-లోయలో పర్యావరణ పాఠశాల కూడా ఉంది. [3]

చట్టపరమైన స్థితి

మార్చు

1989 నుండి హంగేరియన్ కృష్ణ చైతన్య భక్తుల సంఘం హంగరీలో నమోదిత మతంగా ఉంది. వారి సంస్థలో 50 మందిని నమోదు చేసుకున్నారు.

హరే కృష్ణలు, యెహోవాసాక్షులు, హంగేరియన్ చర్చ్ ఆఫ్ సైంటాలజీ, యూనిఫికేషన్ చర్చిలు 'విధ్వంసక శాఖలు' అయినందున వాటికి ప్రభుత్వ మద్దతు లభించదని పార్లమెంటు తీర్మానించింది.

1994 మార్చిలో, ఇస్కాన్‌కు ప్రభుత్వ మద్దతు ఇవ్వాలని పార్లమెంటు ఓటు వేసింది. దాంతో వారు ఇస్కాన్ 'విధ్వంసకరం' అనే తీర్పును ఉపసంహరించుకున్నారు. దాని మతపరమైన జీవితాన్ని, వారి స్వచ్ఛంద సేవలనూ గుర్తించారు.

2011లో కొత్త "మనస్సాక్షి, మతం, చర్చిలు, మతాలు, మత సంఘాలపై స్వేచ్ఛ హక్కుపై చట్టాన్ని" రూపొందించారు. ఇది కేవలం 14 మత సమూహాలను మాత్రమే గుర్తించింది. [4] హిందూ మతం దాని అధికారిక హోదాను కోల్పోయింది. [5] హిందూ ఫోరమ్ ఆఫ్ యూరప్, హిందూ అమెరికన్ సేవా ఛారిటీస్, హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్, హిందూ అమెరికన్ ఫౌండేషన్‌తో సహా యూరప్‌లోని అంతర్జాతీయ హిందూ సంస్థలు తమ తమ దేశాల్లోని హంగేరియన్ రాయబార కార్యాలయాల్లో ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్‌కు నేరుగా లేఖలు పంపాయి. [6] [7] 2012లో, ఈ చట్టాన్ని సవరించి, అధికారికంగా గుర్తింపు పొందిన చర్చిల జాబితాను 14 నుండి 32కి పెంచారు. [8] ఇందులో హంగేరియన్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌ను హంగేరిలో పూర్తి గుర్తింపు పొందిన చర్చిగా చేర్చారు. [9]

బ్రహ్మ కుమారీ కేంద్రాలు

మార్చు

హంగరీలో బ్రహ్మ కుమారీస్‌కు 4 కేంద్రాలు ఉన్నాయి

ఇవి కూడా చూడండి

మార్చు

ప్రస్తావనలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-01. Retrieved 2022-01-16.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-01. Retrieved 2022-01-16.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-01. Retrieved 2022-01-16.
  4. "Churches Divided on Hungary's New Religion Law". 19 July 2011.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-01. Retrieved 2022-01-16.
  6. "Jura Nanuk – Page 3".
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-01. Retrieved 2022-01-16.
  8. "In Hungary, amended religion law recognizes Seventh-day Adventist Church".
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-01. Retrieved 2022-01-16.