హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ తెలంగాణలో నిర్మించిన తొలి స్వర్ణ దేవాలయం. దీనిని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2018 లో ప్రారంభించాడు. ఇది హైదరాబాద్ లోని  బంజారా హిల్స్‌లో ఉంది.  ఈ దేవాలయ ప్రాంగణంలో రెండు మందిరాలు ఉన్నాయి. మొదటి మందిరం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాగా రెండవ మందిరంలో శ్రీశ్రీ రాధా-గోవిందుడు దర్శనం ఇస్తాడు.[1]

స్థల పురాణం

మార్చు

సుమారు 7000 సంవత్సరాల క్రితం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12వద్ద భగవంతుడు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశాడు. భగవాన్ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామితో పాటు, శివుడు కూడా స్వయంభూ శ్రీ పాంచజన్యేశ్వర స్వామిగా అదే స్థలంలో వెలిశాడు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సతీ సమేతంగా నిలబడి వున్న భంగిమలో ఆనందభరితమైన దివ్య స్థితిలో దర్శనమిస్తాడు.

ఈ అతీంద్రియ ఆలయంలో 50 అడుగుల బంగారు ధ్వజ స్తంభం, 4600 చదరపు అడుగుల మహా మండపం, ఐదు బంగారు మెట్లు ఉన్నాయి.

ఈ ఆలయంలో ధ్వజ స్తంభం తర్వాత హరినామ జప మంటపం ఉంది. శ్రీకృష్ణుని దర్శనం కోసం ముందుకు సాగుతున్నప్పుడు అతని పవిత్ర నామాలను జపించడం ద్వారా ఆయనను స్మరించుకోవడానికి, కీర్తించడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అందిస్తుంది. ఆలయాన్ని సందర్శించే సందర్శకులు హరినామ మంటపం గుండా వెళ్లవచ్చు లేదా నేరుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వెళ్లవచ్చు. జప మంటపానికి 108 మెట్లు ఉన్నాయి  ప్రతి మెట్టుపై భక్తులు నిలబడి హరే కృష్ణ మహా-మంత్రాన్ని జపిస్తారు. పీఠాధిపతి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గర్భాలయంలో అరుదైన శాలిగ్రామం గల శిల ఉంది. ఈ శాలిగ్రామ శిల నేపాల్ ముక్తినాథ్ ఆలయం సమీపంలో గండకీ నదిలో కనుగొనబడింది.     

మూలాలు

మార్చు
  1. Today, Telangana (2023-05-04). "Hyderabad: Sri Narasimha Jayanti celebrated at Hare Krishna Golden Temple". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2023-06-28.