హరి చంద్ మిద్దా
హరి చంద్ మిద్దా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు జింద్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
హరి చంద్ మిద్దా | |||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | మాంగే రామ్ గుప్తా | ||
---|---|---|---|
తరువాత | క్రిషన్ లాల్ మిద్దా | ||
నియోజకవర్గం | జింద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | ఐఎన్ఎల్‌డీ | ||
నివాసం | హర్యానా |
రాజకీయ జీవితం
మార్చుహరి చంద్ మిద్దా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో జింద్ నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మాంగే రామ్ గుప్తాపై 7,862 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురీందర్ సింగ్ బర్వాలాపై 2,257 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
మరణం
మార్చుహరి చంద్ మిద్దా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2018 ఆగస్ట్ 26న మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[3][4]
మూలాలు
మార్చు- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The New Indian Express (20 September 2024). "Haryana assembly polls: Kin of key political families take poll plunge" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
- ↑ The Indian Express (27 August 2018). "INLD MLA Hari Chand Midha dies of cardiac arrest" (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2020. Retrieved 15 November 2024.
- ↑ The Times of India (21 August 2018). "INLD MLA passes away due to kidney disease". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.