హరిలాల్ గాంధీ
హరిలాల్ మోహనదాస్ గాంధీ (హిందీ: हरीलाल गांधी), (1888 – జూన్ 18 1948) మహాత్మా గాంధీ, కస్తూరిబాయి గాంధీ ల యొక్క ప్రథమ పుత్రుడు.[1]
హరిలాల్ గాంధీ | |
---|---|
జననం | 1888 |
మరణం | జూన్ 18 1948 (వయస్సు 60సం.లు) |
జీవిత భాగస్వామి | గూలబ్ గాంధీ |
పిల్లలు | ఐదుగురు పిల్లలు |
తల్లిదండ్రులు | మహాత్మా గాంధీ కస్తూరిబాయి గాంధీ |
ప్రారంభ జీవితం
మార్చుహరిలాల్ గాంధీ ఆయన తండ్రి లాగానే బారిష్టర్ చేయుటకు ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్నాడు. ఆయన తండ్రి దానికి వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడుటకు పశ్చిమదేశాల విద్య ఏ విధంగానూ దోహదపడదని తెలియజేశాడు.[2] చివరికి, తన తండ్రి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 1911 లో హరిలాల్ గాంధీ అన్ని కుటుంబ సంబంధాలు పరిత్యజించారు.
ఆయన కొద్దికాలం ఇస్లాం మతానికి మారి తన పేరును "అబ్దుల్లా గాంధీ"గా మార్చుకున్నారు. కానీ తర్వాత కాలంలో ఆయన హిందూ మతానికి చెందిన ఆర్య సమాజం లోనికి మతమార్పిడి చేసుకున్నారు.[3]
హరిలాల్ గులాబ్ గాంధీ ని వివాహం చేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. వారిలో ఇద్దరు బాల్యంలోనే మరణించారు. హరిలాల్ గాంధీ యొక్క పెద్ద కుమార్తె "ఆమిబెహిన్" గారి కుమార్తె నీలం పారిఖ్ ఆయన జీవిత చరిత్రను రచించారు. దానిపేరు "గాంధీజీ లాస్ట్ జ్యూయల్:హరిలాల్ గాంధీ" (గాంధీజీ హరిలాల్ గాంధీలాంటి వజ్రాన్ని కోల్పోయాడు)
ఆయన మహాత్మాగాంధీ యొక్క అంత్య క్రియలకు హాజరైనాడు. ఆయనను అతి కొద్దిమంది గుర్తించారు. ఆయన జూన్ 18 1948లో లివర్ కాన్సర్ వ్యాధితో బొంబాయి లోని మ్యునిసిపల్ హాస్పటల్ లో మరణించారు.[4]
నా తండ్రి, గాంధీ
మార్చుమహాత్మాగాంధీ, హరిలాల్ గాంధీ మధ్య గల వైరుద్య సంబధాన్ని కథాంశంగా హిందీలో అనిల్ కపూర్ నిర్మాతగా, ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వంలో గాంధీ,మై ఫాదర్ అనే చిత్రం నిర్మాణమై ఆగష్టు 3 2007లో విడుదలైంది. ఈ చిత్రంలో హరిలాల్ పాత్రను "అక్షయ ఖన్నా" పోషించారు. ఖాన్ యొక్క నాటకం మహాత్మా vs గాంధీ, [5] పై చిత్రానికి వైవిధ్యంగా ఉంటుంది కానీ కథాంశం ఒక్కటే.అదే విధంగా మరాఠీ చిత్రం "గాంధీ విరుధ్ గాంధీ" కూడా విడుదలైంది.
ఇతర పఠనాలు
మార్చు- Harilal Gandhi: What Life [6] by Chandulal Bhagubhai Dalal
- Gandhiji's Lost Jewel: Harilal Gandhi by Nilam Parikh, grand daughter of Harilal Gandhi
- Mahatma Vs Gandhi by Dinkar Joshi
మూలాలు
మార్చు- ↑ *Gandhi Family Tree Archived 2007-10-12 at the Wayback Machine
- ↑ "The Hindu : Magazine / Cinema : The Mahatma and his son". Archived from the original on 2007-11-09. Retrieved 2014-04-23.
- ↑ http://www.indianexpress.com/news/-do-we-have-the-credentials-to-question-gandhi--is-harilal-the-yardstick-to-measure-the-mahatma--/222701/
- ↑ http://www.exoticindiaart.com/book/details/IDJ821/
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-06. Retrieved 2014-04-23.
- ↑ https://www.vedamsbooks.com/no49306.htm