పసుపులేటి హనుమంతరావు

హైదరాబాదుకు చెందిన వైద్యుడు, సామాజిక కార్యకర్త
(హనుమంత రావు పసుపులేటి నుండి దారిమార్పు చెందింది)

పసుపులేటి హన్మంతరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యుడు. ఆయన డెవలప్‌మెంటల్ పీడియాట్రిక్స్, రిహాబిలిటేషన్ మెడిసిన్, సైకాలజీలో తన స్పెషలైజేషన్‌కు అంతర్జాతీయంగా ప్రసిద్ది చెంది మానసిక వికలాంగులకు, వికలాంగులకు పునరావాసం కల్పించేందుకు కృషి చేశాడు. హనుమంతరావు 2023లో భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు.[1] ఆయన ఆ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2023 మార్చి 22న అందుకున్నాడు.[2]

పసుపులేటి హనుమంతరావు

పద్మ శ్రీ
జననం1945 సెప్టెంబర్‌ 16
హైదరాబాద్‌ , తెలంగాణ, భారతదేశం
విద్యాసంస్థకాకతీయ మెడికల్‌ కాలేజీ (ఎంబీబీఎస్‌)
వృత్తిడాక్టర్‌
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వీకార్‌, ఉపకార్‌ చైర్మన్‌
పురస్కారాలు పద్మశ్రీ

జననం, విద్యాభాస్యం

మార్చు

పసుపులేటి హనుమంతరావు 1945 సెప్టెంబరు 16న హైదరాబాద్‌ పాతబస్తీలో జన్మించాడు. ఆయన 1964లో కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, ఆ తర్వాత నీలోఫర్‌ ఆస్పత్రిలో పీడియాట్రిక్స్‌లో ఎండీ, ముంబైలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌లో రిహాబిలిటేషన్‌ మెడిసిన్‌లో, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిహాబిలిటేషన్‌ సైకాలజీలో పీహెచ్‌డీ చేశాడు.

సేవ కార్యక్రమాలు

మార్చు

పసుపులేటి హనుమంతరావు పికెట్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ సమీపంలో 1977లో మానసిక వికలాంగుల కోసం స్వీకార్‌ అకాడమీ ప్రత్యేక ఆస్పత్రి ప్రారంభిండు. వృద్ధులు, వితంతువులు, నిరుపేదల సంరక్షణ, తదితర రంగాలలో సేవలందిస్తున్నారు. పిల్లల, రిహాబిలిటేషన్‌, సైకాలజీ వైద్యుడిగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందారు.

పురస్కారాలు

మార్చు

పసుపులేటి హనుమంతరావుకు ఆరు గౌరవ ప్రెసిడెంట్‌ అవార్డులతో పాటు 37 రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు 2023లో భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డుకు ఎంపికై[3], ఆ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2023 మార్చి 22న అందుకున్నాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (26 January 2023). "దివ్యాంగ బాలల ప్రేమికుడికి పద్మశ్రీ". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
  2. Andhra Jyothy (23 March 2023). "పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు". Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.
  3. Andhra Jyothy (26 January 2023). "పిల్లల వైద్యుడికి పద్మశ్రీ". Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.
  4. Prajasakti (22 March 2023). "ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం." (in ఇంగ్లీష్). Archived from the original on 26 మార్చి 2023. Retrieved 26 March 2023.
  5. Eenadu (26 March 2023). "ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.