హంస
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
హంస ఒక అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి. 4,5 జాతులు ఉత్తర ధృవంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాలలోనూ, మరొక జాతి దక్షిణ అమెరికాలోను ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఉంటాయి. వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడినుండో తరలి వచ్చేవి. వాతావరణ మార్పులు కారణంగా నేడు ఇప్పుడు వాటి రాక లేదు.
హంసల జంట. | |
---|---|
Mute Swans (Cygnus olor) | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | Cygnus |
జాతులు | |
6-7 living, see text. | |
Synonyms | |
Cygnanser Kretzoi, 1957 |
హిందూమతంలో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. హంస సరస్వతిదేవి వాహనం. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని 'పరమహంస' అని ప్రస్తుతించేవారు. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్థ్యం ఉందంటారు, కాని అది పాలు నీరు కలిసిన మిశ్రమంలో నుండి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుంది. ఇది వేదాలలో హంసల గూర్చి అతిశయోక్తిగా చెప్పబడింది.
ఇతర విశేషాలు
మార్చు- అత్యదికంగా పురాణాలలో కల ప్రతి కథలో దీని ప్రస్తావన ఉంటుంది.
- హంస బ్రహ్మదేవుని, ఆయన భార్య అయిన సరస్వతి యొక్క వాహనము
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ వారి సరికొత్త బస్సు సర్వీసుకు రాజహంస అని పేరు పెట్టారు.
- ఇటీవల హైదరాబద్ - నెహ్రో జ్యూలాజికల్ పార్క్ కి తెల్ల హంసలు, నల్లహంసలు తీసుకురాబడినవి
చిత్రమాలిక
మార్చు-
హంసల జంట
-
హంస
-
ఐస్ లాండ్ నుండి రష్యాలో ప్రాంతాలకు వలల పోయిన హంసలు
-
ఇటలీ లోని మ్యూట్ హంస
మూలాలు
మార్చుఇతర లింకులు
మార్చు- The Swan Sanctuary Shepperton,England
- A Colony of Swans in Adda River (Italy) Archived 2016-05-16 at the Wayback Machine Video on You Reporter
- Swan photos on Imeleon
- Swan videos Archived 2012-07-19 at the Wayback Machine on the Internet Bird Collection
- Swan paintings on Artinthepicture
- A History of British Birds