హమ్ద్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హమ్ద్ (అరబ్బీ: حمد) అనునది అల్లా (పరమేశ్వరుడు) ని స్తుతించే కీర్తన లేదా స్తోత్రం. హమ్ద్ సాధారణంగా అరబ్బీ భాష, పర్షియన్ భాష, పంజాబీ భాష, ఉర్దూలో వ్రాయబడే సంప్రదాయమున్నది. హమ్ద్ అను పదము ముస్లింలు అల్లాహ్ ప్రపంచంగా భావించే ప్రసిద్ధ గ్రంథం ఖురాన్ నుండి వచ్చింది. దీని యొక్క ఆంగ్లంలో సమానార్థం "Praise". అనగా "స్తుతి".
స్తోత్రం చేసే ప్రాంతాలు,విధానం
మార్చుహమ్ద్ (పరమేశ్వరుడి స్తోత్రం) ఒక మతానికి సంబంధించినది ఎంతమాత్రమూ గాదు. ప్రతి మతంలోనూ ఈశ్వర స్తోత్రమున్నది. ముస్లింలు అల్లాహ్ స్తోత్రాన్ని హమ్ద్-ఓ-సనా అని పలుకుతారు.ఖురాను యొక్క మొదటి సూరా, సూర-యె-అల్ హమ్ద్. సూర-యె-అల్ హమ్ద్ ఈవిధంగా ప్రారంభమౌతుంది.
- అల్ హమ్-దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనగా అన్ని స్తోత్రములు సర్వప్రపంచాల రబ్ (అల్లాహ్) కొరకే.
ఈ సూరాలో అల్లాహ్ స్తోత్రము గలదు గనుక దీనికి అల్ హమ్ద్ (స్తోత్రములు గల) అనే పేరు.
ఈ హమ్ద్‌ను ప్రపంచంలో ముస్లింలు ఉన్న ముఖ్య ప్రాంతాలైన ఇండోనేషియా నుండి మొరాకో వరకు గల ముస్లింలు ఆలపిస్తారు. ఖవ్వాలీ ప్రదర్శన అనేది సాధారణంగా ఒక హమ్ద్ ను కలిగి ఉంటుంది. ఖవ్వాలీ ప్రదర్శనలో సాంప్రదాయకంగా మొదటి పాట "హమ్ద్" ఉంటుంది.
సాహిత్యం
మార్చుహమ్ద్, కవితా సాహిత్యంలో ఒక కవితా రూపంగా అవతరించింది. కవులు అల్లాహ్ స్తోత్రములను హమ్ద్ రూపంలో రచిస్తారు. హమ్ద్ లను ప్రతి కవీ వ్రాసి తీరుతాడు అనే నానుడి. హమ్ద్ లను ఎక్కువగా ఖవ్వాలీ లలో గూడా చూడవచ్చు. హమ్ద్ లను ఆలపించేవారిలో నస్రత్ ఫతే అలీఖాన్, అజీజ్ మియాఁ, వహీద్ జఫర్, ఆంగ్లగాయకులు యూసుఫ్ ఇస్లాం, సమి యూసుఫ్ ప్రస్తావింపదగినవారు.