హరి పున్నయ్య

హరి పున్నయ్య (1890 – 1970) కూచిపూడి కళాకారుడు.[1] ఆయన కూచిపూడి నృత్య నాటక సంప్రదాయంలో, భయానక, భీభత్స, రౌద్ర, వీర రసాలను పోషించే పాత్రలను ధరించి ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసి సుప్రసిద్ధ కళాకారులుగా వెలుగొందారు. వీరిది కూచిపూడి గ్రామం చిరకాలంగా కళాలక్ష్మిని ఆరాధించిన కళాజీవి.[2]

జీవిత విశేషాలుసవరించు

ఆయన లక్ష్మీదేవి, వెంకటచలపతి దంపతులకు జన్మించాడు. ఆయన ఆయన తండ్రి వద్ద చిన్ననాటి నుండి కుచిపూడి నాట్యవిద్యను అభ్యసించాడు. ఆయన వివిధ ప్రదర్శనలలో హిరణ్యకశిపుడు, బాణాసురుడు, విశ్వామిత్రుడు వంటి పాత్రలను వేసేవాడు. ఆయన వెంకటరామ నాట్యమండలి ద్వారా అత్యధిక కాలం వివిధ ప్రదర్శనలు యిచ్చాడు. తన తండ్రి సాంధించినన్ని విజయాలు సాధించలేక పోయాడు. తరువాత నాట్యకళనుండి విరమణ చేసి వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నాడు. ఆయన నాట్య ఆభరణాలు తయారుచేయడంలొ సిద్ధహస్తుడు.[3]

మూలాలుసవరించు

  1. Kuchipudi,By Sunil Kothari, Avinash Pasricha
  2. తెలుగు వారిజానపద కళారూపాలు- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి - 253 పుట
  3. "కూచిపూడి వెబ్‌సైటులో ఆయన జీవిత చరిత్ర". Archived from the original on 2016-10-25. Retrieved 2016-11-13.

ఇతర లింకులుసవరించు