కస్తూరిబాయి గాంధీ

మహాత్మా గాంధీ భార్య, బ్రిటీష్ శకం భారతీయ నాయకురాలు

కస్తూరిబాయి గాంధీ (11 ఏప్రిల్ 1869– 22 ఫిబ్రవరి 1944) మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భార్య. ఆమె 1883లో ఆయనను పెద్దలు కుదిర్చిన బాల్య వివాహం చేసుకుంది.

కస్తూర్బా గాంధీ
Kasturbai.jpg
జననం(1869-04-11) 1869 ఏప్రిల్ 11
పోరుబందర్, బాంబే స్టేట్, బ్రిటిష్ రాజ్
మరణం1944 ఫిబ్రవరి 22 (1944-02-22)(వయసు 74)
ఆగా ఖాన్ పేలస్, పూణే, బాంబే స్టేట్, బ్రిటిష్ ఇండియా
ఇతర పేర్లుBa
ప్రసిద్ధులుWife of మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
మతంహిందూ

బాల్య జీవితం, నేపథ్యంసవరించు

పోర్బందర్ లో ధనవంతుడైన వ్యాపారస్తుడైన గోకులదాస్ కపాడియాకు జన్మించిన కస్తూరిబాయి, సంబంధం కుదుర్చుకోవటం ద్వారా మోహన్ దాస్ కరంచంద్ గాంధీని వివాహం చేసుకుంది. అప్పుడు వారిద్దరి వయస్సు 13 సంవత్సరములు. 1888లో గాంధీ విద్యాభ్యాసం కొరకు లండన్ వెళ్ళినప్పుడు, ఆమె అప్పుడే జన్మించిన వారి కుమారుడు హరిలాల్ ను పెంచటం కొరకు ఇండియాలో ఉండిపోయింది. ఆమెకు నలుగురు కుమారులు: హరిలాల్ (1888), మణిలాల్ (1892), రాందాస్ (1897), మరియు దేవదాస్ (1900).

రాజకీయ జీవితంసవరించు

కస్తూరిబాయి గాంధీ తన భర్తతో కలిసి రాజకీయ నిరసన కార్యక్రమములలో పాల్గొంది. తన భర్తతో కలిసి ఉండటానికి 1897లో ఆమె దక్షిణాఫ్రికా వెళ్ళింది. 1904 నుండి 1914 వరకు ఆమె డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్ లో చురుకుగా పాల్గొంది. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యోగ పరిస్థితులకు వ్యతిరేకంగా 1913లో జరిగిన నిరసన సమయంలో, కస్తూరిబాయి అరెస్టు అయింది మరియు ఆమెకు మూడు నెలలు కఠిన కారాగార శిక్ష విధించబడింది. తరువాత, భారతదేశంలో తన భర్త జైలులో ఉన్న సమయంలో ఆమె కొన్నిసార్లు తన భర్త స్థానంలో పనిచేసింది. 1915లో, నీలిరంగును ఉత్పత్తి చేసే మొక్కలను పెంచే వారికి అండగా నిలవటానికి గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, కస్తూరిబాయి ఆయనతో పాటు వచ్చింది. స్త్రీలు మరియు పిల్లలకు ఆమె పరిశుభ్రత, క్రమశిక్షణ, చదవటం మరియు వ్రాయటం నేర్పించింది.

వ్యక్తిగతజీవితంసవరించు

 
1930లలో మోహన్ దాస్ గాంధీతో కస్తూరిబాయి గాంధీ.
 
గాంధీ మరియు అతని భార్య కస్తూరిబాయి గాంధీ (1902)

జనన సమయంలో వచ్చిన ఇబ్బందుల మూలంగా కస్తూరిబాయి దీర్ఘమైన శ్వాస నాళముల వాపుతో బాధపడింది. తన భర్త మనసు ఒక విషయం నుండి వేరొక విషయానికి మరలుతూ ఉంటే, ఆమె కొన్నిసార్లు సమస్యలతో మథనపడుతూ ఉండేది. క్విట్ ఇండియా మూవ్మెంట్ యొక్క అరెస్టుల ద్వారా ఒత్తిడి మరియు సబర్మతి ఆశ్రమంలో కఠినమైన జీవనం మూలంగా ఆమె జబ్బు పడింది. కస్తూరిబాయి శ్వాసనాళముల వాపుతో జబ్బుపడింది. అది తరువాత న్యూమోనియా (ఊపిరితిత్తుల వ్యాధి) తో మరింత తీవ్రం అయింది.

