హమ్రో పార్టీ

రాజకీయ పార్టీ

హమ్రో పార్టీ అనేది భారతదేశంలోని డార్జిలింగ్ జిల్లా, కాలింపాంగ్ జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీ. హమ్రో పార్టీ 2021, నవంబరు 25న స్థాపించబడింది. పార్టీ అధ్యక్షుడు అజోయ్ ఎడ్వర్డ్స్, గతంలో గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు.[1]

హమ్రో పార్టీ
స్థాపకులుఅజోయ్ ఎడ్వర్డ్స్
స్థాపన తేదీ25 నవంబరు 2021 (3 సంవత్సరాల క్రితం) (2021-11-25)
కూటమిఇండియా కూటమి
శాసనసభలో సీట్లు
6 / 45

ఎన్నికల చరిత్ర

మార్చు

2022 ఫిబ్రవరిలో జరిగిన డార్జిలింగ్ మునిసిపాలిటీ ఎన్నికల్లో హమ్రో పార్టీ పోటీచేసింది. మొత్తం 32 సీట్లలో 18 సీట్లు గెలుచుకుని బోర్డును ఏర్పాటు చేసింది.[2] 2022, జూన్ 26న జరిగిన గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నికల్లో హమ్రో పార్టీ మొత్తం 45 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలను గెలుచుకుంది.[3][4] జిటిఏకి చెందిన ఇద్దరు హమ్రో పార్టీ కౌన్సిలర్లు 2022, నవంబరు 5న భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చాలో చేరారు.[5] డార్జిలింగ్ మునిసిపాలిటీకి చెందిన ఆరుగురు హమ్రో పార్టీ వార్డు కమీషనర్లు 2022, నవంబరు 24న భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చాలో చేరారు.[6][7] డార్జిలింగ్ మునిసిపాలిటీకి చెందిన మరో హమ్రో పార్టీ వార్డ్ కమీషనర్ 2023, మార్చి 21న బిజిపిఏంలో చేరారు.[8]

మూలాలు

మార్చు
  1. "New Hill party christened 'Hamro Party'". Millennium Post. 26 November 2021. Retrieved 11 June 2022.
  2. "West Bengal: Formed 3 months ago, Hamro Party beats major players in Darjeeling polls". The Times of India. 3 March 2022. Retrieved 11 June 2022.
  3. "GTA polls: Hamro Party to contest in all 45 seats". Millennium Post. 3 June 2022. Retrieved 11 June 2022.
  4. "North Bengal GTA Election Results 2022". Financial Express. 29 June 2022. Retrieved 30 June 2022.
  5. "Two Hamro Party GTA Sabhasads cross over to BGPM". Millennium Post. 6 November 2022. Retrieved 28 November 2022.
  6. "With BGPM set to wrest Darjeeling Municipality, Anit Thapa takes centre stage in hills politics". The Indian Express. 26 November 2022. Retrieved 28 November 2022.
  7. "Darjeeling municipality: Binay Tamang, Bimal Gurung add to chaos". The Telegraph. Retrieved 28 November 2022.
  8. "Hamro Party councillor switch relief for BGPM". The Telegraph. Retrieved 1 June 2023.