జనవరి 1944లో, కస్తూరిబాయికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆమె చాలాకాలం మంచంలోనే గడిపింది. అక్కడ కూడా ఆమెకు బాధ నుండి ఏమాత్రం ఉపశమనం దొరకలేదు. ఊపిరి అందకపోవటంతో కొన్నిసార్లు రాత్రిళ్ళు ఆమెకు నిద్ర కరువైంది. పరిచయం ఉన్న వైద్య విధానంలో చికిత్స కొరకు ఆత్రుతలో, కస్తూరిబాయిను ఒక ఆయుర్వేద వైద్యుడిని కలవవలసిందని చెప్పారు. పలు జాగుల తర్వాత (వీటిని గాంధీ అన్యాయముగా భావించాడు), ప్రభుత్వం సాంప్రదాయక భారతీయ వైద్యంలో నిపుణుడికి ఆమెకు చికిత్స చేయటానికి మరియు మందులను సూచించటానికి అనుమతి ఇచ్చింది. మొదట్లో ఆమెలో కొద్దిగా గుణం కనిపించింది- ఫిబ్రవరి రెండవ వారంలో కొద్దిగా కోలుకుని వరండాలో చక్రాల కుర్చీలో కొద్దిసేపు కూర్చుని, మాట్లాడేది... అప్పుడే ఆ జబ్బు మళ్ళీ తిరగబెట్టింది. ఆ వైద్యుడు ఆయుర్వేద మందు ఆమెకు ఇంక పనిచేయదు అని చెప్పాడు. దిగజారిపోతున్న ఆమె ధైర్యానికి "నీకు త్వరలోనే బాగవుతుంది" అని చెపుతూ అండగా నిలవటానికి ప్రయత్నించిన వారికి, కస్తూరిబాయి ఇలా సమాధానం చెప్పేది, "లేదు, నా కాలం తీరిపోయింది." ఆ సాయంత్రం సరిగ్గా ఏడు గంటల తర్వాత, దేవదాస్ మోహన్ దాసును మరియు వైద్యులను పక్కకు తీసుకువెళ్ళాడు. ఆమె పరిస్థితి చేతులు దాటిపోయిందని వైద్యులు చెప్పినా కూడా, బా జీవితాన్ని కాపాడే మందు ఇవ్వాలని అతను దీనంగా వేడుకున్నాడు. ఆ తరువాత అతను దాని గురించి ఈ విధంగా వర్ణించాడు "మా నాన్నతో నాకు జరిగిన వాదనలన్నింటిలో ఎన్నడూ లేనంత మధురమైనది". ప్రతి నాలుగు లేదా ఆరు గంటలకు ఒకసారి పెన్సిలిన్ ను సూదిమందు ద్వారా ఇవ్వాలని తెలుసుకున్న తర్వాత, మోహన్ దాస్ చివరకు తన చిన్న కుమారునికి ఆ ఆలోచన మానుకొమ్మని నచ్చచెప్పాడు. "ఆమె ఇన్ని బాధలు అనుభవించిన తర్వాత ఇంకా ఎందుకు నువ్వు నీ తల్లి వేదనను కొనసాగించాలని కోరుకుంటున్నావు?" అని గాంధీ అడిగాడు. అప్పుడు ఆయన ఈవిధంగా చెప్పాడు, "ఎంత అద్భుతమైన మందు వాడినా కూడా, ఇప్పుడు నువ్వు ఆమెకు నయం చెయ్యలేవు. కానీ నువ్వు పట్టుబడితే, నేను నీ దారికి అడ్డురాను."[1]

కొద్దిసేపటి తరువాత, కస్తూరిబాయి శ్వాస ఆగిపోయింది. వారిద్దరూ పూనా (ప్రస్తుతం పూణే) లో జైలులో ఉండగానే గాంధీ చేతులలో ఆమె మరణించింది.[2]

దస్త్రం:Kasturba gandhi burial.JPG
అగా ఖాన్ పాలెస్, పూణేలో ఆమె మరణించిన చోట మహాదేవ్ దేశాయ్ యొక్క జ్ఞాపక శిలతో పాటు కస్తూరిబాయి గాంధీ జ్ఞాపక శిల (కుడివైపున ఉన్నది).

సూచనలుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. Gandhi, Arun (1998). Daughter of Midnight: The Child Bride of Gandhi. Blake Publishing Ltd. pp. 296–299. ISBN 85782 2005 Check |isbn= value: length (help).
  2. Manas: History and Politics, కస్తూరిబాయిi గాంధీ